పేద‌ల భ‌విత‌కు భ‌రోసా…

0
12 వీక్షకులు
  • కాంతులీనుతున్న విద్యాదివ్వెలు

విజయనగరం, మే 27 (న్యూస్‌టైమ్): ప్ర‌భుత్వం విద్యారంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌తినిస్తుండ‌టంతో విద్యాదివ్వెలు కాంతులీనుతున్నాయి. అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌, జ‌గ‌న‌న్న విద్యాకానుక‌, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, నాడు-నేడు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మ బోధ‌న… ఇలా లెక్క‌కు మిక్కిలిగా వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు విద్యారంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టాయి.

తాము కూడా ఉన్నత‌ విద్య‌ను అభ్య‌సించ‌గ‌ల‌మ‌న్న ఆత్మ‌విశ్వాసాన్ని, ధైర్యాన్ని పేద విద్యార్థుల‌కు క‌ల్గించాయి. గ‌త ఏడాది కాలంగా రాష్ట్ర‌ప్ర‌భుత్వం విద్య‌కోసం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై విద్యార్థులు, వివిధ రంగాల నిపుణుల స్పంద‌న ఇలా ఉంది….

ఆంగ్ల మాధ్య‌మం అంద‌రికీ అవ‌స‌రం

సిహెచ్‌ అభిమ‌న్యు, ఆరోత‌ర‌గ‌తి, జిల్లాప‌రిష‌త్ హైస్కూల్‌, బొప్ప‌డాం, నెల్లిమ‌ర్ల మండ‌లం

ఇంగ్లీషు ప్ర‌పంచ భాష‌. ఆంగ్ల‌మ‌ధ్య‌మంలో చ‌దువుకోవ‌డం ప్ర‌తీఒక్క‌రికీ అవ‌స‌రం. ఒక‌ప్పుడు ఇంగ్లీషు విద్య‌కోసం పేద‌లు క‌ల‌గ‌నేవారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీషు విద్య‌ను మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్ట‌డంతో పేద‌ల క‌ల నెర‌వేరింది. స‌క్సెస్ స్కూల్స్ పేరుతో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీషు బోధ‌నకు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి శ్రీ‌కారం చుట్టారు. ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డి ఇంగ్లీషు విద్య‌ను పేద‌ల‌కు మ‌రింత అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. వీరిద్ద‌రికీ మేము రుణ‌ప‌డి ఉంటాము.

అమ్మఒడి ద్వారా పిల్ల‌ల చ‌దువుకు భ‌రోసా

చంద‌క కాంత‌, బొప్ప‌డాం గ్రామం, నెల్లిమ‌ర్ల మండ‌లం

అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా మా పిల్ల‌ల చ‌దువుకు భ‌రోసా దొరికింది. ప్ర‌భుత్వం ఉన్న‌త చ‌దువుకు ఆశ‌రా నిచ్చింది. బ‌డికి పంపిస్తున్న పిల్ల‌ల‌కు ప్ర‌భుత్వ‌మే ఉచితంగా అన్ని సౌక‌ర్యాల‌నూ ఇస్తోంది. మా చేతిసొమ్ము రూపాయి కూడా ఖ‌ర్చు అవ్వ‌టం లేదు. దీంతో అమ్మ ఒడి క్రింద ఇచ్చిన రూ.15వేల‌ను పిల్ల‌ల పెద్ద చదువు కోసం దాచిపెడుతున్నాం. ఇక వారిని చ‌దివించ‌డానికి మాకు బెంగ లేదు. మా పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు భ‌రోసా నిచ్చిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి రుణం ఎప్ప‌టికీ తీర్చుకోలేము.

