ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల రంగం పరిస్థితులపై అవగాహన కల్పించడం పేరిట ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటి ప్రాజెక్టుల నుంచి ఇప్పటి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వరకూ అన్నిటిపైనా ఆయన విశ్లేషణ చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల రంగం ఎలా ఉందన్నదానిపై సమగ్రంగా కాకపోయినా కొంత వరకు ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఇందులో వాస్తవాలు ఎన్నో ప్రభుత్వమే చెప్పాలి. చంద్రబాబు ప్రెజెంటేషన్‌ను ఓ వీడియో రూపంలో తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేసింది. అందులో ఏముందో మీరే చూడండి…