ఖమ్మం, ఏప్రిల్ 11 (న్యూస్‌టైమ్): ఖమ్మంలో ఏర్పాటుచేసిన కాల్షియం కార్బైడ్, ఇథలిన్‌ రహిత మామిడి పండ్ల మేళాను డీడీహెచ్ అనసూయ సందర్శించి నిర్వాహకులను మెచ్చుకున్నారు. రైపనింగ్ ఛాంబర్ బిల్లును, మామిడి పండ్లను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన కాల్షియం కార్బైడ్, ఇథలిన్‌ రహిత మామిడి పండ్లను మాత్రమే విక్రయించాలని సూచించారు. ఆదర్శ రైతు బాణోతు లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి అమ్మకాలను చేపట్టినట్లు తెలిపారు.

ఖమ్మంలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో (పెవిలియన్ గ్రౌండ్, ఇల్లందు క్రాస్ రోడ్డు రైతు బజార్, గాంధీ చౌక్ ఆంజనేయస్వామి విగ్రహం పక్కన) మామిడి పండ్ల మేళా నిర్వహించి విక్రయాలు జరుపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమ్మకాలకు చిన్న రసాలు, పెద్ద రసాలు, హిమాయిత్, కొబ్బరి మామిడి, బంగినపల్లి వంటి రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయని, ఉగాది తర్వాత నుంచి దశెరి, అల్ ఫన్ సొ, మల్లిక, కేసరి, సువర్ణరేఖ తదితర తియ్యటి మామిడి పండ్లు మార్కెట్లోకి రానున్నాయన్నారు. అలాగే, పచ్చిడి మామిడికాయలు తెల్ల గులాబీ, జలాలు, చిన్న రసాలు కూడా అందుబాటులోకి వస్తాయని, కావాల్సినవారు సంప్రదించాలని కోరారు. పట్టణ ప్రజలకు అతి తక్కువ ధరలకే అమ్మకలను చేపట్టామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు మామిడి పండ్ల మేళాను సందర్శించి మధురమైన తియ్యటి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఆస్వాదించాలని సూచించారు.

పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు! అందులోనూ మామిడి, అరటి, యాపిల్‌ అంటే నోరూరనివారు ఎవరుంటారు? కాని ఆ పండ్లని మగ్గపెట్టేందుకు వాడే విషపదార్థాల గురించి వింటుంటేనే భయం కలుగుతోంది. మరీ ముఖ్యంగా కార్బైడ్‌తో పండించిన పండ్లని ముట్టుకోవాలంటేనే దడ పుడుతోంది. మరి నిజంగానే కార్బైడ్‌ అంత ప్రమాదకరమైనదా? అయితే దాన్ని ఎందుకు వాడుతున్నారు? దాని బారిన పడకుండా ఉండటం ఎలా? మామిడి, అరటి వంటి పండ్లను చెట్టు మీద నుంచి కోసిన తరువాత కూడా మగ్గేందుకు కాస్త సమయం పడుతుంది. ఇది నిదానంగా జరిగే చర్య. పైగా వాటిని మగ్గపెట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా కాస్త కేల్షియం కార్బైడ్‌ని కనుక వాటి మీద ప్రయోగిస్తే అవి ఇట్టే పండిపోతాయి. లేదా కనీసం పండినట్లు కనిపిస్తాయి. ఇందులో మరో లాభం కూడా ఉంది!

