కంటైన్‌మెంట్ జోన్ల వెలుప‌ల మ‌రిన్ని కార్య‌క‌లాపాలు

న్యూఢిల్లీ, జులై 31 (న్యూస్‌టైమ్): కంటైన్‌మెంట్ జోన్ల‌కు వెలుప‌ల మ‌రిన్ని కార్య‌కాలాపాలు ప్రారంభించేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈరోజు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అన్‌లాక్ 3 కింద‌, ఈ మార్గ‌ద‌ర్శ‌కాలు ఆగ‌స్టు 1, 2020 నుంచి ఆమ‌లులోకి వ‌స్తాయి. ద‌శ‌ల‌వారీ కార్య‌క‌లాపాల పునఃప్రారంభాన్ని తిరిగి పొడిగించారు. ఈరోజు కొత్త‌గా విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌నుంచి అందిన ప్ర‌తిస్పంద‌న ఆధారంగ‌గా విడుద‌ల చేశారు. ఇందుకు సంబంధించి సంబంధిత కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాల‌తో విస్తృతంగా చ‌ర్చించి వీటిని జారీచేశారు. రాత్రి పూట వ్య‌క్తులు తిర‌గ‌డంపై (నైట్ క‌ర్ఫ్యూ)గ‌ల ఆంక్ష‌లు ఎత్తివేశారు. యోగా ఇన్‌స్టిట్యూట్‌లు, జిమ్నాజియంలు ఆగస్టు 5 ,2020 నుంచి తిరిగి తీసేందుకు అనుమ‌తిస్తారు. సామ‌మాజిక దూరం పాటించ‌డం, కోవిడ్-19 వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి సంబంధించి, స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్ (ఎస్‌.ఒ.పి)ను, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీచేస్తుంది.

సామాజిక దూరం, ఇత‌ర ఆరోగ్య సంబంధ ప్రొటోకాల్స్ పాటిస్తూ స్వాతంత్ర ‌దినోత్స‌వ వేడుక‌లు జ‌రుపుకునేందుకు అనుమ‌తి. ఉదాహ‌ర‌ణ‌కు మాస్కులు ధ‌రించ‌డం వంటివి. ఇందుకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ 21-07-2020న జారీచేసిన ఆదేశాల‌ను పాటించాలి. రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌తో విస్తృతంగా చ‌ర్చించిన మీద‌ట పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌లు, కోచింగ్ కేంద్రాలను 2020 ఆగ‌స్టు 31 వ‌ర‌కు మూసివేయాల‌ని నిర్ణ‌యించారు. అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణికుల‌ను ప‌రిమిత సంఖ్య‌లో, వందేభార‌త్ మిష‌న్ కింద అనుమ‌తిస్తారు. మ‌రింత మందిని అనుమ‌తించే విష‌యం ప‌రిస్థితిని మ‌దింపు చేసి నిర్ణ‌యం తీసుకుంటారు. కంటైన్‌మెంట్ జోన్‌ల‌కు వెలుప‌నున్న ప్రాంతాల‌లో కిందివి మిన‌హా మిగిలిన‌వ‌న్నీఅనుమ‌తిస్తారు.

మెట్రోరైలు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ పార్కులు, థియేట‌ర్లు, బార్లు, ఆడిటోరియంలు, స‌మావేశ మందిరాలు, ఇలాంటి ఇత‌ర ప్రాంతాలు, సామాజిక‌, రాజ‌కీయ‌, క్రీడా, వినోద‌, అక‌డ‌మిక్‌, సాంస్కృతిక‌, మ‌త‌ప‌ర‌మైన కార్య‌క‌లాపాలు, పెద్ద సంఖ్య‌లో జ‌నం జ‌మ‌య్యే స‌మావేశాలు, వీటిని ఎప్పుడు తెరిచేదీ ప‌రిస్థితిని అంచ‌నా వేసిన అనంత‌రం వేరుగా ప్ర‌క‌టిస్తారు. కంటైన్‌మెంట్ జోన్ల‌లో 2020 ఆగ‌స్టు 31 వ‌ర‌కూ లాక్‌డౌన్ క‌ఠినంగా అమ‌లు జ‌రుగుతుంది. కంటైన్‌మెంట్ జోన్ల‌ను రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంత ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త‌గా గుర్తించి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ జారీచేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసు‌కుంటూ, కోవిడ్ -19 వ్యాప్తి జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

