కరోనా కరువులో దొంగనోట్ల జోరు

0
9 వీక్షకులు
చలామణిలో ఉన్న నకిలీ కరెన్సీ (రూ. 500) నోటు వెనుక భాగం

తిరుపతి, నెల్లూరు, మే 2 (న్యూస్‌టైమ్): కరోనా కరువుతో ప్రజలు కలవరపడి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న దొంగనోట్ల ముఠాకు స్వర్గధామంగా మారింది నాయుడుపేట మండల కేంద్రంలో 20 రోజులుగా దొంగనోట్ల ముఠా పరిపూర్ణంగా సంచారం చేయడంతో వారికి అడ్డు ఆపూ లేకుండా దొంగనోట్లను జోరుగా చలామణి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ విధించిన నాటినుండి నేటి వరకు మండల ప్రజలు అధికారులు ఆదేశాల మేరకు నిబంధనలు ఉల్లంఘించకుండా పోలీసులు కేటాయించిన సమయానికే దుకాణాల వద్ద నిత్యావసర సరుకులను కొనుగోలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ మండలలో కరోనా కేసులు నమోదు కావడంతో, ఆ జిల్లా అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు.

బిఎన్ కండ్రిగ మండలానికి పక్క నియోజకవర్గం నియోజకవర్గమైన శ్రీకాళహస్తి పట్టణంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో శ్రీకాళహస్తి ప్రాంతాన్ని రెడ్‌జోన్ ప్రకటించి బయట ప్రాంతాల నుంచి ఎవరికి ప్రవేశం లేకుండా సరిహద్దుల దారులను పోలీస్ బలగాలతో దిగ్బంధం చేశారు. దీంతో ఆయా ప్రాంత ప్రజల వారి అవసరాలు కోసం బయట ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో బిఎన్ కండ్రిగ మండలం ప్రజల అవసరాలు కోసం మండల కేంద్రంలో దుకాణాలకు వ్యాపారాలు చేసుకొనుటకు వెసులుబాటు కల్పించడంతో, ఉన్న వ్యాపారస్తులు కాకుండ కొత్తగా కొంత మంది బ్రతుకు తెరువు కోసం వ్యాపారాలు చేపట్టారు కూరగాయలు వ్యాపార సంఖ్య క్రమంగా పెరిగింది.

మండలంలో వ్యాపారం జరిగిన రోజున స్థానిక ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా మండలైన దొరవారి సత్రం, నాయుడుపేట, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల పరిధిలోని ప్రజల అవసరాలు కోసం ఆయా గ్రామాల వ్యాపారస్తులు వారి ప్రజల అవసరాలు తీర్చే ఆయా గ్రామాల వ్యాపారస్తులు వారి ప్రజల అవసరాలు తీర్చేందుకు బిఎన్ కండ్రిగ మండలంలోని దుకాణాలకు వ్యాపారం కొనసాగించుటకు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం అధిక సంఖ్యలో హాజరు కావడంతో దుకాణాల వద్ద రద్దీగా ఉండడంతో ఇదే అదునుగా భావించిన దొంగనోట్ల ముఠా ఏదుకాణం వద్ద రద్దీగా ఉంటుందో గుర్తించి గుంపులో గోవిందా అంటూ గుట్టుచప్పుడు కాకుండా దొంగనోట్లను జోరుగా చలామణి చేపట్టారు.

ఎక్కువగా, కూరగాయలు, పాల, పండ్ల దుకాణాలలో 20 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు దొంగనోట్లను చలామణి చేపట్టారు కొన్ని దుకాణాలలో ఈ నోట్లు వచ్చినప్పటికీ బయటపడితే పరువుపోతుంది అన్న బాధతో కొంతమంది వ్యాపారస్తులు దొంగనోట్లను బూడిద చేసిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి. ఓ పండ్లు వ్యాపారస్తుడికి రెండు సార్లు అతని వద్దనే ఎక్కువ శాతం కొనుగోలు చేయడం జరిగినది దీంతో వ్యాపారస్తులు దొంగ నోట్ల ముఠా చిరు వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారని స్థానిక ఎస్ఐ ధర్మారెడ్డికు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు తీసుకున్న ఎస్సై తన సిబ్బందితో గోప్యంగా దర్యాప్తు చేపడుతున్నారు. దీంతో వ్యాపారస్తుల మండల ప్రజలు దొంగ నోట్ల ముఠా సంచారం చేస్తుండడం వల్ల ఆందోళన చెందుతున్నారు. దీనిపై పోలీసు యంత్రాంగం సమగ్ర దర్యాప్తు చేపట్టి దొంగనోట్ల ముఠా నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్నదని మండల ప్రజలు వ్యాపారస్తులు వాపోతున్నారు.

(కె. శ్రీరామ్‌రెడ్డి; రాయలసీమ ప్రత్యేక ప్రతినిధి; 90003 70113)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here