కళాశాలలో మాట్లాడుతున్న ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్‌) చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే

వెల్లింగ్టన్‌, ఏప్రిల్ 6 (న్యూస్‌టైమ్): ఆర్మీ స్టాఫ్ (సీఓఏఎస్‌) చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నారావణే రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం వెల్లింగ్ట‌న్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీని (డీఎస్ఎస్‌సీ) సందర్శించారు. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ 76వ స్టాఫ్ కోర్సున‌కు హాజరైన ఆయ‌న సీఓఏఎస్ అధ్యాపకులు, అధికారులను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ‘పశ్చిమ, ఉత్తర సరిహద్దుల వెంట అభివృద్ధి, భారత సైన్యం భవిష్యత్ రహదారి పటంపై వాటి ప్రభావం’ అనే అంశంపై ఆయ‌న ఉపన్యాసం ఇచ్చారు.

భార‌త్‌ సరిహద్దుల్లో ఎన్నో నూతన సవాళ్ల‌ను ఎదుర్కొంటుందని ఆయన నొక్కి చెప్పారు. అన్ని ర‌కాల పరిణామాలకు తగు విధంగా దూరంగా ఉండవలసిన అవసరాన్ని గురించి విద్యార్థులను త‌గు విధంగా ప్రోత్సహించారు. డీఎస్ఎస్‌సీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ ఎం.జె.ఎస్.కహ్లాన్ సీఓఏఎస్‌కు ప్ర‌స్తుతం అమ‌లులోవున్న శిక్ష‌ణ కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన‌ ఆధునిక స‌మాచారం అందించారు. మూడు ద‌ళాల‌ ఉమ్మడి నైపుణ్యంపై వృత్తిపరమైన సైనిక శిక్షణకు ప్రత్యేకమైన సూచనతో కొత్త కార్యక్రమాలను చేర్చడం గురించి ఆయ‌న తెలియ‌జేశారు.

ప్రొఫెషనల్ మిలిటరీ ఎడ్యుకేషన్ నిమిత్తం ఎక్సలెన్స్ సెంటర్‌గా డీఎస్ఎస్‌సీ పాత్రను పెంచే దశగా శిక్షణా పాఠ్యాంశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తీసుకుంటున్న మార్పులపై వివరించబడింది. కోవిడ్‌-19 మహమ్మారి పరిమితుల నేప‌థ్యంలోనూ శిక్షణా స్థాయిని నిర్వహించినందుకు అతను కాలేజీని అభినందించాడు.