పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు పరామర్శ

73
పయ్యావుల కేశవ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యున్ని అడిగి తెలుసుకుంటున్న చంద్రబాబు

హైదరాబాద్, నవంబర్ 11 (న్యూస్‌టైమ్): అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌ను, వారి కుటుంబసభ్యులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించాను.

పయ్యావుల కేశవ్, ఆయన కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో పరామర్శిస్తున్న చంద్రబాబు

కేశవ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేశవ్ త్వరగా కోలుకుంటారన్న ఆశాభావాన్ని చంద్రబాబు వ్యక్తంచేశారు. ఇటీవల అమరావతిలో పీఏసీ సమావేశం సందర్భంగా కేశవ్ అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌లో చేర్పించారు. ఇక్కడ నగరంలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో పయ్యావుల చికిత్స పొందుతున్నారు. దీంతో పయ్యావులను చంద్రబాబు స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.