‘సింహపురి’ రక్తదాన శిబిరం

0
17 వీక్షకులు

నెల్లూరు, మే 26 (న్యూస్‌టైమ్): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్. విజయ కృష్ణారెడ్డి ప్రాంభించి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజానాయర్ కూడా పాల్గొని రక్త దానం చేశారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత 2 నెలలుగా కొనసాగుతున్న కోవిడ్-19 లాక్‌డౌన్ వలన ఏర్పడిన రక్త నిల్వల కొరత వలన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలు, కాన్సర్ పేషెంట్స్, గర్భిణీ స్త్రీలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు ఎదుర్కొంటున్నారన్నారు. విశ్వవిద్యాలయం తనవంతు బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని చేప్పట్టటం ద్వారా సుమారు 60 యూనిట్ల రక్తం సేకరించటం గొప్ప ఘనకార్యంగా భావిస్తున్నానని, అందుకు సహకరించి ముందుకు వచ్చిన ప్రతి రక్తదాతను అయన అభినందించారు. రెడ్ క్రాస్ వారు చేస్తున్న కృషిలో విశ్వవిద్యాలయం కూడా భాగస్వామి అవ్వటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

అదే విధంగా జిల్లాలో ఉన్న దాతలు అందరు ఎటువంటి భయాలు సంశయాలు లేకుండా రక్తదానం చేయటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ సమయంలో ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు విశ్వవిద్యాలయ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం ఆధ్వర్యంలో చేపట్టటం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో కృష్ణ చైతన్య కళాశాల ఎన్ఎస్ఎస్, విద్యార్థులు చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.

రెడ్ క్రాస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత సంక్లిష్టమైన పరిస్థుతులలో కూడా రక్తం అవసరమైన వారికందరికి అందజేయటం జరిగిందని, ఇటువంటి రక్తదాన శిబిరాల వలన ఇంకా ఎంతోమందికి రెడ్ క్రాస్ సహాయం చేయటానికి తోడ్పడుతుందని అన్నారు. చివరిగా విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కాన్సుల్ మెంబెర్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ యూనివర్సిటీ జిల్లా అభివృద్ధిలో ముఖ్యభూమిక పోషిస్తుందని ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఉదయ్ శంకర్ అల్లం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వై. విజయ, రెడ్ క్రాస్ సిబ్బంది రవి, మధు భాస్కర్, హెల్ప్ ది నీడి టీం మెంబెర్స్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here