అమరావతి, జనవరి 7 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సివిల్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ నూతన డైరీ-2021ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ సివిల్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ పి. ధర్మచంద్రారెడ్డి, జనరల్‌ సెక్రటరీ ఎం వి నాయుడు, కార్యవర్గ సభ్యులు రాజ్యలక్ష్మి, చంద్రశేఖర్, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here