ఏసయ్య కానుకగా చూడండి!

0
10 వీక్షకులు
నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న మంత్రి తన్నీరు హరీష్‌రావు
  • ఫాస్టర్లకు మంత్రి తన్నీరు వినతి

సిద్ధిపేట, ఏప్రిల్ 23 (న్యూస్‌టైమ్): చర్చి ఫాస్టర్స్‌కు అందిస్తున్న నిత్యావసర వస్తువుల కిట్స్‌ను యేసు ప్రభువు కానుకగా చూడాలని, ఆపదలో ఉన్న వారిని, నిరుపేదలను ఆదుకునేందుకు ఎప్పుడూ ముందుటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శక్తి గార్డెన్స్‌లో గురువారం మధ్యాహ్నం పీజేఏస్ పాల్ ఫౌండేషన్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సహకారంతో జిల్లాలోని సిద్ధిపేట, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాలతో పాటు జనగామ జిల్లాల్లోని దాదాపు 500 పైచిలుకు పేద క్రైస్తవ ఫాస్టర్స్‌కు బియ్యం, నిత్యావసర వస్తువులను మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు సహకరిస్తూ మానవత్వం చాటుకోవాలని కోరారు. సీఏం కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం పరమావధిగా భావిస్తూ సీఎం ఆలోచన చేస్తున్నారని తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి చెప్పారు.

మరోవైపు, లాక్‌డౌన్ నేపథ్యంలో నిరు పేదలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అండగా నిలుస్తున్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని శివమ్స్ గార్డెన్స్‌లో గురువారం మధ్యాహ్నం సిద్ధిపేట రైస్ మిల్లర్ల అసోసియేషన్, గంప శ్రీనివాస్, వెనిశెట్టి వీరేశం సహకారంతో పట్టణానికి చెందిన 250 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

పట్టణ బట్టల వర్తక సంఘం ఆధ్వర్యంలో 100 మంది పేద గుమస్తా కుటుంబాలకు నిత్యావసర వస్తువుల కిట్స్ పంపిణీ చేశారు మంత్రి హరీశ్ రావు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణ బట్టల వర్తక సంఘ భవనంలో గురువారం మధ్యాహ్నం 100 మంది పేద గుమస్తా కుటుంబాలకు కావాల్సిన నిత్యావసర వస్తువుల కిట్స్‌ను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ బట్టల వర్తక సంఘ ప్రతినిధులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దృష్ట్యా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదవారికి, ఆపదలో ఉన్న వారికి సాయాన్ని అందించడం అభినంద నీయమని టీపీటీఎఫ్ సేవలను మంత్రి హరీశ్ రావు కొనియాడారు. జిల్లా కేంద్రమైన బీసీ స్టడీ సర్కిల్‌లో గురువారం మధ్యాహ్నం పట్టణంలో 50 మంది రోజువారీ కూలీ, చిరు వ్యాపార కుటుంబాలకు వెయ్యి రూపాయల విలువ కలిగిన నిత్యావసర వస్తువుల కిట్స్‌ను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కౌన్సిలర్ చిప్ప ప్రభాకర్, టీపీటీఎఫ్ ప్రతినిధులు తిరుపతి రెడ్డి, రాములు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here