మానికొండ చలపతిరావు విగ్రహానికి పూల‌మాల‌లు నివాళులర్పిస్తున్న దేవుపల్లి అమర్, కె. అమర్‌నాథ్, దిమిలి అత్యుచ్‌రావు తదితరులు

హైదరాబాద్, అమరావతి, ఆగస్టు 17 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ యనియన్ ఆఫ్ వర్కింగు జర్నలిస్ట్సు (ఏపీయూడబ్ల్యూజే) వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సోమవారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ నాయకులు పలువురు హైదరాబాద్ జూబ్లీ హిల్సులోని జర్నలిస్ట్ కాలనీ ‘ట్రై’ జంక్షన్ వద్ద భారత వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ పితామహుడు, ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకుడు దివంగత మానికొండ చలపతిరావు విగ్రహానికి పూల‌మాల‌లు వేసి అంజ‌లి ఘ‌టించారు. దేశరాజధాని ఢిల్లీలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మీడియా స‌ల‌హాదారు, ఐజేయూ పూర్వ అధ్య‌క్షుడు దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌, ఐజేయూ, తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నాయకులు కరోనా విపత్తు నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ చలపతిరావు విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఏటా ఆగస్ట్ 17న యూనియన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించటం ఆనవాయితీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారం నాటి కార్య‌క్ర‌మంలో ఐజేయూ నాయ‌కులు కె. అమ‌ర్‌నాధ్‌, ఏపీయూడ‌బ్ల్యూజే రాష్ట్ర నాయ‌కులు దిమిలి అచ్యుత‌రావు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ శైలేష్‌రెడ్డి, జ‌ర్న‌లిస్ట్స్ కోప‌రేటివ్ సొసైటీ అధ్య‌క్షుడు వెంక‌టాచారి, కార్య‌ద‌ర్శి ఎమ్‌.ఎస్‌.హెచ్. హ‌ష్మి త‌దిత‌రులు పాల్గొన్నారు.

విజయవాడలో యూనియన్ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు
విజయవాడలో యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత సీనియర్ జర్నలిస్ట్ ఎస్కే బాబును ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు సన్మానిస్తున్న దృశ్యం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని జిల్లాల వ్యాప్తంగా కూడా యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకులను నిర్వహించారు. విజయవాడ, గుంటరు, ఒంగోలు కేంద్రాలలో నిర్వహించిన కార్యక్రమాలలో యూనియన్ రాష్ట్ర నాయకత్వ బాధ్యులు పాల్గొన్నారు. ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐవీ సుబ్బారావు చందు జనార్ధన్, చలపతిరావు, చావా రవి తదిలరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా నాతవరం మండల కేంద్రంలో నర్సీపట్నం ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఏడీ బాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నాతవరం ఎస్ఐ జి. రమేష్, ఇంచార్జ్ ఎంపీడీఓ బి.సత్యనారాయణ, నాతవరం మండల కేంద్రానికి చెందిన అన్ని పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు పాల్గొన్నారు.

విశాఖ జిల్లా నాతవరంలో మొక్కలు నాటుతున్న ఏపీయూడబ్ల్యూజే నానయకులు
నర్సీపట్నంలో మొక్కలు నాటుతున్న పసుపులేటి రాము, సీహెచ్‌బీఎల్ స్వామి, సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తదితరులు
విశాఖ జిల్లా రోలుగుంటలో మొక్కలు నాటిన జర్నలిస్టులు
విశాఖ జిల్లా అరకులోయలో యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమం…
అరకులోయలో విలేకరుల ప్రదర్శన
విశాఖ జిల్లా యలమంచిలీలో మొక్కలు నాటుతున్న పాత్రికేయులు

