న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (న్యూస్టైమ్): రక్షణ, ఏరో స్పేస్ రంగాలలో భారతదేశం అపరిమితమైన అవకాశాలను అందిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రంగాలలో కలసి పని చేయడానికి ‘ఏరో ఇండియా’ ఒక అద్భుతమైన వేదికగా ఉందని ఆయన పేర్కొన్నారు.
‘‘రక్షణ, ఏరో స్పేస్ రంగాలలో భారతదేశం అపరిమితమైన అవకాశాలను అందిస్తున్నది. ఈ రంగాలలో కలసి పని చేయడానికి ఏరో ఇండియా ఒక అద్భుతమైన వేదికగా ఉంది. ఈ రంగాలలో భారత ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి సంస్కరణలను తీసుకు వచ్చింది. స్వయంసమృద్ధంగా ఎదగాలన్న మన అన్వేషణకు ఈ సంస్కరణలు ఉత్తేజాన్ని అందిస్తాయి.’’ అని ఒక ట్వీట్లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.