మా ఆత్మీయ మేన‌మామ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి

బి.స్పంద‌న‌, ఎంపియుపి స్కూల్‌, సిహెచ్ అగ్ర‌హారం, పూస‌పాటిరేగ మండ‌లం

మేము చ‌దువుకోవ‌డానికి ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కుండా, మాకు ఏ క‌ష్టమూ రాకుండా చూసుకుంటున్నారు మా ఆత్మీయ మేన‌మామ‌, మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి. ఒక‌వైపు చ‌దువుకోవ‌డానికి అన్ని సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తూనే, మా ఆరోగ్యం కోసం జ‌గ‌న‌న్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు. ఒక‌ప్పుడు బ‌డిలో భోజ‌నం అంటే తిన‌బుద్ది వేసేది కాదు. ఇప్ప‌డు భోజ‌నం కోసం ప‌రుగులు పెడుతున్నాం. రోజుకో ర‌క‌మైన వంట‌కాల‌తో, మంచి మెనూతో రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని అందిస్తున్నారు. మ‌న ముఖ్య‌మంత్రికి విద్యాలోకం త‌ర‌పున పాదాభివంద‌నాలు.

పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు మార్చేశారు

కె.శేఖ‌ర్, పేరెంట్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌, ఎంపియుపి స్కూల్‌, దేవుప‌ల్లి, బొండ‌ప‌ల్లి మండ‌లం

ఒక‌ప్ప‌డు దీనంగా, ఉసూరుమంటూ ఉండేది మా ఊర్లోని పాఠ‌శాల‌. ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత బ‌డి రూపురేఖ‌లే మారిపోయాయి. నాడు-నేడు పేరుతో ఎంతో అభివృద్ది జ‌రుగుతోంది. ఇంగ్లీషు విద్య‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అమ్మ ఒడి ప‌థ‌కంతో పేద‌ల చ‌దువుకు అండ‌గా నిలిచారు. మంచి భోజ‌నాన్ని పెడుతున్నారు. విద్యాకానుక పేరుతో బ‌డి తెరిచే మొద‌టి రోజే పిల్ల‌ల‌కు కావాల్సిన‌వ‌న్నీ ఇవ్వ‌బోతున్నారు. దీంతో బ‌డికి వ‌చ్చే పిల్ల‌ల సంఖ్య బాగా పెరిగింది.

విద్య‌పై పెట్టుబ‌డి సమాజాభివృద్దికి దోహ‌ద‌ప‌డుతుంది

విద్య‌పై పెట్టే పెట్టుబ‌డి వృధా పోదు. స‌మాజాభివృద్దికి ఇంది ఎంతగానో దోహ‌ద‌ప‌డుతుంది. దీని ఫ‌లాల‌ను భ‌విష్య‌త్ త‌రాలు అనుభ‌విస్తాయి. ఒక‌ప్పుడు విద్యారంగంలో సంస్క‌ర‌ణ‌లు, విప్ల‌వాత్మ‌క మార్పుల‌కోసం స్వ‌చ్ఛంద సంస్థ‌లు కృషి చేసేవి. ఇప్ప‌డు రాష్ట్ర‌ప్ర‌భుత్వ‌మే ఆ బాధ్య‌త‌ను తీసుకొని వినూత్న కార్య‌క్ర‌మాల‌ను, స‌రికొత్త ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. మ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి విద్యారంగంలో విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆయ‌న‌కు అభినంద‌న‌లు.

విద్యలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశానికే ఆద‌ర్శం

డాక్ట‌ర్ ఎన్‌.వి.సూర్య‌నారాయ‌ణ‌, విద్యారంగ నిపుణులు

విద్యారంగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశంలోనే ఆద‌ర్శ‌నీయంగా మారింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‌మోహ‌న‌రెడ్డి విద్య‌కోసం ప్ర‌వేశ‌పెడుతున్న ప‌థ‌కాలు విప్ల‌వాత్మ‌కం. జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన‌, అమ్మ ఒడి, ఆంగ్ల మాధ్య‌మం ఇవ‌న్నీ పేద విద్యార్థుల‌కు ఉన్న‌త విద్య‌పై భ‌రోసా నిచ్చాయి. ఇంత‌టి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌కుండా ముఖ్య‌మంత్రి ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుండ‌టం ఆయ‌న ప‌ట్టుద‌ల‌కు, పేద‌ల అభ్యున్న‌తిప‌ట్ల ఆయ‌న‌కున్న చిత్త‌శుద్దికి నిద‌ర్శ‌నం. హేట్సాప్ టు సిఎం సార్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here