అమరావతి, అక్టోబర్ 7 (న్యూస్టైమ్): వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సంబంధిత అధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. అర్హులెవరూ ఈ పథకాలు అందలేదన్న ఫిర్యాదు చేయకూడదని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు.