చినప్పారావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాగిరెడ్డి, వైసీపీ నాయకులు

విశాఖపట్నం, ఏప్రిల్ 2 (న్యూస్‌టైమ్): సీనియర్ రాజకీయ నాయకుడు, గాజువాక వర్తక సంఘం పూర్వ అధ్యక్షుడు తిప్పల చినప్పారావు ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు, నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. టీఎన్ఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, జీవీఎంసీ గాజువాక జోన్ పరిధిలోని వివిధ వార్డులకు చెందిన వైసీపీ కార్పొరేటర్లు హాజరై చినప్పారావు చిట్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాక వర్తక సంఘం ఏర్పాటు అయిన దగ్గర నుండి తుదిశ్వాస వరకూ చినప్పారావు అటు వర్తకులు, ఇటు కళాసీల సంక్షేమానికి ఎంతగానో కృషిచేశారన్నారు. క్రమశిక్షణకు మారుపేరైన చినప్పారావు తన కుటుంబ సభ్యుడైనందుకు సంతోషపడుతున్నానన్నారు. ఆయన ఏ పని చేపట్టినా, ఏ పార్టీలో ఉన్నా తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఏ నాడూ వీడలేదన్నారు.

కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు తిప్పల వంశీరెడ్డి, రాజాన రామారావు, బొడ్డు నరసింహ పాత్రుడు (కేబుల్ మూర్తి), మహ్మద్ ఇమ్రాన్, వైసీపీ నాయకులు మార్డుపూడి పరదేశి, ఈవీ అప్పారావు, దొడ్డి రమణ, రాజాన వెంకటరావు, వెంపాడ నక్క వెంకట రమణ, అప్పారావు, ధర్మాల శ్రీను, పిట్టా రెడ్డి, గంట్యాడ గురుమార్తి, కొయ్య భారతి, ఈగలపాటి యువశ్రీ, సంపంగి ఈశ్వరరావు, గండ్రెడ్డి రామునాయుడు, బోగాది సన్ని, కటికల కల్పన, గంగూలూరి రోజారాణి, గొందేశి శ్రీనువాస్ రెడ్డి (బుజ్జీ), జీవీ రమణారెడ్డి, జీవీవీ శ్రీనువాసు, గొర్సు సత్యం, గొందేశి రాము, పూతి తాతారావు, ఒమ్మి ఈశ్వరీ, ములకలపల్లి వెంకటేశ్, దర్మపురి చక్రీ, గొందేశి నాగిరెడ్డి తదితరలు పాల్గొన్నారు.