బ్రహ్మచర్యం వల్ల అమృతత్వాన్ని పొందవచ్చా?

0
13 వీక్షకులు

”ఆష్టాశీతి సహస్రాణామృషీణా మూర్ధ్వరేససాం
ఉత్తరేణార్నమ: పంథాస్తేమృతత్వం హి భేజిరే”
బ్రహ్మచర్యం వల్ల అమృతత్వాన్ని పొందవచ్చని విష్ణుపురాణం చెబుతుంది. బ్రహ్మచర్యం గొప్ప సాధన. ఈ లోకంలో ఆత్మగౌరవంతో జీవించాలన్నా బ్రహ్మచర్యం చాలా అవసరం. గోవిందాలయ అర్చకులు మొదట్లో బ్రహ్మచారులుగా ఉండినారట. ఒకరోజు వాళ్ళకు రాజునుంచి పిలుపు వచ్చిందట.

”రాజి పిలిస్తే రావడానికి మేమేమైనా ఆయన కింకరులమా? మాతో ఏమైనా పని వుంటే ఆయన్నే ఇక్కడికి రమ్మనండి” అని వారు చాలా ధీటుగా జవాబిచ్చారట. ఆ అర్చకులే పెళ్ళిళ్ళు చేసుకున్నాక రాజు పిలువకపోయినా చాటికిమాటికి ఏదో ఒక నెపంతో రాజు దర్శనానికి వెళ్ళేవారుట, ఏవైనా కానుకలు, దంభావనలు దొరుకుతాయనే ఆశతో. బ్రహ్మచర్యం అంటే భౌతిక వాంచలను త్యజించడం. ఆత్మ జ్ఞాన సంపాదనకు ఈ సాధన చాలా అవసరం. చాందోగ్యోపనిషత్తు ఒక చోట్లో బ్రహ్మచర్యాన్ని చాలా స్తుతించింది.