సీఎం సహాయనిధికి ఏసీఎ సాయం

0
10 వీక్షకులు

అమరావతి, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కోటి రూపాయల విరాళాన్ని అందించింది. కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు, భౌతిక దూరం పాటించడంలో భాగంగా ఏసీఏ కార్యవర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుని ఆర్టీజీఎస్ ద్వారా ఆ నగదును సీఎంఆర్ఎఫ్‌ అకౌంట్‌‌లో జమ చేసింది. ఆ విరాళానికి సంబంధించిన వివరాలను సీఎం వైఎస్‌ జగన్‌‌మోహన్‌రెడ్డిని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కోశాధికారి గోపినాధ్ రెడ్డి బుధవారం కలిసి అందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here