వెబ్ ఆధారిత మీడియాకు గుర్తింపు

0
27 వీక్షకులు
డీఏవీపీ అధికారిక వెబ్‌సైట్ హోం పేజీ

ఇప్పటి వరకూ కేవలం న్యూస్ వెబ్‌సైట్లకు మాత్రమే రేట్ కార్డులను జారీచేస్తున్న కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని DAVP తన సేవల పరిధిని మరింత విస్తరించి విధివిధానాలను తాజాగా సవరించింది.

ఈ ప్రక్రియకు ‘Policy Guidelines for Empanelment/Engagement of Social Media Platforms with Bureau of Outreach and Communication’గా నామకరణం చేసింది. ఇదే విధానం ఇది వరకు ‘Policy Guidelines and Criteria for Empanelment and Rate Fixation for Central Govt Advertisements on Websites’ పేరిట వ్యవహారంలో ఉండేది.

తాజా సవరణల మేరకు రూపొందించిన మార్గదర్శకాలను బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్ (Bureau of Outreach and Communication) ఈనెల (మే) 13న అధికారికంగా తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

(ఈ ప్రకటనను, మార్గదర్శకాల పూర్తి వివరాలను ఇక్కడ క్లిక్ చేసి పొందవచ్చు)
ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ఐకాన్లు

ఇది వరకు కేవలం వెబ్‌సైట్లను మాత్రమే గుర్తిస్తూ వచ్చిన కేంద్రం ఇకమీదట ఇంటర్నెట్ ఆధారిత అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లనూ ఎంపానెల్మెంట్/ఎంగేజ్‌మెంట్ కోసం పరిగణనలోకి తీసుకోనుంది. తాజాగా సవరించిన మార్గదర్శకాలలో ‘Social Media Platforms’ నిర్వచనాలు (Definitions), నేపథ్యాన్నీ పూర్తిగా వివరించింది.

ఆ మేరకు రేడియో, టెలివిజన్, ప్రెస్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వెబ్‌సైట్లు, ప్రింటెడ్ పబ్లిసిటీ, అవుట్డోర్ పబ్లిసిటీ, సాంప్రదాయక కమ్యూనికేషన్ మోడ్లతో సహా మాస్ కమ్యూనికేషన్ బహుళ మాధ్యమాల ద్వారా ప్రభుత్వ విధానాలు, పథకాలు, కార్యక్రమాలపై సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) బాధ్యత వహిస్తుందని వెల్లడించింది.

ప్రసార రంగానికి సంబంధించిన విధాన విషయాలకు, అలాగే పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టింగ్ (ప్రసార భారతి), బహుళ మీడియా ప్రకటనలు, ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాల ప్రచారం, ఫిల్మ్ ప్రమోషన్, సర్టిఫికేషన్, ప్రింట్ మీడియా నియంత్రణకు కూడా MIB కేంద్ర బిందువని మరోమారు సూచించింది. భారతీయ సమాచార సేవల అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ లైన్ మంత్రిత్వ శాఖగా MIBని పేర్కొంది. సమాచార, కమ్యూనికేషన్ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాలతో పనిచేయడం అందువల్ల, MIB ఒక ఎనేబుల్ సృష్టించడానికి ఒక మిషన్, దృష్టిని కలిగి ఉందని తెలిపింది. జ్ఞానం, వినోదం, సమాచార సులభతరం, వ్యాప్తికి అనువైన వాతావరణాన్ని కల్పించడానికి కృషిచేస్తుందని వివరించింది ప్రభుత్వ ప్రధాన పథకాలను సమర్థవంతంగా చేరుకోవడం, ప్రజా సేవా ప్రసారాలను (టీవీ, రేడియో) బలోపేతం చేయడం, ప్రసారరంగ అభివృద్ధికి దోహదపడటం, ఆరోగ్యకరమైన వినోదం కోసం విలువ ఆధారిత సినిమాను ప్రోత్సహించడం ద్వారా సేవలు కొనసాగిస్తుంది.

బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్ కమ్యూనికేషన్ (బీఓసీ)ని 2017 డిసెంబర్ 8వ తేదీన ఏర్పాటు చేశారు. మునుపటి డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (DAVP), డైరెక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ (DFP), సాంగ్ & డ్రామా డివిజన్ (S&DD)ల సమ్మిళితం ద్వారా బీఓసీ సేవలందిస్తుంది. బీఓసీ అనేది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అవుట్డోర్ మీడియా, ఇంటర్నెట్ వెబ్‌సైట్లు మొదలైన వాటి ద్వారా చెల్లింపు కార్యకలాపాలకు నోడల్ సంస్థ, క్లయింట్ మినిస్ట్రీస్/డిపార్ట్‌మెంట్స్, భారత ప్రభుత్వ సంస్థల తరపున వ్యాపార నిబంధనల కేటాయింపును అనుసరించి సేవలు అందిస్తుంది.

విధాన మార్గదర్శకాల అవసరం…

భారతీయ జనాభాలో ప్రధాన వాటా ప్రస్తుతం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చురుకుగా ఉందని, ఈ సంఖ్య ప్రతిరోజూ పెరుగుతోందనీ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రజలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వార్తలు, సమాచారం, వినోదాన్ని వినియోగిస్తారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారు నిశ్చితార్థానికి ఒక మార్గాన్ని అందిస్తాయి, ఇది ఇంటర్నెట్ వెబ్‌సైట్ల నుండి వేరుగా ఉంటుంది. చేతితో పట్టుకునే పరికరాల ద్వారా సోషల్ మీడియాకు పెరుగుతున్న సౌలభ్యం, ఇంటర్నెట్ సర్వవ్యాప్తి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పరిధిని మరింత మెరుగుపరిచాయని గ్రహించిన కేంద్రం తాజా సవరణలు చేసినట్లు తెలుస్తోంది. పెరుగుతున్న వ్యక్తుల సంఖ్య (ముఖ్యంగా యువత) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై సమయాన్ని వెచ్చిస్తుండటంతో, ఈ ప్లాట్‌ఫారమ్‌లు కమ్యూనికేషన్, ఔట్రీచ్‌కు ఒక మార్గాన్ని అందించవచ్చని భావిస్తోంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం నిర్వచనం…

ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఐకాన్లు

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వెబ్ ఆధారిత, మొబైల్ ఆధారిత ఇంటర్నెట్ అప్లికేషన్‌గా కేంద్రం నిర్వచించింది. ఈ రంగం వినియోగదారు కంటెంట్‌ను సృష్టించడం, యాక్సెస్ చేయడం, మార్పిడి చేయడాన్ని అనుమతిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్ టెక్స్ట్, ఆడియో-విజువల్, గ్రాఫిక్స్, యానిమేషన్ లేదా ఎప్పటికప్పుడు బీఓసీ సూచించిన ఏదైనా ఇతర రూపంలో ఇచ్చిన కంటెంట్‌ను ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో ప్రత్యేక వినియోగదారులనూ ప్రస్తావించింది బీఓసీ. ప్రత్యేకమైన వినియోగదారులు ఒక నిర్దిష్ట వ్యవధిలో ఇచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను సందర్శించే విభిన్న వ్యక్తుల సంఖ్యను సూచిస్తారని, ఒక నిర్దిష్ట వినియోగదారు ఇచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను, నిర్దిష్ట వ్యవధిలో అనేకసార్లు సందర్శిస్తే, ప్రత్యేకమైన వినియోగదారుల సంఖ్య ఒకటిగా లెక్కించడం జరుగుతుందనీ తెలిపింది.

