విద్యారంగంపై స‌ద‌స్సు

0
9 వీక్షకులు

విజయనగరం, మే 27 (న్యూస్‌టైమ్): మ‌న పాల‌న‌-మీ సూచ‌న కార్య‌క్ర‌మంలో భాగంగా మూడో రోజు బుధ‌వారం విద్యారంగంపై స‌దస్సు జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా స్థానిక మ‌ర్రిచెన్నారెడ్డి భ‌వ‌నం వ‌ద్ద విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి ప్రారంభించారు. అనంత‌రం జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్, ఎంఎల్ఏలు బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, అల‌జంగి జోగారావుతో క‌లిసి స్టాల్స్‌ను తిల‌కించారు.

పాఠ‌శాల విద్య‌, ఉన్న‌త విద్య‌, సాంకేతిక విద్య‌కు సంబంధించిన అంశాల‌పై స్టాల్స్‌ను ఏర్పాటు చేసిన‌ట్టు డిఇఓ జి.నాగ‌మ‌ణి ఉప ముఖ్య‌మంత్రికి తెలిపారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి, మ‌న బ‌డి నాడు-నేడు, ఆంగ్ల‌మాధ్య‌మ బోధ‌న‌, జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన‌, అట‌ల్ ఇన్నోవేష‌న్ మిష‌న్‌, ఆనంద ల‌హ‌రి, ఆర్ట్స్‌, క్రాప్ట్స్ ప్ర‌ద‌ర్శ‌న‌లను ఏర్పాటు చేసిన‌ట్లు డీఈఓ వివ‌రించారు. కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ఉప ముఖ్య‌మంత్రి శ్రీ‌వాణి మొక్క‌ల‌ను నాటారు. అనంత‌రం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ క‌ట్టా సింహాచ‌లం, వివిధ శాఖ‌ల అధికారులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here