ఇండోర్ (మధ్యప్రదేశ్) గీతా భవన్‌లోని ఆకాశ్ కార్యాలయం

న్యూఢిల్లీ, అక్టోబర్ 16 (న్యూస్‌టైమ్): ప్రస్తుత కొవిడ్-19 విపత్తు పరిస్థితులలో సరికొత్త మనవాలోచనలను (మైండ్‌సెట్స్) వినియోగించి, విద్యా సేవలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించి (డిజిటైజ్ చేసి), విద్యార్ధులకు నూతన అనుభవాలను అందించే లక్ష్యంతో ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) ప్రణాళికలు రూపొందించింది. టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసులలో జాతీయ అగ్రగామి సంస్థ అయిన ఏఈఎస్ఎల్ శాప్ S/4 హన వంటి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవలతో ముందుకు వచ్చింది ఏఈఎస్ఎల్.

ఈ SAP అడాప్షన్ విద్యా సముదాయానికి డిజిటల్ ఫ్యూచరిస్టిక్ ప్లాట్‌ఫార్మ్ అందించేలా ఏఈఎస్ఎల్‌ను విస్తృతంగా శక్తివంతం చేయడంలో కీలక భూమిక పోషించనుంది. ప్రస్తుత మహమ్మారి పరిస్థితులలో విద్యా సముదాయాలు క్లాస్ రూమ్ నుంచి ఆన్‌లైన్ సెటప్‌కు మారుతున్న తరుణంలో, ఏఈఎస్ఎల్ తమ వ్యాపారాన్ని విధానాన్ని ప్రామాణికంగా మార్చి, ఇంటర్నల్, అదే విధంగా ఎక్స్‌టర్నల్ భాగస్వాములకు క్వాలిటీ డిజిటల్ ఎడ్యుకేషన్ సేవలు అందించే సామర్థ్యం కోసం త్వరిత గతిన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందుకు ఇంటలిజంట్ ఆటోమేషన్‌తో బిజినెస్ విధానాలలో విప్లవాన్ని తీసుకువచ్చే శాప్ (SAP) తర్వాత తరం డిజిటల్ కోర్ SAP S/4 HANA అనే ఒక ఇంటలిజంట్, ఇంటిగ్రేటెడ్ ERP సిస్టమ్‌ను ఆ సంస్థ ఎంపికచేసుకుంది.

ఏఈఎస్ఎల్ డైరెక్టర్, సీఈవో ఆకాష్ చౌధరి

ఈ డిజిటల్ అప్‌గ్రేడేషన్ ద్వారా కంపెనీ చక్కగా స్కేల్ చేసి, వృద్ధి చెంది, ఫ్యూచరిస్టిక్ రెడీగా సిధ్ధం అయ్యేందుకు వీలుగా ఫైనాన్సియల్ ట్రాన్సఫర్మేషన్‌కు కావలసిన పునాది కూడా వేస్తుంది. తాజాగా తాము అందిపుచ్చుకున్న సరికొత్త సాంకేతికత గురించి ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) డైరెక్టర్, సీఈవో ఆకాష్ చౌధరి స్పందిస్తూ ‘‘మా మొత్తం మోడల్ సిస్టమ్‌ను డిజిటైజ్ చేయడానికి మేము టెక్నాలజీ మీద అధికంగా పెట్టుబడి పెడుతున్నాం, ఇలా సందర్భోచిత పరిస్థితుల అవసరాలకు అనుకూలంగా నిలిచి, మా తదుపరి జనరేషన్ కస్టమర్లకు మేము అందించే సేవలు మెరుగుపడాలన్నది మా అంతిమ ఆకాంక్ష. మా టెక్నాలజీ ఆర్కిటెక్చర్‌గా నిలిచేందుకు మేము SAP S/4 HANAపై నమ్మకం పెట్టుకున్నాం, ఇది పరిపూర్ణంగా మా విధానాలు, సేవలను ఇంటిగ్రేడ్ చేసి, కంపెనీ భవిష్య పథకాలతో అలైన్ చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము.’’ అన్నారు.