అలాగే, ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య మొక్కలు నాటారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి రాము, జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌బీఎస్ స్వామి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. అలాగే, గొలుగొండ మండల కేంద్రంలో కూడా యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. గొలుగొండ, కేడీపేట మండల కేంద్రాలకు ప్రాంతాలకు చెందిన విలేకరులు అధిక సంఖ్యలో హాజరు అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక తహసిల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో డేవిడ్రాజు, ఎస్ఐ నారాయణరావు చేతుల మీదగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సింగంపల్లి చెన్నయ్యనాయుడు, పి. సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు ఎస్. నానాజీ, జిల్లా కార్యవర్గ సభ్యుడు జె. నరసింహమూర్తి, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు ఆర్. బాబు తదితరులు పాల్గొన్నారు. యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో జర్నలిస్టులకి 50 లక్షల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన యాప్‌ను సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రారంభించారు. కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించిన సీనియర్ జర్నలిస్ట్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్ఫళ్ల నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా సీపీఐ కార్యదర్శి జంగాల అజయ్ తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ జర్నలిస్టు నాన్నే బాబ్జీరావును సత్కరిస్తున్న చిలకలూరిపేట జర్నలిస్టులు

యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 63వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో మొక్కలు నాటారు. అనంతరం ఆంధ్రజ్యోతి ఆవిర్భావం నుండి పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్ట్, పట్టణంలోని చాలా మందికి గురువు అయిన నాన్నే బాబ్జీరావును జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ 1992లోనే స్టేట్ ఈవినింగ్ సాయంకాల దినపత్రికలో విలేకరిగా తన ప్రస్థానాన్ని సాగిస్తూ టీవీ9, వార్త, ఆంధ్రప్రభ, సూర్య, సాక్షి వంటి పలు పత్రికల్లో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు, చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షేక్ అల్లాబక్షును కూడా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ కౌన్సిల్ నెంబర్ షేక్ మస్తాన్ వలి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య, చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎన్‌వీఎస్‌వీ ప్రసాద్, కోశాధికారి పిట్టల శీను, దీవి దాసు, రాంజీ నాయక్, శ్రీను నాయక్, దరియా, శ్యాం, సాయి తదితరులు పాల్గొన్నారు.

యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మచిలీపట్నంలో మొక్కలు నాటారు. ఏపీయూడబ్ల్యూజే కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడు నంగిగడ్డ బాబు జెండా ఎగరేసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ భోగి రెడ్డి వెంకన్నబాబు యూనియన్ నాయకులు పైడిపాముల అశోక్ కుమర్, మచిలీపట్నం అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ రమేష్, మట్ట శ్రీరామ్, ఏ.రమణ, సామ సునీల్, బి.శంకర్, శ్రీనివాస్, చక్రవర్తి కూరేటి సతీష్, తదితర జర్నలిస్టు పాల్గొన్నారు. అలాగే, తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో ఏపీయూడబ్ల్యూజే 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మండేలా శ్రీరామమూర్తి, జిల్లా అధ్యక్షుడు స్వాతి ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం ప్రెస్ క్లబ్ వద్ద ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు సత్తి శ్రీనివాస రెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఏపీయూడబ్ల్యూజే పోరాట ఫలితంగానే జర్నలిస్టుల సంక్షేమ పథకాలను సాధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జర్నలిస్టులకు మాస్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు ఎ. వంశీకృష్ణ పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ప్రెస్‌క్లబ్‌లో ఏపీయూడబ్ల్యూజే జెండా ఆవిష్కరణ జరిగింది. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా ప్రెస్ క్లబ్ దగ్గర సి.వై. చింతామణి విగ్రహానికి పూల మాల వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎస్.వి. ప్రసాద్‌రావు, ప్రతినిధులు నాగరాజు, ఎస్‌.పి. రాజు, శ్రీనివాసరావు, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతిలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అన్నదానం

తిరుపతిలో మాస్కులు పంపిణీ చేస్తున్న దృశ్యం
యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తిరుపతి నాయకత్వం

ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో 200 మంది పేదలకు అన్నదానం, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం సీనియర్ జర్నలిస్టులు టి.జానార్దన్, మన్నెం చంద్రశేఖర్ నాయుడు, కృష్ణయ్యలను శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు తారక, రాధాకృష్ణ, మనోజ్, రమాకాంత్, దామోదర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యేజే వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జర్నలిస్ట్‌లను కరోనా వారియర్సుగా గుర్తించాలని కోరుతూ ఆన్‌లైన్ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.