కంటైన్‌మెంట్ జోన్ల‌లో, ఆ ప్రాంత ప‌రిధిలో ఆంక్ష‌ల అమ‌లు క‌ఠినంగా ఉండాలి. కేవ‌లం అత్య‌వ‌స‌ర కార్య‌క‌లాపాలు మాత్ర‌మే అనుమ‌తించాలి. ఈ కంటైన్‌మెంట్‌ జోన్లను సంబంధిత జిల్లా క‌లెక్ట‌ర్‌, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత‌ప్రాంతాలు ప్ర‌క‌టిస్తాయి. ఈ స‌మాచారాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు తెలియ‌జేస్తాయి. కంటైన్‌మెంట్ జోన్ల‌లోని కార్య‌క‌లాపాల‌ను రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల అథారిటీలు క‌ఠినంగా అమ‌లు చేయాలి. ఈ జోన్ల‌లో కంటైన్‌మెంట్ చ‌ర్య‌లను కూడా ప‌టిష్టంగా అమ‌లు చేయాలి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ కంటైన్‌మెంట్ జోన్లు ప్ర‌క‌టించ‌డాన్ని, కంటైన్‌మెంట్‌ నిబంధ‌న‌ల అమ‌లును ప‌ర్య‌వేక్షిస్తుంది. కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుప‌ల కార్య‌క‌లాపాల‌పై రాష్ట్రాలు నిర్ణ‌యం తీసుకోనున్నాయి. కంటైన్‌మెంట్ జోన్ల వెలుప‌ల ప‌రిస్థితుల‌పై తమ అంచనాల‌కు అనుగుణంగా ఏవైనా కార్య‌క‌లాపాల‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిషేధించ‌వ‌చ్చు. లేదా అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆంక్ష‌లు విధించ‌వ‌చ్చు.

అయితే అంత‌ర్ రాష్ట్ర‌, రాష్ట్రంలోప‌ల, వ్య‌క్తుల ప్ర‌యాణానికి లేదా స‌ర‌కుల త‌ర‌లింపున‌కు ఎలాంటి ఆంక్ష‌లు ఉండ‌వు. వేరుగా అనుమ‌తి, ఆమోదం, ఈ- ప‌ర్మిట్ ఏదీ అవ‌స‌రం లేదు. సామాజిక దూరం పాటించేందుకు వీలుగా, కోవిడ్ -19 నిర్వ‌హ‌ణ‌కు జాతీయ ఆదేశాలు దేశ‌వ్యాప్తంగా పాటించ‌డం కొన‌సాగుతుంది. క‌స్ట‌మ‌ర్ల మ‌ధ్య త‌గినంత భౌతిక దూరం పాటించేలా దుకాణాలు చూడాలి. జాతీయ ఆదేశాల అమ‌లును కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ ప‌ర్య‌వేక్షిస్తుంటుంది. కోవిడ్ -19 సోకే అవ‌కాశం ఉన్న 65 సంవ‌త్స‌రాల‌పై బ‌డిన వ‌యోధికులు, ఇత‌ర అనారోగ్యాలు ఉన్న‌వారు, గర్భిణులు, ప‌దేళ్ళ‌లోపు పిల్ల‌లు, వీరంద‌రూ అత్య‌వ‌స‌రాలు, ఆరోగ్య‌ప‌ర‌మైన అవ‌స‌రాల‌కు త‌ప్ప,ఇళ్ల‌లోనే ఉండాల్సిందిగా సూచించ‌డం జ‌రిగింది. ఆరోగ్య‌సేతు మొబైల్ అప్లికేష‌న్ వాడ‌కాన్ని ప్రోత్సహించ‌డం కొన‌సాగించాలి.

49 COMMENTS

 1. Привет всем! Класный у вас сайт!
  Нашёл новости в сети:
  Стильная парочка поросят покорила пользователей Instagram http://itcyber.ru/11601-stilnaya-parochka-porosyat-pokorila-polzovateley-instagram.html
  http://itcyber.ru/9606-chernaya-pyatnica-sostoitsya-28-noyabrya-hod-za-apple.html
  гаджеты новости http://itcyber.ru/mobile/
  новости каналы видео http://itcyber.ru/video/
  Ещё много всего нашел тут: новости криптовалют декабрь http://itcyber.ru/

 2. Взять ссылку на гидру и спокойно покупать возможно на разделах этого проекта. В интернете очень часто возможно наткнуться на жуликов и утерять собственные личные денежные средства. Поэтому для Вашей защиты мы создали этот интернет-портал на котором Вы постоянно можете получить вход к магазину торговой площадки hydraruzxpnew4af.onion. Для выполнения покупок на трейдерской площадке гидра наш сайт изо дня в день посещает масса клиентов, для получения актуальной работоспособной ссылки, нужно надавить на кнопочку раскрыть и надежно покупать, а если Вы в первый раз вошли на сайт до покупки изделия следует зарегистрироваться и дополнить баланс. Ваша собственная безопасность наша важная задача, которую мы с гордостью осуществляем.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here