ఏయూ ఆర్ట్స్‌ హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌గా ప్రేమానందం

0
18 వీక్షకులు
ఏయూ వీసీ ప్రసాదరెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ కృష్ణమోహన్ నుంచి నియామక ఉత్తర్వులు స్వీకరిస్తున్న డాక్టర్‌ పేటేటి ప్రేమానందం

విశాఖపట్నం, నవంబర్ 30 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల చీఫ్‌ వార్డెన్‌గా రాజనీతి, ప్రభుత్వ పాలనా శాస్త్రం విభాగాధిపతి డాక్టర్‌ పేటేటి ప్రేమానందం నియమితులయ్యారు. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ఉత్తర్వులను డాక్టర్‌ ప్రేమానందంకు అందజేశారు.

కార్యక్రమంలో ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్‌ ప్రేమానందం చీఫ్‌ వార్డెన్‌గా పదవీ బాధ్యతలను స్వీకరించారు.