‘పైడి’ పలుకులు…

0
9 వీక్షకులు
 • మన వలన సమాజానికి మేలు జరగకపోయినా పర్వాలేదు. కీడు మాత్రం జరుగకూడదు.
 • జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోవడం… తనను తాను నియంత్రించుకోగల్గడం.
 • జ్ఞానానికి, దీపానికి ప్రత్యేక గుర్తింఫు అవసరం లేదు. అవి పాతాళంలో ఉన్నా, దశదిక్కులకు, తమ కాంతులను ప్రసరింపజేస్తూనే ఉంటాయి.
 • ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.
 • గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.
 • ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.
 • ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.
 • పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.
 • పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.
 • అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.
 • మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.
 • మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం… బలహీనతే మరణమని గుర్తించండి.
 • వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు.
 • పరిపూర్ణత అనేది ఆచరణ నుంచి మాత్రమే వస్తుంది.
 • ఆత్మ విశ్వాసం దెబ్బతింటే సామర్ధ్యం పని చెయ్యదు, అందుకే ఎప్పుడు ఆత్మ విస్వసాని కోల్పోకండి.
 • దేనితోను ఎప్పుడు సంతృప్తి పడనివాడు ఎవ్వరిని సంతృప్తి చెయ్యలేడు.
 • ఉన్నదానితో సంతృప్తి చెందితే మంచిదేకని మనకున్న జ్ఞానం చాలు అనుకోవడం అజ్ఞానం.
 • బలంతో గెలవలేనప్పుడు యుక్తితో గెలవడమే తెలివైన వాడి లక్షణం.
 • సమాజంలో మనం స్నేహపూర్వకంగా మేలిగినప్పుడే మన చుట్టూ వుండేవారు కూడా అలాగే మెలుగుతారు.
 • ఎప్పుడు సుఖంగా సాగుతుంటే కష్టం విలువ తెలియదు, అప్పుడు సుఖం కూడా విసుగనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here