పచ్చిగా ఉండగానే కాయలని కోయడం, అవి గట్టిగా ఉన్నప్పుడే మార్కెట్‌కు తరలించడం వల్ల పండ్లు దెబ్బతినే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పైగా కార్బైడ్‌తో పండిన పండ్లు లోపల ఇంకా పచ్చిగానే ఉంటాయి కాబట్టి చాలా రోజులు నిలవ ఉంటాయి కూడా! ఇక మిలమిలా మెరిసిపోయే కార్బైడ్‌ పండ్లని చూసిన కొనుగోలుదారులకి, వాటిని రుచి చూడాలన్ని ఆశ ఎలాగూ కలుగుతుంది. కాల్సియం కార్బైడ్‌లో అర్సెనిక్‌, ఫాస్పరస్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి అధిక మొతాదులో శరీరంలోకి చేరితే ఏర్పడే సమస్యలు అన్నీఇన్నీ కావు. తలనొప్పి, కళ్లు తిరగడం, నిద్రలేమి మొదలుకొని నరాలకు సంబంధించిన నానారకాల సమస్యలకూ ఇది దారితీయవచ్చు. చర్మం మీద కూడా కార్బైడ్‌ ప్రభావం అధికంగా ఉంటుంది. దద్దుర్లు నుంచి చర్మక్యాన్సర్‌ వరకూ కార్బైడ్‌ పండ్లని తినేవారిలే ఎలాంటి రోగమైనా తలెత్తవచ్చు. ఇక గుండె, మెదడు, కీళ్లు, జీర్ణాశయం వంటి శరీర భాగాల మీద ఈ కార్బైడ్‌ తీవ్ర ప్రభావం చూపుతుందనే వార్తలూ వినిపిస్తూ ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కనుక కార్బైడ్‌తో మగ్గపెట్టిన పండ్లని తింటే అవి వారికీ, వారి కడుపులో ఉన్న బిడ్డకీ కూడా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

కార్బైడ్‌ గురించి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా, రూపాయి కోసం వ్యాపారస్తులు పడే కక్కుర్తి ముందు ఉపయోగం లేకుండా పోతోంది. ఆరోగ్య శాఖ అధికారులు కూడా కార్బైడ్‌ వాడకాన్ని చూసీచూడనట్లు ఊరుకుంటారన్న ఆరోపణలూ ఉన్నాయి. కాబట్టి కార్బైడ్‌ పండ్ల నుంచి దూరంగా ఉండాల్సిన బాధ్యత వినియోగదారులదే. ఇప్పుడు కార్బైడ్‌తో పండించని పండ్లు అంటూ ప్రత్యేకంగా కొన్ని దుకాణాలు వెలుస్తున్నాయి. నమ్మకం ఉంటే వాటిలో పండ్లను తీసుకోవచ్చు. లేదా పండ్లని కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నా సరిపోతుంది. కార్బైడ్‌తో పండించిన పండ్లు చూడ్డానికి మరీ పచ్చగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.

చాలా సందర్భాలలో పండ్లు ఒక చోట మగ్గి, మరో చోట పచ్చిగా ఉన్నట్లు రెండు రంగులలో ఉంటాయి. పైకి పండిపోయినట్లు ఉండి, లోపల పచ్చిగా ఉందంటే అది ఖచ్చితంగా కార్బైడ్‌ మహిమే! కార్బైడ్‌తో పండిన పండ్లు కృత్రిమంగా మగ్గి ఉంటాయి కాబట్టి, వాటిలోని తీపిశాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అన్నింటికీ మించి మామూలు పండ్లు మగ్గినప్పుడు వచ్చే ఆ సువాసన, కార్బైడ్ పండ్లలో కనిపించదు. అంటే రంగు, రుచి, వాసనల ద్వారా ఫలానా పండు కార్బైడ్‌తో మగ్గించారు అని తేలిపోతుందన్నమాట. ఇదీ కార్బైడ్ పండ్ల కథ! ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒకోసారి మోసపోయే ప్రమాదం ఉంది కనుక, తినబోయే ముందర కాసేపు పండ్లను నీటి ధార కింద ఉంచితే, వాటిలోని విష రసాయనాలు చాలావరకూ కొట్టుకుపోయే అవకాశం ఉందని సూచిస్తున్నారు నిపుణులు. కాల్సియం కార్బైడ్ ఒకరసాయన సంయోగ పదార్థం. ఇది ఒక కర్బన రసాయన సమ్మేళనపదార్థం. కాల్సియం కార్బైడ్ రసాయన సంకేతపదం CaC2. కాల్సియం, కార్బన్ మూలకాల సమ్మేళనం వలన కాల్సియం కార్బైడ్ఏర్పడినది. కాల్సియం కార్బైడ్ నుండి పారిశ్రామికంగా ఎసిటిలిన్ వాయువును, కాల్సియం సైనమిడ్‌ను ఉత్పత్తి చేస్తారు.

