అరణ్యరోదన!

0
7 వీక్షకులు

అమరావతి, మే 16 (న్యూస్‌టైమ్): రాష్ట్రంలో ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతుంటే ఇంకోవైపు ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరిట విలువైన భూములను వేలం వేసి ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది. మరోవైపు, పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడే అడవులనూ వదిలిపెట్టేలా కనిపించడం లేదు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు చూస్తుంటే.

ఉప్పెనలను ఆపగలిగే మడ అడవులు కూడా జగన్ సర్కారు భూదాహానికి బలైపోతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వైపు నుంచి. ‘‘తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు రక్షణ కవచం లాంటి మడ అడవులను ఆక్రమించాలని నాడు తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయత్నిస్తే, నేడు కొడుకు జగన్‌మోహన్‌రెడ్డి ఆ పని పూర్తిచేసాడు’’ అంటూ టీడీపీ నేత పట్టాభి విమర్శించారు. ఈరోజు పేదలకు ఇళ్లస్థలాల వంకతో మడ అడవులను చదునుచేసే పనిని ప్రారంభించి ఆక్రమిస్తున్నారని, రేపు నేరుగా కబ్జాలకు తెగించి అడవులను మింగేస్తారని ఆయన ఆరోపిస్తూ రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేంటో మీరూ ఓ లెక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here