చల్లటి మజ్జిగతో దాహానికి చెక్‌!

543

మనిషి శరీరంలో నుంచి ఒక రోజులో 700 నుండి 1000 గ్రాముల నీరు చెమట రూపంలో బయటకు పోతుంటుంది. అదే సమయంలో శరీరంలోప 300 నుండి 400 గ్రాముల నీరు తయారవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ బయటకుపోయే నీరు ఎక్కువ. లోపల ఊరే నీరు తక్కువ. ఇలా నీటి శాతం తగ్గినప్పుడు దాహం వేస్తుంది. రక్తంలో ఉప్పు, నీరు కలిసి ఉంటాయి. మామూలుగా ఇవి రెండూ రక్తంలో స్థిరంగానే ఉంటాయి. ఏ కారణం చేతనయినా రక్తంలో నీటి శాతం తగ్గినట్లైతే దాహం వేస్తుంది. కొందరికైతే వేసవి కాలం, వర్షా కాలం అనే తేడాలు లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు దాహం వేస్తుంటుంది.

వారికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. ఎటువంటి వారికైనా దాహం వేస్తుంటే గ్లాసు చల్లని నీటిలో నాలుగు స్పూన్ల చక్కెర, ఒక నిమ్మకాయను పిండి తీసిన రసం కలిపి తాగితే వెంటనే దాహం తగ్గుతుంది. అదేవిధంగా దానిమ్మ పండ్ల రసానికి సమంగా పంచదార కలిపి తేనె పాకంగా ఉడికించి రెండు టీ స్పూన్ల చొప్పున రోజుకి మూడుసార్లు తాగితే దాహం తగ్గుతుంది. పెరుగు అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు కలిపి తీసుకుంటే త్వరగా దాహం తగ్గి వడదెబ్బ నుంచి విముక్తి కలుగుతుంది. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ప్రాణాంతక వ్యాధి ఎయిడ్స్‌ను నశింపజేసే శక్తి తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

అలాగే తులసీ ఆకులు ఆస్తమా, కేన్సర్‌లకు అడ్డుకుంటుందని చెపుతారు. తులసీ ఆకుల రసంలో మిరియాల పొడి చేర్చి తాగితే ఆస్తమా, కేన్సర్లు దరి చేరవు. రోజూ 20 తులసీ ఆకులను నమిలితే కేన్సర్‌ ఫస్ట్‌ స్టేజ్‌ను నయం చేయవచ్చనీ అలాగే రోజూ ఉదయం, సాయంత్రం ఒక కప్పు పెరుగుతో 20 తులసీ ఆకుల్ని తీసుకుంటే కేన్సర్‌ నయం అవుతుందని విశ్వాసం ఉంది. రోజూ తులసీ ఆకుల్ని నాలుగేసి నమిలితే కేన్సర్‌ దరిచేరదని అంటారు. ఇంకా తులసీ ఆకుల్ని రోజూ నమలడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇకపోతే ఎయిడ్స్‌కు తులసీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.

శరీరంలోని వ్యాధినిరోధక శక్తి నశింపజేసే బ్యాక్టీరియానే ఎయిడ్స్‌కు కారణం. వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం తులసీ ఆకుల్లో ఉంది. అలాగే బ్యాక్టీరియాలను నశింపజేసే శక్తి కూడా తులసీ ఆకులకు ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మధుమేహం వ్యాధి సంక్రమిస్తే జీవనశైలిలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందుకనే వైద్యులు పత్యం పాటించాలని చెపుతుంటారు. ఆయుర్వేదంలో కూడా షుగర్‌ వ్యాధిని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ప్రతి రోజూ కాకరకాయ రసం త్రాగితే మధుమేహం పారిపోతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. కాకర రసం చేదుగానే ఉంటుంది. కాకర కాయను తినడానికే కాసింత చక్కెర వేసి మరీ తింటుంటారు.

అందునా కాకర రసం త్రాగడం అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. మధుమేహానికి మందుగా కాకర రసం సూచించడం వరకు బాగానే ఉంటుంది. అయితే, కాకర రసం పడని వారికి వాంతులైతే మరికొందరికి విరేచనాలు అవుతాయి. అందువల్ల కాకరకాయ రసం కొద్దికొద్దిగా తాగాల్సి ఉంటుంది. ఏకబిగిన గ్లాసెడు కాకర రసం త్రాగితే అది జీర్ణం కాక బయటికి వచ్చేస్తుంది. కాబట్టి తొలుత ఒకటి-రెండు చెంచాల రసంతోనే మొదలు పెట్టాలి. ఆ తర్వాత క్రమంగా మోతాదును పెంచుకుంటూ ఇతర మందులు లేకుండా కాకర రసాన్ని త్రాగడమే మేలని మధుమేహంతో బాధపడేవారు అనుకుంటారు. దీంతో మధుమేహం బై చెప్పేసి పారిపోతుంది అంటున్నారు వైద్యులు.