అర్హత ప్రమాణం…

ఎంపానల్‌మెంట్ కోసం దరఖాస్తుచేసే సోషల్ మీడియాకు అర్హత ప్రమాణాలను ఇది వరకటి కంటే సులభతరం చేసింది కేంద్రం. అయితే, ఒకే డొమైన్ కింద నిరంతర ఆపరేషన్‌లో ఉండాలని మాత్రం స్పష్టంచేసింది. పేరు/యాక్సెస్ చిరునామా (డొమైన్ అడ్రస్)కు కనీసం ఆరు (6) నెలల సీనియారిటీని ఖరారుచేసింది. ఇది గతంలో ఏడాదిగా ఉండేది. నెలవారీ యూనిక్ యూజర్ల (UU) ఆధారంగా రేట్ కార్డులను బీఓసీ జారీచేయనుంది. దీని కోసం ఇది వరకు ఆరు నెలల డేటాను పరిగణనలోకి తీసుకోగా తాజా సవరణల్లో మూడు (3) నెలలకు తగ్గించింది. దీని కోసం గూగుల్ (యాడ్‌సెన్స్), ఫేస్‌బుక్ యాడ్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అనుసరిస్తున్న విధానాన్నే బీఓసీ కూడా నిర్దేశిత ఫార్మాట్‌లో అమలుచేయనుంది. పధ్నాలుగు పేజీల నోటిఫికేషన్‌లో పదమూడు పేజీలు మార్గదర్శకాలు, అగ్రిమెంట్ విధివిధానాలను వివరించింది బీఓసీ.

ఇక, అందరూ సింపుల్‌గా భావించే ఒక  వెబ్‌సైట్ నిర్వహణ అంత సులువేమీ కాదు. ఆవేశంలోనో లేక ఒకరివద్ద ఊడిగం చేయడం ఇష్టంలేక స్వశక్తితో మీడియాలో కొనసాగాలన్న ఆశయంతోనో చాలా మంది ఈమధ్య వెబ్ జర్నలిజం వైపు అడుగులు వేస్తున్నారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే విజయతీరాలకు వెళ్తున్నారు తప్ప అందరూ ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నా, ప్రధానంగా నాణ్యమైన కంటెంట్ సమకూర్చుకోలేకపోవడం, ఆన్‌లైన్ ప్రకటనలకు వేదికలైన సంస్థల్ని ఆకట్టుకోలేకపోవడం, గూగుల్ వంటి కంపెనీల నియమ, నిబంధనల మేరకు రోజుకు కనీసం ప్రచురించాల్సిన పోస్టులు (అప్‌డేట్స్) చేయకపోవడం, ఆ ప్రచురించినవి కూడా వేరే ఎక్కడి నుంచో కాపీ చేసి అరువు తెచ్చుకున్నవి కావడం వల్ల ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోతున్నారు.

ఒక వెబ్‌సైట్‌ నిర్వహణలో ప్రధానంగా నాలుగు విభాగాలు కీలకపాత్ర పోషించనున్నాయి. అయితే, అందులో మొదటిది మాత్రం కంటెంట్ రూపొందించే డిపార్ట్‌మెంటనే చెప్పాలి. టెక్నికల్, యాడ్, సోషల్ మీడియా ప్రమోషన్ విభాగాలు దేనికవే ప్రాధాన్యతను సంతరించుకున్నవైనప్పటికీ నాణ్యమైన కంటెంట్ తయారుచేసి ప్రచురణకు అందించడం ముఖ్యం. అందుకే ఈ విభాగం గురించి ప్రత్యేకించి చెప్పాల్సి వస్తోంది. బహుశా, దీనికి ఉన్న ప్రాధాన్యత నేపథ్యమేమో గానీ, ఆ విభాగంలో పనిచేసే వారికి చెల్లించాల్సిన జీతభత్యాలూ ప్రచురణకర్తకు భారంగానే పరిణమిస్తున్నాయి.

సొంత న్యూస్ వెబ్‌సైట్/పోర్టల్/యూట్యూబ్ ఛానల్ ఉండి కూడా చాలా మంది కేవలం నిర్వహణపరమైన తప్పిదాల వల్ల ఆన్‌లైన్ మీడియా ద్వారా ప్రకటనల ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇలాంటి వారి కోసం ‘న్యూస్‌టైమ్’ సహాయపడుతుంది. ప్రకటనల ఆదాయం వచ్చినంత వరకూ ఆయా వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్ రోజువారీ నిర్వహణ బాధ్యతలను స్వీకరిస్తోంది. దీని కోసం సవరించిన యూజర్ చార్జీలలో ఏదో ఒక సర్వీసును వినియోగించుకుంటే సరిపోతుంది. ఒకనెల పేమెంట్ చేయడం ద్వారా రెండో నెల పూర్తి ఉచితంగా సర్వీసును ఉపయోగించుకోవచ్చు. ఈ తగ్గింపు చార్జీల సదుపాయం కేవలం వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్ నిర్వహణకు సంబంధించి మాత్రమేనని విజ్ఞులైన ప్రచురణకర్తలు గమనించ మనవి.

దాదాపు న్యూస్‌ పేపర్ తరహాలో పూర్తిస్థాయి వాణిజ్య విలువలతో కూడిన వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్‌ నడపాలనుకునే ప్రచురణకర్తలను, వెబ్ ఛానళ్ల నిర్వాహకులకు ఇది శుభవార్తనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం న్యూస్ వెబ్‌సైట్‌లకు ఇస్తున్న ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రంగంలో నిలదొక్కుకునే లక్ష్యంతో ఉన్న ఔత్సాహికులు ఈ రాయితీ సేవలను సద్వినియోగం చేసుకుని తమ వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్‌‌ను స్వయం ఉపాధి మార్గంగా మార్చుకోవచ్చు.

స్వయంకృషితో స్వయం సమృద్ధి సాధించాలనుకునే ప్రచురణకర్తలకు అతి తక్కువ చార్జీకే నిర్వహణ (మెయింటెనెన్స్) సర్వీసును సైతం అందిస్తోంది ‘న్యూస్‌టైమ్’. వెబ్‌సైట్/పోర్టల్/ఈ-పేపర్/యూట్యూబ్ ఛానల్‌‌ సెర్చింజిన్ ర్యాంకింగ్స్‌కు, ఆన్‌లైన్ యాడ్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుగా దాన్ని రెగ్యులర్‌గా నాణ్యత కలిగిన కంటెంట్‌తో అప్‌డేట్ చేయలేకపోతున్నవారు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది. వేరే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా గ్రూపుల నుంచి కాపీ, పేస్టుల గోల లేకుండా మీకంటూ ప్రత్యేక న్యూస్ కంటెంట్ కోరుకునే వారికీ ఇది ఎంతగానో మేలుచేస్తుంది. దమ్మిడీ ఆదాయం రాని, పైసా ప్రయోజనం లేని వాట్సాప్, ఇతరత్రా సోషల్ మీడియా గ్రూప్‌ల నిర్వహణ, మెసేజ్‌ల పరంపరకు స్వస్తిపలికి ఎవరికి వారు ఓ సమాచార వ్యవస్థగా మారేందుకు ఇప్పటికే మార్గాన్ని కల్పించిన ‘న్యూస్‌టైమ్’ ఇప్పుడు ఆదాయా మార్గాలనూ మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తోంది. పూర్తి వివరాలకు ‘న్యూస్‌టైమ్’ వాట్సాప్ నంబర్ (6300795484)కు మెసేజ్ చేయవచ్చు. లేదా editor@newstime.in, newstimedaily@gmail.com మెయిల్ చేయవచ్చు.

  • ఈ సమాచారం మరింత మందికి ఉపయోగపడుతుందనిపిస్తే మీకు తెలిసిన వారికి దయచేసి ఫార్వర్డ్ లేదా షేర్ చేయగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here