శుద్ధమైన కాల్సియం కార్బైడు రంగులేని ఘనపదార్థం, కాని టెక్నికల్ గ్రేడ్ కాల్సియం కార్బైడ్ గ్రే లేదా బ్రౌన్ రంగులో ఉండును.ఇలాంటి టెక్నికల్ గ్రేడ్/సాంకేతిక స్థాయి సంయోగపదార్థంలో 80–85% వరకు కాల్సియం కార్బైడ్ ఉండి మిగిలినశాతంలో కాల్సియం ఆక్సైడ్ (CaO, కాల్సియం ఫాస్పైడ్ (Ca3P2), కాల్సియం సల్ఫైడ్ (CaS), కాల్సియం నైట్రైడ్ (Ca3N2), సిలికాన్ కార్బైడ్ (SiC) వంటివి ఉంటాయి. ఇలాంటి టెక్నికల్ గ్రేడ్/సాంకేతిక స్థాయి సంయోగపదార్థంలో తేమవలన అది వెల్లుల్లి వాసనను పోలిన ఘాటైన వాసన వెలువరిస్తాయి. కాల్సియం కార్బైడ్ను అసిటిలిన్ వాయువు ఉత్పత్తి చెయడానికి, రసాయన ఎరువుల ఉత్పత్తిలో, ఉక్కు తయారీలో, కార్బైడ్ దీపాలలో అసిటిలిన్ వాయుజనకానికై ఉపయోగిస్తారు. కాల్సియం కార్బైడ్ తెల్లని లేదా గ్రేరంగులో ఉండే ఘనపదార్థం.

కాల్సియం కార్బైడు అణుభారం 64.099గ్రాములు/మోల్.25 °C వద్ద కాల్సియం కార్బైడ్ సాంద్రత 2.22 గ్రాములు/సెం.మీ3. ఈ సంయోగ పదార్థం ద్రవీభవన స్థానం 2,160 °C (3,920 °F;2,430 K)., బాష్పీభవన స్థానం 2,300 °C (4,170 °F; 2,570 K). కాల్సియం కార్బైడ్ నీటితో చర్య జరపడం వలన అసిటిలిన్ వాయువును విడుదల అవుతుంది. కాల్సియం కార్బైడ్ చతుస్కోణాకార స్పటికసౌష్టవాన్ని ప్రదర్శించును. పారిశ్రామికంగా కాల్సియం కార్బైడును విద్యుతు ఆర్క్‌ఫర్నేస్‌లో సున్నం, కోక్ మిశ్రమాన్ని 2000°Cవద్ద వేడిచెయడం/కాల్చడం ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. 1892నుండి ఈ విధానంలోనే వాణిజ్య స్థాయిలో కాల్సియం కార్బైడును ఉత్పత్తి చేస్తున్నారు, ఇప్పటికీ ఈ ఉత్పత్తి విధానంలో ఎటువంటి మార్పులేదు. CaO + 3C → CaC2 + CO రెండు మూలకాల మధ్య రసాయన చర్య జరిగి సంయోగపదార్థం ఏర్పడుటకు కావలసిన అత్యధిక ఉష్ణోగ్రతను సాంప్రదాయపద్ధతిలో పొందటం ఆచరణరీత్యా సాధ్యం కాకపోవడంవలన గ్రాఫైట్ ఎలాక్త్రోడులను కలిగిన విద్యుతు ఆర్క్‌ఫర్నిస్‌లో మాత్రమే కాల్సియం కార్బైడును ఉత్పత్తి చేస్తున్నారు.

