కోవిడ్-19పై సందేహాలకు సమాధానాలు

0
8 వీక్షకులు

ఒంగోలు, ఏప్రిల్ 17 (న్యూస్‌టైమ్): కోవిడ్-19పై ప్రచారంలో ఉన్న వివిధ సందేహాలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. కరోనాపై సందేహాలను నేరుగా నిపుణులైన డాక్టర్ల ద్వారా నివృత్తి చేయుటకే మేడంగో (medongo) సంస్థ కొత్తగా ఒక యాప్‌ను రూపొందించింది.

దీనిని మంత్రి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఇక్కడ ప్రారంభించి దాని పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ యాప్‌ను ప్లే స్టోర్ గూగుల్ (Play store) నుండి అన్ని ఆండ్రాయిడ్ మొబైళ్ళలో ఇంస్టాల్ చేసుకొని డైరెక్ట్‌గా కోవిడ్ -19 డాక్టర్లతో వీడియో కాల్ ద్వారా కూడా తమకున్న లక్షణాలను తెలియచేసి వారి అమూల్య సలహాలు, సందేశాలను పొందవచ్చు. ఈ యాప్‌ పూర్తి వివరాలను ఈ-సబ్ సెంటర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జంగాల సుజన్ మంత్రికి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here