మైలవరం సీఐ శ్రీనుతో కలిసి యూనియన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జర్నలిస్టులు
మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్ బాధితులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రజాసేవలో నిరంతరం శ్రమించే జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్లు దోహధపడతాయని కృష్ణా జిల్లా మైలవరం సిఐ పి శ్రీను పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం యూనియన్ 63వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ రంగంలో అయినా అందులో పనిచేసే సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఆయా సంఘాలు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే ఆ సంఘానికి మనుగడ, పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పనిచేస్తూ 63 వసంతాలు పూర్తి చేసుకోవటం అభినందనీయమని ప్రశంసించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు యు వెంకట్రావు APUWJ ఒక కార్మిక సంఘంగా జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. జర్నలిస్టులు ప్రస్తుతం అనుభవిస్తున్న సదుపాయాలన్ని APUWJ సాధించినవేనని గుర్తు చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితులలో జర్నలిస్టుల సేవలను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని, కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని కోరారు.

గుంటూరు జిల్లా మాచర్లలో ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మన్నే శ్రీనివాసరావు, మైలవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జబ్బార్, గౌరవాధ్యక్షుడు మన్నే సాంబశివరావు, జర్నలిస్టులు కృష్ణ ప్రసాద్, బి వెంకట్రావు, చిట్టిబాబు, శివరామకృష్ణ, వైడీపీ రెడ్డి, బాలు, ప్రసాద్, రాజారెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

కరోనా వారియర్లుగా విలేకరులను గుర్తించాలన్న ఆన్‌లైన్ ప్రచారాన్ని భీమవరంలో ప్రారంభిస్తున్న దృశ్యం

జర్నలిస్టులను కరోనా వారియర్సుగా గుర్తించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సారిగా తీసుకువచ్చిన ఆన్‌లైన్ క్యాంపైన్ విజయవంతం చేయాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు వి. సత్య సాయి బాబా జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. సోమవారం నాడు ఏపీయూడబ్ల్యూజే 63వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానిక చాంబర్ ఆఫ్ కామర్సులో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు టి .స్వామి అయ్యప్ప అధ్యక్షత వహించారు.

గుంటూరులో యనియన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు వి. సత్య సాయిబాబా, గౌరవ సలహాదారులు కడలి వరప్రసాద్ మాట్లాడారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది పాత్రికేయులు కరోనా వైరస్ ప్రాణాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరోనాతో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో భీమవరం ఏరియా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బోనం శ్రీనివాస్, కోశాధికారి జి. సుధాకర్, కార్యవర్గ సభ్యులు తాళ్లూరీ జయకుమార్, హనుమంతరావు, ప్రసన్న కుమార్, ఆదిత్య, అయ్యప్ప, నిమ్మల అది, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఆచంటలో ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

పాత్రికేయులను కరోనా వారియర్సుగా గుర్తించి వారిని సంరక్షించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆచంట మృత్యుంజయ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షురాలు కోట సునీత కోరారు. Apuwj 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం సొసైటీ ఆవరణలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఆచంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జవ్వాది మోహన్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భముగా మోహన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా భారిన పడి రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 15 మంది జర్నలిస్ట్ మిత్రులు ప్రాణాలు కోల్పోయారని, వీరందరినీ ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

విజయనగరం జిల్లా కేంద్రంలో చలపతిరావు విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఏపీయూడబ్ల్యూజే నాయకులు

ఐజెయు నేషనల్ కౌన్సిల్ మాజీ మెంబెర్ కొలిశెట్టి వీర వెంకట తాతారావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం apuwj అనేక కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 9 వేల మంది సభ్యులు కలిగిన యూనియన్ ప్రస్తుతం కరోనా బారినపడిన జర్నలిస్టులను ఆదుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ అనేక ఉద్యమాలు చేస్తుందన్నారు. పాత్రికేయుల ను కరోనా వారియర్సుగా గుర్తించి మరణించిన పాత్రికేయ కుటుంబాలకు 50 లక్షలుఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