ఇలా ఉత్పత్తి కాబడిన ముడిఉత్పత్తిలో 80% వరకు కాల్షియం కార్బైడు ఉండును.భారీ గడ్డ/ముద్దలాఉత్పత్తి అయిన కాల్సియం కార్బైడును కొన్ని మి.మీ సైజు నుండి 50 మి.మీ (సుమారు రెండుఅంగుళాలు) పరిమాణం వరకు ముక్కలుగా చేసెదరు. ఉత్పత్తి అయిన సంయోగ పదార్థంలోని కాల్సియం కార్బైడు శాతాన్ని, జలవిశ్లేషణ ద్వారా, అది ఉత్పత్తి చేసి అసిటిలిన్ వాయువు పరిమాణం ఆధారంగా నిర్ధారిస్తారు. ఉదాహారణకు బ్రిటీష్ ప్రమాణం ప్రకారం 20 °C ఉష్ణోగ్రతవద్ద, 101 kPa వత్తిడివద్ద ఒకకిలో కాల్సియం కార్బైడు రసాయన పదార్థము 295 లీటర్ల అసిటిలిన్ వాయువును ఉత్పత్తి చేయాలి. జర్మనీ ప్రమాణం ప్రకారం 300 లీటర్లు/కిలోకు అసిటిలిన్ వాయువు ఉత్పత్తి కావాలి. కాల్సియం కార్బైడులోని మలినాలలో సాధారణంగా ఫాస్ఫైడ్ ఉండును. ఈ ఫాస్ఫైడ్ జలవిశ్లేషణ వలన ఫాస్ఫిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విద్యుతు ఆర్క్‌ఫర్నేస్ పద్ధతిలో కాల్సియం కార్బైడును తయారుచేసే పద్ధతిని 1892లో టి.ఎల్.విల్సన్, అదే సంవత్సరం హెచ్.మొయిస్సన్ (H. Moissan) స్వంతంత్రంగా కనుగొన్నారు. శుద్ధమైన కాల్సియం కార్బైడు రంగులేని ఘనపదార్థం. సాధారణ ఉష్ణోగ్రత వద్ద సాధారణ స్పటికనిర్మాణం, రూపవికృతి పొందిన రాతి ఉప్పు సౌష్టావంతో, C22−యూనిట్‌లను సమాంతరంగా కలిగి ఉంటుంది. కాల్సియం కార్బైడు నీటితో రసాయన చర్య జరపడం వలన అసిటిలిన్ వాయువు, కాల్సియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. ఈ విషయాన్ని 1862లో ఫ్రెడ్రిచ్ హోలెర్ (Friedrich Wöhler) కనుగొన్నాడు. CaC2 + 2 H2O → C2H2 + Ca (OH) 2 ఈ రసాయన చర్యను ఆలంబనగా చేసుకొని తరువాతి కాలంలో పారిశ్రామికంగా అసిటిలిన్ వాయును పలు పరిశ్రమలలో కాల్షియం కార్బైడు నుండి ఉత్పత్తి చేయడం ప్రారంభమైంది. వర్తమాన కాలంలో మీథెన్‌ను పాక్షికంగా దహించడం వలన అసిటిలిన్ వాయువు ఉత్పత్తి చేస్తున్నారు.

లేదా హైడ్రోకార్బన్‌లను విచ్చితి చేయునపుడు ఇథైలిన్ స్ట్రీమ్‌లో పక్కఉత్పత్తిగా అసిటిలిన్ వాయువు జనించును. ఈ పద్ధతిలో సంవత్సరానికి 0.4 మిలియను టన్నులవరకు ఉత్పత్తి అవుతుంది. ఇప్పటికీ చైనా దేశంలోని పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తి చేసే రసాయన పరిశ్రమలకు అవసరమైన అసిటిలిన్ వాయువును ఉత్పత్తి చేయడానికి కాల్సియం కార్బైడు ముఖ్యవనరుగా ఉన్నది. క్రమేనా చైనాలో కాల్సియం కార్బైడు ఉత్పత్తి ప్రమాణం పెరుగుతోంది. ఒక్క 2005లోనే దాదాపు 8.94 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయిందంటే పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు. చైనా 17 మిలియను టన్నుల ఉత్పత్తిసామార్ధ్యం కలిగి ఉంది. అమెరికా, యూరోప్, జపాన్ దేశాలలో కాల్సియం కార్బైడు వినియోగం తగ్గుముఖం పట్టింది. అమెరికాలో 1990లో కాల్సియం కార్బైడు ఉత్పత్తి 0.236 మిలియను టన్నులు. అధికఉష్ణోగ్రత వద్ద కాల్షియం కార్బైడు చర్యవలన కాల్సియం సైనమిడ్ (calcium cyanamide) ఏర్పడుతుంది. కాల్సియం సైనమిడ్ ను రసాయన ఎరువుగా ఉపయోగిస్తారు. కాల్సియం సైనమిడ్ జలవిశ్లేషణ చెందటం వలన సైనమిడ్ (H2NCN) ఏర్పడుతుంది. ఇనుమును (పిగ్ ఐరన్, కాస్ట్ ఐరన్, ఉక్కు) ఉత్పత్తి చేసేటప్పుడు డిసల్ఫరిజేసన్ చేయడానికి కాల్షియం కార్బైడును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉక్కు తయారీలో ద్రవఇనుములో రద్దు/తుక్కు (scrap) నిష్పత్తిని పెంచడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. శక్తివంతమైన డిఆక్సిడైజరుగా ఉపయోగిస్తారు.

