పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు

ఏలూరు, ఆగస్టు 3 (న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లాలో నూతనంగా 25 కాంటైన్‌మెంట్ జోన్లను ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాలలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోధైనందున కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కంటైన్‌మెంట్ జోన్లు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తణుకు మండలం తెతలి, చింతలపూడి మండలం శివపురం గ్రామంలోని వార్డు నెంబర్ 10, అదే మండల పరిధిలోని బట్టువారి గూడెం వార్డు నెంబర్ 19, దెందులూరు మండలంలోని పెరుగు గూడెం వార్డు నెంబరు 3, ద్వారక తిరుమల మండలంలోని ఎం. నాగులపల్లి వార్డు నెంబర్ 9, శరభపురం చిన్నఇగ్గెపురం వార్డ్ నెంబర్ 8, పి. కన్నాపురం వార్డ్ నెంబర్ 3, ద్వారకా తిరుమలలోని వార్డు నెంబర్ 14ను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించామన్నారు.

అలాగే, పాలకోడేరు మండలంలోని మోగల్లు గ్రామంలోని వార్డు నెంబర్ 3, పెదవేగి మండలం నాగన్న గూడెంలోని కొప్పుల వారి గూడెం సచివాలయం, పెనుగొండ మండలం తామరాడ గ్రామం నడిపూడి సచివాలయం, తాడేపల్లిగూడెం రూరల్ మండల పరిధిలోని అరుగోలను గ్రామ వార్డు నెంబర్ 4, 5, నల్లజర్ల మండల పరిధిలోని ప్రకాశరావు పాలెం వార్డు నెంబర్ 12, పెదపాడు మండలం సీతారామపురం వట్లూరు సచివాలయం 3 పరిధిలోని వార్డ్ నెంబర్ 7, సౌరిపురం వట్లూరు గ్రామం వార్డు నెంబర్ 16, చాగల్లు మండలం చాగల్లు సచివాలయం 3 ఎస్‌సి ఏరియా వార్డు నెంబర్ 8, ఏలూరు అర్బన్ వార్డ్ నెంబర్ 2, రామచంద్ర అపార్ట్మెంట్స్ (వరంగాయ గూడెం), ఏలూరు అర్బన్ వార్డు నెంబర్ 16 పేరుమల్ల నగేష్ వీధి, ఇరగవరం మండలం అంచుపట్ల వారి వీధి రేలంగి వార్డ్ నెంబర్ 9, అర్జునుడు పాలెం గ్రామం వార్డ్ నెంబర్ 5, టీ నర్సాపురం మండలం అప్పలరాజు గూడెం వార్డు నెంబర్ 2, కొయ్యలగూడెం మండలం వేదాంతపురం, భీమడోలు మండలం కోడూరుపాడు దుడ్డేయపూడి సచివాలయం, ఉండి మండలం పండెవ్వ, భీమవరం మండలం కోమటి తిప్ప గ్రామ ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించామని కలెక్టర్ తన ప్రకటనలో వివరించారు. ఈ ప్రాంతాలలో కంటైన్‌మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, ప్రజలు ఎవరు బయటకు రాకూడదని ఆయన తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలని కంటైన్‌మెంట్ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన నిత్యవసర వస్తువులు ఇళ్ల వద్దకు సరఫరా చేయడం జరుగుతుందని ముత్యాలరాజు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.