‘శాప్’ ఉపాధ్యక్షుడు పర్వేష్ ఘై

‘‘ఇండియా 5-24 సంవత్సరాల వయసు బ్రాకెట్లో సుమారు 500 మిలియన్ విద్యార్థుల ప్రపంచపు అతిపెద్ద సమదాయం కలిగి ఉంది. ఇలా ఇది విద్యా రంగానికి గొప్ప సదవకాశం అందజేస్తున్నది. విద్యా విధానాలలో మరింత అధిక అభివృద్ధి కోసం ట్రాన్సఫర్మేటివ్, ఇన్నోవేటివ్ విధానాలను అనుసరించవలసిన అతి పెద్ద అవసరం మనకు ఉన్నది’’ అని SAP నార్త్ & ఈస్ట్ ఇండియా, బంగ్లాదేశ్ ఉపాధ్యక్షుడు (సేల్స్) పర్వేష్ ఘై అభిప్రాయపడ్డారు. ‘‘విద్య, విద్యార్జన అనుభవాన్ని తర్వాత స్థాయికి తీసుకు వెళ్లగలిగిన విస్తృత సదవకాశాలను తీసకు వచ్చే ‘డిజిటల్ ట్రాన్సఫర్మేషన్స్’లో నమ్మకం ఉంచే ఏఈఎస్ఎల్ వంటి ఇనిస్టిట్యూట్స్‌కు మేము మా సపోర్ట్ అందజేస్తున్నాము’’ అని పేర్కొన్నారు.

ఇక, ఏఈఎస్ఎల్ అత్యుత్తమమైన విధానాలు అనుసరించి, ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచే కాంపిటీటివ్ ప్రయోజనం సంపాదించేందుకు ప్లాన్ చేస్తున్నది. ఈ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ స్టెప్ ద్వారా ఇంకా రాబోయే సంవత్సరాల కోసం ప్లాన్ చేసిన వ్యాపార అభివృద్ధి, విస్తరణ కూడా వీలు పడుతుంది. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు, స్కూల్/బోర్డ్ పరీక్షలు, ఎన్.టి.ఎస్.ఇ (NTSE), కె.వి.పి.వై (KVPY), ఒలింపియాడ్స్ (Olympiads) వంటి కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు విస్తృతమైన టెస్ట్ ప్రిపరేటరీ సేవలు అందజేస్తున్నది. ‘ఆకాష్’ బ్రాండ్‌తో క్వాలిటీ కోచింగ్, వివిధ మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలలో నిరూపిత స్టూడెంట్ సెలక్షన్ ట్రాక్ రికార్డ్ చేరి ఉన్న విషయాన్ని ఏఈఎస్ఎల్ విశ్వసిస్తోంది.

టెస్ట్ ప్రిపరేటరీ ఇండస్ట్రీలో 32 సంవత్సరాలకు పైగా నిర్వహణ అనుభవం కలిగి ఉన్న ఈ సంస్థ మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షలు, కొన్ని ఫౌండేషన్ లెవల్ స్కాలర్షిప్ పరీక్షలు/ఒలింపియాడ్స్‌లో అధిక సంఖ్యలో విద్యార్థుల ఎంపిక, 200 ప్లస్ ఆకాష్ సెంటర్లు (ఫ్రాంచైజీలతో కలిపి) కలిగిన పాన్ ఇండియా నెట్‌వర్క్, 250,000కు పైగా విద్యార్థుల సంఖ్యను కలిగి ఉంది. ఆకాష్ గ్రూపు సుప్రసిద్ధ కె-12 ఎడ్‌టెక్ బ్రాండ్, Meritnation.com యాజమాన్యం కూడా కలిగి ఉంది. మరిన్ని వివరాలకు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ www.aakash.ac.inను సందర్శించవచ్చు.

17 COMMENTS

  1. Heү There. I found your blog using msn. This is a ѵery well
    written article. І’ll make sure to bookmark it and retᥙrn to reаd
    more of your useful information. Thanks f᧐r thе post.
    I’ll definitely retսrn.

    Here is my web site pkv games

Comments are closed.