సీఎం జగన్ ఫొటోకు పాలాభిషేకం

1236

విశాఖపట్నం, జూన్ 25 (న్యూస్‌టైమ్): ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫొటోకు వై.యస్‌.ఆర్‌. స్టూడెంట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఇక్కడి ఆంధ్రా యూనివర్శిటీ మెయిన్‌ గేట్‌ వద్ద పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వై.యస్‌.ఆర్‌. విద్యార్ధి విభాగం విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు బి.కాంతారావు మాట్లాడుతూ వై.యస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఉద్యమం చేస్తున్న విద్యార్ధులపై అక్రమంగా కేసులు పెట్టి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం జరిగిందని, ఈ కేసులను వై.యస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఎత్తివేయటాన్ని హర్షిస్తున్నామన్నారు. వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి మాట తప్పడు, మడమ తిప్పడు అని నిరూపించుకున్నారన్నారు.

చంద్రబాబునాయుడు రెండు నాల్కల ధోరణి అని, ఒక వైపు ప్రత్యేక హోదా అంటూనే, మరోవైపు ప్రత్యేక హోదాకోసం పోరాడేవారిని కేసులుపెట్టి, జైలుపాలు చేశారన్నారు. కేసులు ఎత్తివేసి ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్‌ మీద ప్రేమ చాటుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం, ప్రత్యేక హోదా కోసం ఒకే మాట మీద నిలబడ్డ ఏకైక వ్యక్తి వై.యస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.

ప్రత్యేక హోదా కోసం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల గురించి, అభివృద్ధి గురించి, అవినీతి రహిత సమాజం కోసం వై.యస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి నిరంతరం తపిస్తున్నారని అన్నారు. ఆయన కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరు అండగా ఉండి వై.యస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి 20 సంవత్సరాల పాటు రాజన్న పాలన అందిస్తారన్నారు. కార్యక్రమంలో వై.యస్‌.ఆర్‌.సి.పి. విద్యార్ధి విభాగం, విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షులు బి.కాంతారావు, వై.యస్‌.ఆర్‌.సి.పి. విద్యార్ధి విభాగం అరకు పార్లమెంటు అధ్యక్షులు టి.సురేష్‌కుమార్‌, వై.యస్‌.ఆర్‌.సి.పి. విద్యార్ధి విభాగం రాష్ట్ర కార్యదర్శులు ఎమ్‌.కళ్యాణ్‌, బి.జోగారావు, కె.ధీరజ్‌, విద్యార్ధి నాయకులు జి.వీరకృష్ణ, అంబేడ్కర్‌, భరత్‌, ప్రసాద్‌, త్రినాధ్‌, కుమార్‌, శంకర్‌, వైకుంఠరావు, అధిక సంఖ్యలో విద్యార్ధులు పాల్గొన్నారు.