న్యూఢిల్లీ, డిసెంబర్ 2 (న్యూస్‌టైమ్): ఎలక్ట్రోస్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ (ఇసీఎల్)లో శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ (ఎస్‌పీఎల్) పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ విలీనం కావటానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. కాంపిటిషన్ చట్టం, 2002లోని సెక్షన్ 31(1) కింద ఈ విలీనానికి సీసీఐ ఈరోజు ఆమోదం తెలియజేసింది. ఈసీఎల్ భారత్‌లో ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇది ఎలక్ట్రో స్టీల్ కంపెనీల గ్రూప్‌నకు హోల్డింగ్ కంపెనీ. ప్రధానంగా ఇది డక్టైల్ ఐరన్ పైపులు, డక్టైల్ ఐరన్ ఫిటింగ్స్, పోత ఇనుము పైపుల తయారీ, సరఫరాలో నిమగ్నమై ఉండే సంస్థ. ఎస్‌పీఎల్ అనేది కూడా పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇది ఎలక్ట్రో స్టీల్ గ్రూప్‌లో భాగం. డక్తైల్ ఐరన్ పైప్‌ల తయారీ, పంపిణీలో నిమగమై ఉండే కంపెనీ. ఇప్పుడు ప్రతిపాదించిన ఈసీఎల్‌తో ఎస్పీఎల్, విలీనం వల్ల ఎస్‌పీఎల్ అనే కంపెనీ పూర్తిగా రద్దవుతుంది. ఈసీఎల్ అనే కంపెనీ మాత్రమే మనుగడలో ఉంటుంది. సవివరమైన సీసీఐ ఆదేశాలు త్వరలో వెలువడతాయి.

రివిగో సర్వీసెస్ కైవసానికి సీసీఐ ఆమోదముద్ర…

అలాగే, రివిగో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్ప్రింగ్ కాంటర్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ (ఎస్‌సీఐఎల్) సంస్థ తీసుకోవటానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలియజేసింది. కాంపిటిషన్ చట్టం, 2002లోని సెక్షన్ 31(1) కింద తప్పనిసరిగా మార్చుకునే వెసులుబాటు ఉండే ఆధిక్యపు వాటాల చందా ద్వారా ఈ కొనుగోలుకు అవకాశం కల్పించింది. ఎస్‌సీఐఎల్ అనేది మారిషస్ చట్టాల కింద ఏర్పాటైన ఒక ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ కంపెనీ. దీనికి భారత్‌లో భౌతికంగా ఎలాంటి కార్యాలయామూ లేదు.

దీని వాటాదారులు వార్ బర్గ్ పింకస్ ఎల్ఎల్సీ (వార్ బర్గ్) నిర్వహణలో ఉండే ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ వార్ బర్గ్. అది కొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తుంది. ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ యాజమాన్యంలోని పోర్ట్ ఫోలియో కంపెనీలు వివిధ రంగాల్లో చురుగ్గా పనిచేస్తాయి. అందులో విద్యుత్, ఆర్థిక రంగ సేవలు, ఆరోగ్యం, ఫార్మా, సాధారణ బీమా, వినియోగదారు సేవలు, పారిశ్రామిక, వ్యాపార సేవలు, టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్లు ఉన్నాయి.

రివిగో అనేది ట్రక్కుల పరిశ్రమలో టెక్నాలజీ సంబంధమైన రవాణా కంపెనీ. డ్రైవర్ రిలే అనే సరికొత్త విధానాన్ని ఇది వాడుకుంటుంది. దీనివలన ట్రక్కుల పరిశ్రమ సాధించే సాధారణ సగటు వేగం కంటే ఎక్కువగా మరింత దూరం వెళ్లటానికి వీలు కలుగుతుంది. దీని కార్యకలాపాలలో రిలే ఆధారంగా సరకు రవాణా జరుగుతుంది. సరకు రవాణాను పూర్తి స్థాయి డిజిటల్ సాయంతో నడపటానికి, మొత్తం పారదర్శకమైన విధానాన్ని నిర్వహించటానికి ఇది దోహదం చేస్తుంది. అనేక వాహనాలను నడిపే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విలీనానికి సంబంధించిన సవివరమైన సీసీఐ ఆదేశాలు త్వరలో వెలువడతాయి.