వర్తమాన అంశాలపై అవగాహన: ఏయూ రిజిస్ట్రార్‌

0
7 వీక్షకులు
అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): అధ్యాపకులు వర్తమాన అంశాలపై విస్తృత అవగాహన కలిగి ఉండాలని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ అన్నారు. శనివారం ఉదయం ఏయూ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ఓరియంటేషన్‌ కోర్సు ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతో పాటు వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఆచార్యులపై ఉందన్నారు. ప్రస్తుత కాలంలో వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మెరుగైన భావ నైపుణ్యాలతో సమర్ధవంతమైన బోధన చేయాలన్నారు.

కేంద్రం సంచాలకులు ఆచార్య పి.విశ్వనాథం మాట్లాడుతూ అధ్యాపకులు అవసరమైన బోధన నైపుణ్యాలను పెంపొందించడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను కాలానుగుణంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్‌.ఏ.డి పాల్‌ తదితరులు పాల్గొన్నారు.