ఏయూ వీసీ ప్రసాద రెడ్డికి పుష్పగుచ్చం అందిస్తున్న నూతన రెక్టార్ ఆచార్య సమత

విశాఖపట్నం, జులై 25 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం రెక్టార్‌గా ఏయూ భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులు కె.సమత పదవీ బాధ్యతలను చేపట్టారు. శనివారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు రెక్టార్‌గా పదవీ బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న రెక్టార్ ఆచార్య సమత

అనంతరం ఆచార్య కె.సమత వర్సిటీలోని సి.ఆర్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వై.ఎస్ రాజశేఖర రెడ్డి, మహాత్మ జ్యోతిరావు ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, పాలక మండలి సభ్యులు ఆచార్య టి. శోభశ్రీ, ఆచార్య క్రిష్ణమంజరి పవార్, ఆటా అధ్యక్షుడు ఆచార్య జాలాది రవి, ఏయూఇయూ అధ్యక్షుడు జి.రవికుమార్, ఏయూ అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు, ఆచార్య పి.అర్జున్, ఆచార్య టి. షారోన్ రాజు, ఆచార్య వి.సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.