దేనికైనా అర్హత అవసరం!

0
5 వీక్షకులు
పవన్ కల్యాణ్
(* వై.వి. రెడ్డి)

‘‘ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను’’, ‘‘ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను’’ జనసేన పార్టీ పెట్టిన కొత్తలో సినీ నటుడు పవన్ కల్యాణ్‌ చెప్పిన డైలాగ్‌లు ఇవి. జనసేనానిగా తన పార్టీ శ్రేణులతో పిలిపించుకునే పవన్ చెప్పిన మాటలు అనకుండా, ఆయన చెప్పిన డైలాగ్‌లు అని ఎందుకు అన్నానంటే సినిమా రంగం నుంచి వచ్చారనే కాదు… సందర్భానుసారం కూడా వాడాల్సి వచ్చింది. రాజకీయాల్లో మాటలకు, చేతలకు చాలా తేడా ఉంటుంది.

ఎన్నికలకు ముందు, వేరొకరి కోసం పుట్టుకొచ్చిన పార్టీ జనసేన కాబట్టి అది మాటల పార్టీయేనని జనసేన వ్యవస్థాపక దినం రోజునే ఊహించాను, ఓ అంచనాకు వచ్చాను. చంద్రబాబు విషపు ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన పార్టీయే జనసేన. జనసేనలో సేన ఉన్నప్పటికీ దానిలో సైనికులు ఎవరూ లేరు. పవన్‌ కల్యాణ్‌ను గుడ్డిగా అభిమానించేవారు తప్పా. చంద్రబాబు పెరట్లో మనిషి అని ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎవర్నీ అడిగినా చెబుతారు. ఎందుకంటే, ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ కల్యాణ్‌ ప్రజల తరపున క్వశ్చన్‌ చేయడం మరిచిపోయారు. ఉద్దానం గురించి ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చారు. ఉద్దానం బాధితులను ఆదుకుంటానని సభలు కూడా పెట్టారు. ఊరుపేరులేని వారిని ఉద్దానం తీసుకొచ్చి చాలా ముచ్చట్లు చెప్పారు. అమలు కాని హామీలు చాలా ఇచ్చారు. తన మనసుకు నచ్చిన బాస్, తనకు ప్యాకేజీలు ఇచ్చే బాస్ అధికారంలో ఉన్నా ఉద్దానానికి ఉద్దీపన ప్యాకేజీలు ఇప్పించుకోలేక పోయారు.

కనీసం ఒక వాటర్‌ ట్యాంక్‌ కట్టించలేకపోయారు. జనసేన పార్టీ పెట్టిన తరువాత పవన్ కల్యాణ్‌ లెక్కకు మిక్కిలి హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదు. 2014 -19 మధ్య కాలంలో ఉన్న అధికారంలో ఉన్నా చంద్రబాబును అడిగి ఉద్దానానికి న్యాయం చేయించలేకపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 11 నెలలు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. పాదయాత్ర చేసేటప్పుడు, ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఉద్దానం బాధితులకు స్పష్టమైన హామీ ఇచ్చారు.

వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఉద్దానం కష్టాలు తీరుస్తానని వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అభయం ఇచ్చారు. అన్నట్లుగానే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. చెప్పానంటే చేసితీరుతా అంటూ ఉద్దానం కష్టాలు తీర్చడానికి రూ.700 కోట్లు కేటాయించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.140 కోట్లు, 2021-22వ సంవత్సరానికి రూ.280 కోట్లు, 2022 -23వ సంవత్సరానికి రూ.280 కోట్లు ఏపీ ప్రభుత్వం కేటాయించింది.

