న్యూఢిల్లీ, జనవరి 9 (న్యూస్‌టైమ్): కొలంబియా ఏషియా హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 100% వాటాను మణిపాల్ హెల్త్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (కొనుగోలుదారు/ఎంహెచ్ఇపిఎల్) – మణిపాల్ విద్య, వైద్య గ్రూపులో భాగం. ఈ సంస్థ మల్టీ స్పెషాలిటీ చికిత్సలను అందించే ఆసుపత్రుల నెట్ వర్్కను నిర్వహిస్తోంది. తమ మల్టీ స్పెషాలిటీ, టెర్షియరీ కేర్ (తృతీయ చికిత్స) రూపంలో అందించి, తదనంతరం దానిని ఇంటివద్దే చికిత్సగా విస్తరించేలా అందుబాటు ధరలతో, అత్యున్నత నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణ చట్రాన్ని రూపొందించి అభివృద్ధి చేయడంపై ఆ సంస్థ దృష్టి పెట్టింది. మలేషియాలో మినహా భారత్ ఆవల ఎంహెచ్ఇపిఎల్ ఎక్కడా వాణిజ్య కార్యకలాపాలను సాగించడం లేదు.
కాగా, కొలంబియా ఏషియా హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్ష్యం/సీఎహెచ్పీఎల్) ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే కంపెనీ. అత్యున్నత నాణ్యత కలిగి, సరమైన ధరలలో అందుబాటులో ఆరోగ్య సేవలను అందిస్తున్న ఈ సంస్థ 2005లో భారత్‌లో తన కార్యకలాపాలను సాగిస్తోంది. సీఎహెచ్పీఎల్ పదకొండు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను, ఒక టెలి రేడియాలజీ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అంతేకాకుండా, భారత్‌కు ఆవల సీఎహెచ్పీఎల్ ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించడం లేదు. అయితే, అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ గ్రూప్ అయిన ఇంటర్నేషనల్ కొలంబియా యుఎస్ఎల్ఎల్సీలో భాగంగా ఉంది. ఈ సంస్థ భారత్, చైనా, ఆఫ్రికాలలో అత్యాధునిక ఆసుపత్రుల చెయిన్ నిర్వహిస్తోంది. కమిషన్ జారీ చేసిన వివరణాత్మక ఉత్తర్వులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.