‘పైడి’ పలుకులు…

0
8 వీక్షకులు
 • మంచి అలవాట్ల తరువాత మీరు మీ పిల్లలకు ఇవ్వగలిగినది మంచి జ్ఞాపకాలే.
 • మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు.
 • మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు.
 • మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి.
 • మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు.
 • మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడుకు రక్ష.
 • మంచి జ్ఞాపకశక్తి మంచిదే, కాని ఇతరులు మీకు కలిగించిన హానిని మరచిపోయే సామర్ధ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది.
 • మంచి దస్తూరి అలవాటు చేసుకోవటం విద్యాభ్యాసంలో ఒక భాగం.
 • మంచి పనులు ఆలస్యాన్ని సహించవు.
 • మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి.
 • మంచి పనే మంచి ప్రార్ధన.
 • మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజూ ఆనందాన్ని ఇస్తుంది.
 • మంచి పుస్తకాలు ప్రపంచపు అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు.
 • మంచి మిత్రుడు రెండు శరీరాలలో నివశించే ఒక ఆత్మ.
 • మంచి విషయాలను పొందేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాల్ని ఇస్తాడు.
 • మంచి శ్రోతలే మంచి వక్తలు. వినడం నేర్చుకోండి.
 • మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బీజాలు.
 • మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే.
 • మంచికి ఉన్న స్వేచ్చ చెడుకు లేదు. చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు.
 • మంచితనానికి మించిన మతమే లేదు.
 • మంచితనాన్ని మించిన గుణం లేదు. మంచితనంలోనే మర్యాద, మమత.
 • మంచిమనుషుల మనసులు వెన్నలా ఉంటాయి – తులసీదాసు.
 • మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది.
 • మంచీ, చెడూ అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది.
 • మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికీ, మరణానికీ కూడా విరుగుడు మందు.
 • మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువ అవుతాము.
 • మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే, మనమే స్వయంగా నష్టపోతాము.
 • మన దురదృష్టాలకు మూలకారణం ఇతరులలో తప్పులు వెదకడం మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి.
 • మన మాటలు చెప్పేదానికన్న మన జీవితం చెప్పేది ఉత్తమమైనది.
 • మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రానివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి.
 • మనం ఇతరులలో లోపాన్ని ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి.
 • మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే, అంత ఎక్కువగా అదృష్టం మనల్ని వరిస్తుంది.
 • మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది.
 • మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనస్సును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాము.
 • మనం చదివినదంతా మరచిపోయినప్పుడు చదువే వెనుక నుండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది.
 • మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేం.
 • మనం చేసే పనిని పదిమందీ పంచుకుంటే, చేసే పని ఎంతో తేలికైపోతుంది.
 • మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చుకాని, ఏ పనీ చెయ్యకుండా మాత్రం మనం ఆనందం పొందలేం.
 • మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్ధం కావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here