‘రాంభట్ల’కు ఏయూ డాక్టరేట్‌

0
10 వీక్షకులు
ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి నుంచి డాక్టరేట్‌ ఉత్తర్వులను స్వీకరిస్తున్న రాంభట్ల వెంకటరాయ శర్మ

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు విభాగం పరిశోధక విద్యార్థి రాంభట్ల వెంకటరాయ శర్మకు వర్సిటీ డాక్టరేట్‌ లభించింది. విభాగ ఆచార్యులు మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి పర్యవేక్షణలో ‘శ్రీనాథ యుగ సాహిత్యం-తండ్రిపాత్రల పరిశీలన’ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్‌ లభించింది. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో రాంభట్ల వెంకటరాయ శర్మకు డాక్టరేట్‌ ఉత్తర్వులను అందజేసి అభినందించారు.

వెంకటరాయ శర్మ తన పరిశోధనలో భాగంగా శ్రీనాథుని కాలంలో(క్రీస్తుశకం 1350-1500) సంవత్సరాల కాలంలో మెత్తం 150 సంవత్సరాల కాలంలో 24 మంది కవులు, 30 కావ్యాలలోని 140 తండ్రి పాత్రలను పరిశీలించి, పరిశోధించారు. ప్రస్తుత కాలంలో పోల్చిచూడగా నాటి తరం తండ్రి పాత్రలు, పిల్లలతో ఉన్న అనుబంధం, కవులు తీర్చిదిద్దిన విధానాలను, పిల్లల పట్ల చూపిన ప్రేమానురాగాలను పరిశీలించారు. అదే విధంగా పిల్లలు తమ తండ్రుల పట్ల చూపిన ఆదరాభిమానాలను పరిశోధనలో భాగంగా అధ్యయనం చేశారు.