ఉద్యోగుల సంక్షేమానికి కృషిచేస్తున్న ఏయూ వీసీ

342
ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డిని సత్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్‌.ఎ. రెహమాన్‌
  • ఆచార్య ప్రసాదరెడ్డిని అభినందించిన మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌

విశాఖపట్నం, నవంబర్ 11 (న్యూస్‌టైమ్): ఉద్యోగులు సంక్షేమాన్ని కాంక్షిస్తూ మంచి నిర్ణయం తీసుకుని టైం స్కేల్‌ వర్తింప చేసారని మాజీ శాసన సభ్యుడు డాక్టర్ ఎస్‌.ఎ. రెహమాన్‌ అన్నారు. సోమవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

పేదవారి మోముల్లో చిరునవ్వులు విరబూయించారని అభినందించారు. దాదాపు దశాబ్ధం కాలంగా ఈ సమస్య అపరిషృతంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హాయంలో, స్వమంగా విద్యాశాఖ మంత్రి దృష్టికిసైతం ఈ సమస్యను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. అయినా ఫలితం రాలేదన్నారు. ఎంతో సాహసోపేతంగా నిర్ణయం తీసుకుని వర్సిటీ ఉద్యోగులకు టైం స్కేల్‌ వర్తింప చేయడం శుభ పరిణామమన్నారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డిని సత్కరించారు.

ఈ సందర్భంగా వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ గతంలో వర్సిటీ ఉద్యోగుల సమస్య తెలియగానే ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఏయూకు వచ్చి వారికి భరోసా ఇచ్చారన్నారు. నాడు విజయసాయిరెడ్డి చెప్పిన విధంగా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం జరిగిందన్నారు. దీనికి ప్రభుత్వపరంగా తనకు సంపూర్ణ సహకారం లభించిందని, దీనితోనే ఇది సాధ్యపడిందన్నారు.