పంచాయతీ రాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ ఈ మేరకు ఓ జీవో కూడా జారీ చేశారు. ఉద్దానం అంటే ఉద్యానవనం. ఉద్దానం అనే ప్రాంతం ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరుతున్నట్లు ఉంటుంది. ఓ పక్క అందమైన సముద్రతీరం. మరోపక్క కొబ్బరి, జీడిమామిడి, పనస తోటలు. మరోవైపు, నాగావళి, వంశధార, మహేంద్రతనయ నదులు. జీవనదులతో ఎప్పుడూ పచ్చదనంతో కళకళలాడే ప్రాంతం కాబట్టి దీనిని ఉద్యానవనం అనేవారు. కాలక్రమంలో అదీ ఉద్దానమైంది. శ్రీకాకుళానికి ఉద్దానం 140 కిలోమీటర్లు ఉంటుంది. కానీ, కిడ్నీ జబ్బులతో అక్కడి ప్రజలు దశాబ్దాలుగా బెంబేలెత్తిపోతున్నారు. రాజకీయ నాయకులు, విలేకరులు ఆ ఊరును చూసిపోవడమే కానీ, చేసిందేమీ లేదు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉండే సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, వజ్రపుకొత్తూరు, పలాస, మందస మండలాలను కలిపి ఉద్దానం ప్రాంతంగా పిలుస్తుంటారు. ఇక్కడ ఏ ఇంటికీ వెళ్లినా ఒక్కరో, ఇద్దరో కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్నవారు కంటపడతారు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే గత రెండు దశాబ్దాల కాలంలో ఉద్దానంలో కిడ్నీ జబ్బులతో 15 వేల 623 మంది చనిపోయారు. కరోనాతో ఇటలీ, స్పెయిన్‌లో చనిపోయినవారు కంటే ఈ సంఖ్య ఎక్కువ. ప్రస్తుతం 15 వేల మంది కిడ్నీ జబ్బులతో ఉద్దానంలో బాధపడుతున్నారు. ఉద్దానంలో అధిక శాతం కూలీ పనులు చేసుకుని బతికేవారే ఉంటారు. కిడ్నీ జబ్బులకు మంచి ఆస్పత్రికి వెళ్లి, మందుల వాడే ఆర్ధిక స్థోమత కూడా వీరికి లేదు.

దీంతో మృతులు సంఖ్య అధికంగా ఉంది. గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం అయ్యాయి. చేతల్లో విఫలమయ్యాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మనల్ని ఆదుకోదనే మానసిక స్థితికి ఉద్దానం వాసులు వచ్చారు. మన బతుకులు ఇలా కరిగిపోవాల్సిందే అని ఉద్దానం ప్రజలు ఉండేవారు. కానీ, ఈ రోజున సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చొరవతో త్వరలో ఉద్దానం కష్టాల నుంచి బయట పడనుంది. ఉద్దానం ప్రాంతంలో కుసుంపురం అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పచ్చని ప్రకృతి ఒడిలో పడుకున్న పాపాయిలా ఉంటుంది.

కానీ, అక్కడ మనుషుల ముఖాల్లో జీవం ఉండదు. ఊరి జనాభా 4 వేలు ఉంటుంది. ఈ గ్రామానికి ఏ అధికారి వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా తమకు చంద్రుడికో నూలుపోగులా తమకు న్యాయం చేస్తారంటూ చుట్టుముడతారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారనుంది.ఉద్దానం ప్రాంతంలో 37 శాతం మందికి కిడ్నీ వ్యాధులు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌ లెక్కలు చెబుతున్నాయి. షుగర్, బీపీ ఉన్న వాళ్లకు సాధారణంగా కిడ్నీ వ్యాధులు వస్తుంటాయి. కానీ, ఇక్కడ ఈ రెండూ లేనివారికి కూడా కడ్నీ వ్యాధి రావడం స్థానిక డాక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఈ వ్యాధికి క్రానిక్ మెడికల్ డిసీజ్‌ అనే పేరు పెట్టింది.

ఉద్దానం ప్రాంతంలో ప్రతి రోజూ 9 నుంచి 12 కొత్త కిడ్నీ కేసులు నమోదు అవుతుంటాయి. ఇది చాలా ప్రమాదకరం. కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. ఉద్దానంలో డయాలసిస్‌ సెంటర్లు కూడా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫ్లోరైడ్ జలాలు వల్లనే కిడ్నీ సమస్యలు వస్తున్నాయని, బయట నుంచి ఉద్దానానికి జలాలు తీసుకురావాలని ఎప్పటి నుంచో పరిశోధకులు సూచిస్తున్నారు. వంశధార, మహేంద్రతనయ నదుల జలాలను ఉద్దానానికి తరలించాలి అనేది పరిశోధకులు అభిప్రాయం. హార్వర్డ్ బృందం కూడా ఉద్దానంలో పర్యటించింది.

