ప్రపంచ క్రీడలతో పోటీ…

0
6 వీక్షకులు
ఆసియా క్రీడల మస్కట్

న్యూఢిల్లీ, మే 1 (న్యూస్‌టైమ్): ఆసియా క్రీడలు… వీటికి ఏషియాడ్ అని కూడా అంటారు. ప్రతి నాలుగేండ్లకొకసారి జరిగే ఈ క్రీడలు వివిధ క్రీడా పోటీల వేదిక. ఆసియా ఖండానికి చెందిన దేశాల క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొంటారు. దీని నిర్వాహక, నియంత్రణా సంస్థ ఆసియా ఒలంపిక్ మండలి, ఈ మండలిని నియంత్రించే సంస్థ అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ.

1951లో ఢిల్లీలో ప్రారంభమైన ఆసియా క్రీడలలో ప్రతి క్రీడాంశంలోనూ తొలి మూడు స్థానాలకు వరుసగా బంగారు పతకం, వెండి పతకం, కాంస్య పతకం పతకాలు ప్రదానం చేస్తారు. పోటీదారులు, తమ పౌరసత్వం గల దేశ జాతీయ ఒలంపిక్ కమిటీ ద్వారా తమ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు. పతకాల ప్రదానోత్సవాలలో ఆయా దేశాల జాతీయగీతాలు ఆలాపించి, పతాకాలు ఎగురవేస్తారు. 15వ ఆసియా క్రీడలు కతర్‌లోని దోహాలో జరిగాయి, ఇవి డిసెంబరు 1 నుండి డిసెంబరు 15, 2006, వరకూ జరిగాయి. 16వ ఆసియా క్రీడలు చైనాలోని గువాంగ్జౌలో నవంబరు 12 నుండి నవంబరు 27, 2010 వరకూ జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ఆసియాలోని అనేక దేశాలు, బ్రిటిష్ వారి దాస్యశృంఖనాల నుండి విముక్తి పొందాయి, స్వతంత్రాన్ని ప్రకటించుకొన్నాయి.

ఈ దేశాలు తమ దేశాల మధ్య సయోద్య, సత్సంబంధాల కోసం, క్రీడలు ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. ఆగస్టు 1948లో లండన్‌లో జరిగిన ఒలంపిక్ క్రీడలు జరిగే సమయాన, భారత ఒలంపిక్స్ కౌన్సిల్ ప్రతినిథి గురుదత్ సోంధి, ఆసియా క్రీడల గురించి తన అభిప్రాయాలను ప్రకటించాడు. ఆసియా దేశాలు, ఈ విషయాన్ని అంగీకరించి, ఆసియా అథ్లెటిక్ ఫెడరేషన్ తన అంగీకారాన్ని తెలిపింది. 1949లో ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ సమావేశమై ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసి, 1951లో ఢిల్లీలో మొదటి ఆసియా క్రీడలు జరపాలని నిశ్చయించాయి.

ఈ క్రీడలు ప్రతి నాలుగేళ్లకొకసారి జరపాలని కూడా నిశ్చయించాయి. 1962లో చైనా, ఇస్రాయేలును ఈ ఫెడరేషన్‌లో సభ్యత్వాన్ని నిరాకరించింది. ఇండోనేషియా, చైనా, ఇస్రాయేలుల సభ్యత్వాన్ని నిరాకరించింది. 1970లో దక్షిణ కొరియా, ఉత్తరకొరియా నుండి అపాయాల సాకుతో ఈ క్రీడలను అతిథ్యమివ్వడానికి నిరాకరించింది. 1973లో అమెరికా సన్నిహిత దేశాలు చైనా సభ్యత్వాన్ని నిరాకరించగా, అరబ్బు దేశాలు ఇస్రాయేలు సభ్యత్వాన్ని నిరాకరించాయి. 1977లో పాకిస్తాన్ ఈ క్రీడలకు అతిథ్యమివ్వడానికి నిరాకరించింది, కారణం భారతదేశం, బంగ్లాదేశ్‌లతో యుద్ధాలుండడం. ఈ నిరాకరణల సందర్భాలలో ఈ క్రీడలను బాంకాక్ థాయిలాండ్‌లో నిర్వహించారు.

1994 ఆసియా క్రీడలలో ఇతర దేశాల తిరస్కారాలున్ననూ, ఓ.సీ.ఏ., వెనుకటి సోవియట్ యూనియన్‌కు చెందిన రిపబ్లిక్కులైన కజకస్తాన్, కిర్గిజిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమేనిస్తాన్, తజికిస్తాన్‌లను సభ్యులుగా అంగీకరించింది. 2006లో ఆస్ట్రేలియా అభ్యర్థనను, ఓ.సీ.ఏ. ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ అల్-ఫహద్ అల్-సబా తిరస్కరించాడు. దీని కారణం, ఆస్ట్రేలియాకు సభ్యత్వమిస్తే, ఓషియానియాకు చెందిన అనేక చిన్న దేశాలు నష్టపోతాయని. క్రికెట్‌ను 2010 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టాయి. 1951లో మొదటి ఆసియా క్రీడలు భారత దేశంలోని ఢిల్లీలో జరిగాయి. ఆ తరువాత మళ్ళీ 1982లో 9వ ఆసియా క్రీడలకు వేదిక కూడా ఢిల్లీ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here