శ్రీకాకుళంలో చలపతిరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న ఏపీయూడబ్ల్యూజే పూర్వ అధ్యక్షుడు నల్లి ధర్మారావు

ఈ విషయమై ప్రభుత్వానికి తెలియచేసేందుకు గాను యూనియన్ చేపట్టిన ఆన్లైన్ క్యాంపెయిన్‌ను సోమవారం ప్రారంభించామని, ఇది వారం రోజులు పాటు కొనసాగుతుందని తాతారావు తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పలువురి చేత ఆన్లైన్‌లో సబ్మిట్ చేయించారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్, ఐజెయు, apuuwj కౌన్సిల్ మాజీ సభ్యులు కొలిశెట్టి వీరవెంకట తాతారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మొల్లేటి శ్రీనివాస అరుణ్ కుమార్, బోడపాటి నాగేశ్వరరావు, పరువు మోహన్, ఆచంటేశ్వర దేవాలయం చైర్మన్ గొడవర్తి కృష్ణ కుమార్, వైకాపా నాయకులు వైట్ల కిషోర్, కామన హరిబాబు, గొడవర్తి చంద్ర శేఖర్, అరిగెల సురేషబాబు, కోట వెంకటేశ్వరరావు, సొసైటీ కార్యదర్శి పారుపల్లి ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులను కరోనా వారియర్సుగా గుర్తించాలి…

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శానిటరీ సిబ్బందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న దృశ్యం

రాష్ట్రంలో కరోనా కట్టడికి ముందువరుసలో నిలబడి పని చేస్తున్న జర్నలిస్టులు అందరిని కరోనా వారియర్సుగా గుర్తించాలని, వారికి కరోనా బీమా సౌకర్యం కల్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ జీ. శ్రావణ్ కుమార్ కోరారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే) 63వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఏపీయూడబ్ల్యూజే సభ్యులైన జంగారెడ్డిగూడెం పాత్రికేయులు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ లో పనిచేస్తున్న వంద మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులకు హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, సబ్బులు, పౌష్టిక ఆహారమైన కోడిగుడ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ మెంబర్ వాసా సత్యనారాయణ మాట్లాడుతూ 1957 ఆగస్టు 17న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ 35 మంది సభ్యులతో ఆవిర్భవించిందని, ప్రఖ్యాత జర్నలిస్టు మానికొండ చలపతిరావు యూనియన్ ఏర్పాటు చేశారని చెప్పారు. యూనియన్ తొలి అధ్యక్షుడిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖ పాత్రికేయులు మంగళంపల్లి చంద్రశేఖర్ వ్యవహరించారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 వేల మంది సభ్యులతో దేశంలోనే అతిపెద్ద జర్నలిస్టు సంఘంగా ఏపీయూడబ్ల్యూజే ఉండేదని చెప్పారు.

కృష్ణా జిల్లా వట్టిచెరుకులో ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ అనుబంధ సంఘంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర విభజన అనంతరం కూడా 9 వేల మంది సభ్యులతో నేటికీ దేశంలో అతిపెద్ద జర్నలిస్టు సంఘంగా వర్ధిల్లుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రముఖ వార్తా సంస్థలు పత్రికా సంస్థలలో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు 90% మంది ఏపీయూడబ్ల్యూజేలోనే సభ్యులుగా కొనసాగిస్తున్నారని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో గత ఏడాది జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 1000 మంది యూనియన్లో చేరినట్టు చెప్పారు. పాత్రికేయుల సమస్యలు, హక్కులపై గత 62 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చిన ఏపీయూడబ్ల్యూజే నేడు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కరోనా కట్టడికి ఫ్రంట్ లైన్లో నిలబడి పనిచేస్తున్న జర్నలిస్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బీమా సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులను కరోనా వారియర్సుగా గుర్తించాలని, కరోనా సోకిన జర్నలిస్టులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని యూనియన్ డిమాండ్ చేస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఏపీయూడబ్ల్యూజే ఆన్‌లైన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకు వస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని చెప్పారు. పట్టణంలో కరోనా రోగులను గుర్తించటంలో పాత్రికేయుల సహకారం మరువలేనిదని చెప్పారు. పట్టణంలో అనేక సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టుల సలహాలు సూచనలు, వారి వార్తా కథనాలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి అని అభినందించారు.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవల పట్ల స్పందించిన జర్నలిస్టులు వారికి శానిటైజర్, గ్లౌజులు, మాస్కులు, సబ్బులు, పౌష్టిక ఆహారమైన కోడిగుడ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జంగారెడ్డిగూడెం సహకార సంఘం మాజీ అధ్యక్షులు, సంఘ సేవకులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ తన తండ్రి పరిమి గంగరాజు జంగారెడ్డిగూడెం సర్పంచ్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి గట్టి పునాది వేశారని గుర్తు చేశారు. పట్టణంలో నేడు వంద మందికి పైగా పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ వారందరూ తమ కుటుంబం పట్ల అభిమానం చూపించడానికి ప్రధాన కారణం తన తండ్రి గంగరాజు సర్పంచిగా అందించిన సేవలే కారణమన్నారు. జర్నలిస్టులు రాజకీయ పార్టీలకు అతీతంగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తున్నారని, ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేటట్టు, పట్టణాభివృద్ధి జరిగేటట్టు చూస్తున్నారని అభినందించారు. విశ్రాంత గ్రూప్ వన్ అధికారి పరిమి ధర్మరాజు మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజాభివృద్ధికి ప్రధాన పాత్ర పోషిస్తున్నారని , వారి కోర్కెలను మన్నించడం ప్రభుత్వాల కర్తవ్యమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్ ఆవిర్భావ దినోత్సవ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి డివిఎల్ఎన్ స్వామి మాట్లాడుతూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. సమాజాభివృద్ధిలో జర్నలిస్టులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ డివి భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి కటారి సాయిబాబా, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు నండూరి కిషోర్, సీనియర్ జర్నలిస్టులు కె వి రమణారావు, గుర్రాల వేంకటేశ్వర రావు, ఎం. గంగరాజు, ఎన్. బాలసుబ్రహ్మణ్యం, కె. వెంకట్, నేతి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కమిటీ సభ్యుడు తన్నీడి పుల్లారావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొమ్మూరిహరిశ్రీ మన్నారాయణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దండు రాము, సభ్యులు చేతుల మీదుగా ఏఎన్ఎంలకు, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, మిఠాయిలు పంపిణీ జరిగింది.

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని దివ్య రెసిడెన్సీ హాల్‌లో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 63వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏచూరి శివ, సూర్య బ్యూరో ఆదినారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గా శ్రీనివాసరావు, మాచర్ల అధ్యక్షుడు రాధాకృష్ణ సహా పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు అయిన ఎంఎస్ నాగేశ్వరరావుని సన్మానించారు. అలాగే, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో ఘనంగా 63వ APUWJ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల తాహశీల్దారు కార్యాలయం వద్ద APUWJ 63వ ఆవిర్బావ వార్షికోత్సవం సందర్భంగా వట్టిచెరుకూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల తాహశీల్దారు ఫణీంద్ర బాబు కేక్ కోసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండలంలో జర్నలిజం వృత్తిలో 41సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ బుచ్చయ్య చౌదరిని ఘనంగా దుశ్యాలువతో సన్మానించారు.

కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఆఫ్ వట్టిచెరుకూరు అధ్యక్షుడు కొల్లా వెంకటేశ్వరరావు, కార్యదర్శి ప్రత్తి జయపాల్, ఉపాధ్యక్షుడు బుర్రి బాబూరావు, కోశాధికారి నాగిశెట్టి సోమశంకర్, మండల సేవాదళ సభ్యుడు నాదెండ్ల రామచంద్రయ్య, సీనియర్ అసిస్టెంట్ రాఘవయ్య, కార్యాలయ సిభ్భంది, తదితరులు పాల్గొన్నారు.