ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పనుల పూర్తి

0
10 వీక్షకులు
  • అభివృద్ధి పనులను ఆకస్మికంగా పరిశీలించిన కమిషనర్

తిరుపతి, మే 27 (న్యూస్‌టైమ్): నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు చోట్ల జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం కమిషనర్ ఆకస్మికంగా పరిశీలించారు.

నగరపాలక సంస్థ విద్యుత్ అవసరాల పరిష్కారం కొరకు తూకివాకం వద్ద ఏర్పాటు చేస్తున్న 6 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను పరిశీలించారు. ఆలస్యంగా పనులు చేస్తుండడంతో సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు కొంత ఆలస్యం అయ్యాయని, చిన్న చిన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ముందుగా సోలార్ ప్లాంట్ పనులు జరిగే ప్రాంతానికి చుట్టూ పెన్సింగ్ వేయించాలని సూచించారు.

అక్కడ నుండి మంగళం వద్ద చేరుకుని వాటర్ ఫిల్టర్ హౌస్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న 30 ఎం.ఎల్.డి. వాటర్ పంపింగ్ నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏ ఏ ట్యాంక్ ద్వారా ఎక్కడెక్కడి వాటర్ పంపింగ్ చేస్తున్నారనే విధానాన్ని మ్యాప్ ద్వారా పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. జరుగుతున్న పనులు మరింత వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కరకంబాడీ మార్గంలోని వినాయక సాగర్ వద్ద చేయనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వినాయక సాగర్ అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికల మ్యాప్ ఇప్పటికే సిద్ధం చేయడం జరిగిందని, ఆ మేరకు వేగంగా పనులు చేయాలన్నారు.

పనులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టకు సమాంతరంగా ఒక రోడ్ వేసేందుకు సర్వే చెసి రోడ్ వేయాలని సూచించారు. కమిషనర్ గిరీషా మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కొంత బ్రేక్ పడిందన్నారు. ప్రభుత్వ ఇచ్చిన సడలింపుల మేరకు తిరిగి అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. తూకివాకం వద్ద ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ వలన 6 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసుకుని నగరపాలక సంస్థకు వినియోగించు కోవచ్చునన్నారు. అలాగే నగరంలో ప్రజలకు తాగునీటికీ ఇబ్బంది లేకుండా మంగళం ఫిల్టర్ హౌస్ వద్ద నీటినిల్వ, పంపింగ్‌కు అదనంగా నిర్మాణాలు చేస్తున్నామన్నారు. వాటిని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. వినాయక సాగర్ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయన్నారు.

సుందరంగా తీర్చిదిద్దనున్నామన్నారు. పనులకు ఆటంకం లేకుండా ప్రజలు వెళ్లేందుకు పక్కనే ఒక రోడ్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అభివృద్ధి పనులు అన్ని ప్రాధాన్యత క్రమంలో త్వరగా పూర్తిచేస్తామన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించడం జరిగిందన్నారు. కాగా గరుడ వారధి పనుల పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ హరిత, ఎస్.ఈ. ఉదయకుమార్, ఎం.ఈ.1 చంద్రశేఖర్, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారులు షణ్ముగం, శ్రీనివాసులు, సర్వేయర్లు డేవానంద్, ప్రసాద్, ఏఈకామ్ బాలాజీ, అప్కాన్స్ స్వామి, తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here