అలాగే, కాల్సియం కార్బైడును కార్బైడు ల్యాంప్/దీపాలలో అసిటిలిన్ వాయుజనకంగా ఉపయోగిస్తారు. కాల్సియం కార్బైడును పైన నీటిని నెమ్మదిగా పడేలా చేసి, విడుదల అగు అసిటిలిన్ వాయువును మండించి, వెలువడు ప్రకాశ కాంతిని దీపకాంతిగా వాడెదరు. కొవ్వొత్తులకన్న కార్బైడు లాంపులు నిలకడ కలిగిన, ప్రకాశవంతమైన కాంతిని ఇచ్చినప్పటికీ బొగ్గు గనులలో కార్బైడు లాంపులు ఉపయోగించడం ప్రమాదకరం. ఇప్పటికి స్లేట్/బలపపురాయి, రాగి, తగరం ఖనిజపు గనులలో కార్బైడు లాంపులను ఉపయోగిస్తున్నారు. వర్తమాన కాలంలో విద్యుత్తు దీపాలను కార్బైడులాంపుల స్థానంలో వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన దేశాలలోని, ఉదాహరణకు పోటోసి (Potosí, బొలీవియా (Bolivia) సమీపంలోని వెండి గుహ/గనులలో కార్బైడు లాంపులనే వినియోగిస్తునారు. మోటారు వాహనాలు, మోటరు సైకిళ్ళను కనుగొన్న ప్రారంభకాలంలో మొదట హెడ్‌లైట్లలో కార్బైడు లాంపులనే వాడెవారు, తరువాత విద్యుత్తు లైట్లు వచ్చాయి.

కొందరు వ్యాపారులు పండ్లను కృత్రిమంగా మాగబెట్టుటకై కాల్సియం కార్బైడును వాడుతున్నారు. కాల్షియం కార్బైడ్‌ ఉపయోగించి పండించిన పండ్లను తినడం ఆరోగ్యానికి హానికరం. కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెట్టిన మామిడి పండ్లను తిన్న వారి ఆరోగ్యం దెబ్బ తింటుంది. మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే కాల్షియం కార్బైడ్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించినప్పటికీ వ్యాపారులు ఈ ప్రమాదకరమైన పద్ధతిని అలాగే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు కాల్షియం కార్బైడ్‌తో కాయల్ని మాగబెట్టడాన్ని నిషేధించాయి. ఆహార కల్తీ నిరోధక చట్టంలోని సెక్షన్ 44 ఏఏ ప్రకారం ఎసిటిలిన్ వాయువుతో (వాడుకలో కార్బైడ్ వాయువు) కృత్రిమంగా మాగబెట్టిన పండ్లను అమ్మడం నేరం.

బిగ్ బ్యాంగ్ కానోన్, బాంబో కానోన్ వంటి ఆట ఫిరంగుల్లో (toy cannons) కాల్సియం కార్బైడును ఉపయోగిస్తారు. కాల్సియం కార్బైడును కాల్సియం ఫాస్ఫైడ్తో కలిపి నావికా దళం ఉపయోగించే తేలియాడే, స్వయంగా మండు సంకేత జ్వాలనిచ్చు ఉపకరణాలలో ఉపయోగిస్తారు. ఇటువంటి వాటిని హోమ్స్ మరైన్ లైఫ్ ప్రొటక్షన్ అసోసియేసన్ వారు ఉత్పత్తి చేస్తున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్సియం కార్బైడు నీటితో రసాయనచర్య వలన అసిటిలిన్ వాయువు ఏర్పడదు, బదులుగా కాల్సియం కార్బోనేట్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ వాయువు ఏర్పడుతుంది. చిన్నచిన్న వర్క్ షాపులలో లోహలను గ్యాస్ వెల్డింగు చేయడానికి కావాలసిన అసిటిలిన్ వాయువును కాల్సియం కార్బైడును ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు.