మీడియాతో మాట్లాడుతున్న ఏపీ ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ

ఏపీ ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ…

అనంతపురం, జనవరి 6 (న్యూస్‌టైమ్): ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జైలు భయం పట్టుకుందని ఏపీ ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి శంకర్‌ నారాయణ అన్నారు. మతం పేరుతో రాజకీయం చేస్తూ బీజేపీ కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడన్నారు. మంత్రి శంకర్‌ నారాయణ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తన పాలనలో తిరుమలలోని వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేయలేదా? అని ప్రశ్నించారు. 40 ఆలయాలను కూల్చేయలేదా అని నిలదీశారు.

చంద్రబాబు తన పాలనలో చేసిన తప్పులు అన్నీఇన్నీ కావని, దోపిడీ ఎజెండాగా పరిపాలన చేశాడని మండిపడ్డారు. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయమన్నారు. మతం పేరుతో ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలెవరూ చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రామతీర్థం ఘటన వెనుక ఉన్నవారి పేర్లు తొందరలోనే బయటకు వస్తాయని, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.