కానీ, చంద్రబాబు ప్రభుత్వం నుంచి సరైన సాయం లేకపోవడం వలన ఆ బృందం తన ప్రయత్నాలను మధ్యలోనే ఆపేసింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం రూ.700 కోట్లు కేటాయించడంతో ఉద్దానం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా పవన్ కల్యాణ్‌కు నేను చెప్పేది ఒక్కటే. ప్రజల కష్టాల గురించి మాట్లాడిన వారు, రాజకీయ పార్టీలు పెట్టిన ప్రతి ఒక్కరూ ప్రజల మనుషులు కాలేరు. కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని పొందలేరు. మన నడవడికలో, మన ప్రయత్నాల్లో, మన మనసులో ప్రజలకు నిజంగా సేవ చేయాలనే తపన ఉండాలి.

మాట్లాడే మాటలు పెదాల మీద నుంచి కాకుండా మనసులోంచి రావాలి. జనసేన పార్టీ పుట్టకే బానిస పుట్టుక. ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మన దేశాన్ని మధ్య యుగాల్లో బానిస వంశం పాలించింది. ఆ వంశానికి బానిస వంశం అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఢిల్లీ పాలకుల దగ్గర బానిసలుగా చేరి కొన్ని దశాబ్దాల తరువాత అధికారాన్నే జేజిక్కించుకున్నారు. అందుకు వారికి బానిస వంశం అని పేరు వచ్చింది. పవన్ కల్యాణ్‌కు బానిస వంశానికి ఉన్న శక్తి కూడా లేదు. ప్రజల కోసం పని చేసే కమిట్‌మెంట్ కూడా లేదు. మధ్య యుగాల్లో బానిసలు రాజ్యాధికారాన్నే పొందారు.

చంద్రబాబు బానిసగా పవన్ కల్యాణ్‌ బానిసగానే మిగిలిపోతారు. ఎందుకంటే పవన్ కల్యాణ్‌లో ఓ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమాత్రం లేవు. బానిసకు ఉండాల్సిన లక్షణాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. జనసేన పార్టీ పుట్టకే బానిస పుట్టుక. అందుకే, ప్రశ్నిస్తానని వచ్చిన పవన్‌ కల్యాణ్ ప్రశ్నించలేకపోయారు. పవన్ కల్యాణ్‌ను నేను కోరేది ఒక్కటే బాబుకు బానిసగా ఉండి కొణిదెల కుటుంబ పరువు తీయొద్దు. ఉద్దానమంటూ ఊపుకుంటూ తిరిగిన పవన్ కల్యాణ్‌ ఏం చేశారు? ఏం చేయించారు? గత ఐదేళ్లలో ఉద్దానం కోసం పైసా కూడా విరాళం ఇవ్వలేదు, సేకరించలేదు.

తన యజమాని చంద్రబాబు అధికారంలో ఉన్నా ఉద్దానం కోసం పైసా పనులు కూడా చేయించలేకపోయారు. దీంతో..ఉద్దానంపై మీకున్న విశ్వసనీయత ఏంటో ప్రజలకు అర్ధమైంది! పవన్ కల్యాణ్‌ మాటల మనిషే కాని చేతల మనిషి కాదని ప్రజలు గమనించారు. ఊగిపోతూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినంత మాత్రానా ప్రజలు నమ్మరు, ఓట్లు వేయరు అనే సత్యాన్ని పవన్ కల్యాణ్‌ ఇప్పటికైనా గమనించాలి. మీరు బీజేపీలో హడావిడిగా ఎందుకు చేరారో రాష్ట్ర ప్రజలు తెలుసు. మీరు బీజేపీలో చేరాలని తెర వెనుక ఆదేశించిన వారు ఎవరో కూడా ప్రజలకు తెలుసు.

పిల్లి కళ్లు మూసుకుని పాలుతాగుతూ తనను ఎవరూ చూడటంలేదని అనుకుంటుందట! అలా ఉంది పవన్ కల్యాణ్ రాజకీయం. ఇప్పటికైనా ఉద్దానానికి చిత్తశుద్దితో రూ.700 కోట్లు కేటాయించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గురించి మంచిగా మాట్లాడితే పవన్ కల్యాణ్ తనకున్న కాస్తోకూస్తో విలువను కాపాడుకోగలుగుతారు. లేనిపక్షంలో చంద్రబాబుకు జీవితకాలపు బానిసగా పవన్ కల్యాణ్ మిగిలిపోతారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్ కల్యాణ్‌కు భవిష్యత్తులో మాట్లాడే అర్హత కూడా లేకుండాపోతుంది.

(* వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు; 76708 05402)
ముఖ్యగమనిక: వ్యాసకర్త అభిప్రాయంతో ప్రచురణకర్త ఏకీభవించినట్లు భావించాల్సిన అవసరంలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here