న్యూఢిల్లీ, అక్టోబర్ 23 (న్యూస్‌టైమ్): భారత్‌లో చికిత్స పొందుతూ ఉన్న కరోనా బాధితుల సంఖ్య వేగంగా తగ్గుతోంది. మొత్తం కేసులలో ఇప్పటికీ బాధితులుగా ఉన్నవారి సంఖ్య గడిచిన మూడు రోజులుగా 10% లోపే ఉంటూ వస్తోంది. అంటే దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన ప్రతి పందిలో ఒకరు మాత్రమే ఇంక చికిత్సలో ఉన్నారు. ప్రస్తుతం కోవిడ్ బాధితులు 9.29% గా నమోదు కాగా వారి సంఖ్య 7,15,812. మరో మైలురాయి చేరుకుంటీ రోజువారీ పాజిటివ్ కేసులు గడిచిన మూడు రోజులుగా 5% లోపే ఉంటున్నాయి. దీన్నిబట్టి వ్యాధి వ్యాప్తి బాగా తగ్గినట్టు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ వ్యూహాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టమవుతున్నది. రోజువారీ పాజిటివ్ కేసుల శాతం 3.8 గా నమోదైంది. రోజూ పాజిటివ్ కేసులు తగ్గుతూ ఉండటంతో చికిత్సలో ఉన్నవారు కూడా తగ్గుతూ ఈ రోజు 7,15,812 కు చేరారు. ఇప్పటిరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 69 లక్షలు (68,74,518). చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్నవారికీ మధ్య తేడా రోజూ పెరుగుతూ వస్తుండగా ఈరోజు అది 61,58,706 గా నమోదైంది. గత 24 గంటల్లో 79,415 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇలా ఉండగా కొత్తగా పాజిటివ్‌గా నమోదైన వారు 55,839 మంది. ఆ విధంగా కోలుకున్నవారి శాతం 89.20%కు పెరిగింది. కొత్తగా కోలుకున్నవారిలో 81% మంది కేవలం 10 రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోనే నమోదయ్యారు. అమ్దులోఈ మహారాష్టలో అత్యధికంగా 23,000 మందికి పైగా ఒక్కరోజులోనే కోలుకున్నారు. 55,839కొత్త కేసులు గడిచిన 24 గంటలలోనే నమోదయ్యాయి. వాటిలో 78% కేసులు 10 రాష్టాలలోనే ఉన్నాయి. అందులో మహారాష్ట్ర, కేరళ రాష్టాల్లో ఒక్కో చోట 8,000 కు పైగా కేసులు నమోదు కాగా కర్నాటకలో కేసులు 5,000 దాటాయి. గత 24 గంటలలో 702 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో 82% కేవలం పది రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లోనే ఉన్నాయి. తాజా మరణాలలో 25% పైగా (180 మరణాలు) మహారాష్ట్రలొనే సంభవించాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కోవిడ్ -19 పై ప్ర‌జ‌ల‌లో సామాజిక అవ‌గాహ‌న పెంపొందించేందుకు సిమ్లా పోలీసులు రూపొంఇంచిన ఒక క‌టౌట్‌ను రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ ఆవిష్క‌రించారు.

పోలీసుల చొర‌వ‌ను గ‌వ‌ర్న‌ర్ అభినందించారు. కోవిడ్ -19 పై పోరాటంలో ఫ్రంట్‌లైన్ యోధులుగా పోలీసులు అద్బుత సేవ‌లు అందిస్తున్నార‌న్నారు. కోవిడ్‌పై పోర‌టం ఇంకా ముగిసిపోలేద‌ని ఆయన అన్నారు. అందువ‌ల్ల కోవిడ్‌కు మందు వ‌చ్చే వ‌ర‌కు అంద‌రూ అప్ర‌మత్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని, చేతులు త‌ర‌చూ శుభ్ర‌పర‌చుకునే అల‌వాటు చేసుకోవాల‌ని, బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో సామాజిక దూరం పాటించాల‌ని, బాధ్య‌తాయు పౌరులుగా ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని కోరారు. కోవిడ్ -19పై పోరాటానిక ప్ర‌ధాన‌మంత్రి ఇచ్చిన పిలుపులో అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని ద‌త్తాత్రేయ కోరారు.

మ‌హ‌రాష్ట్ర‌లో నిన్న 8,142 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 23,371 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనితో యాక్టివ్ కేసుల సంఖ్య 1.58 ల‌క్ష‌ల‌కు చేరింది. ముంబాయిలో కొత్త‌గా 1609 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య ముంబాయిలో ప్ర‌స్తుతం 19,245గా ఉంది. కాగా ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌లో కోవిడ్ అనంత‌ర చికిత్సా కేంద్రాల‌ను ప్రారంభించిన తొలి జిల్లాగా నాగ‌పూర్ నిలిచింది. గుజ‌రాత్‌లో కోవిడ్ రిక‌వ‌రీ రేటు 89.03 శాతానికి చేరింది. రాష్ట్రంలో కొత్త‌గా 1,137 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల‌లో 1180 మంది కోలుకున్నారు. దీనితో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 14,215 కు చేరింది. ఇందులో 75 మంది వెంటిలేట‌ర్ స‌పోర్ట్‌పై ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్రంలో కొవిడ్ సంబంధిత మ‌ర‌ణాలు 3,663 న‌మోద‌య్యాయి. రాజ‌స్థాన్‌లో గ‌త ఎనిమిదిరోజుల‌లో వ‌రుస‌గా కోవిడ్ వైర‌స్ బారిన ప‌డిన వారికంటే ఎక్కువ మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ నుంచి 2,865 మంది కోలుకోగా తాజాగా 1810 మంది కోవిడ్ బారిన ప‌డినట్టు అధికారులు తెలిపారు. గ‌రిష్ఠ‌స్థాయిలో 349 కేసులు జైపూర్‌నుంచి న‌మోదుకాగా ఆ త‌ర్వాతి స్థానం 303 కేసుల‌తో జోధ్‌పూర్ నిలిచింది.

ఆ త‌ర్వాతి స్థానం 178 కొత్త కేసుల‌తో ఆల్వార్ ఉంది. ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ట్రంలో కోవిడ్ -19 ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు గ‌ల స‌దుపాయాల‌ను అంచ‌నా వేసేందుకు ముగ్గురు స‌భ్యులుగ‌ల కేంద్ర బృందం చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ప‌ర్య‌టిస్తోంది. ఈ బృందం రాయ్‌పూర్‌లోని ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ, ఆస్ప‌త్రి, అలాగే రాయ‌పూర్‌, దుర్గ్‌ జిల్లాల‌లో ఆస్ప‌త్రులు, కోవిడ్ సెంట‌ర్ల‌ను సంద‌ర్శించి ప్ర‌భుత్వ స‌న్న‌ద్ధ‌త‌ను అంచ‌నా వేసింది. చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ఇప్ప‌టివర‌కు 25,795 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేర‌ళ‌లో కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఏర్ప‌డిన ఆర్ధిక సంక్షోభంతో తీవ్ర ద్ర‌వ్య‌లోటు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న‌ది. ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికానికి జ‌రిపిన ప‌రిశీల‌న‌లో రాష్ట్ర ద్ర‌వ్య‌లోటు 112.9 శాతంగా ఉన్న‌ట్టు తేలింది. ఇది 10,578 కోట్ల రూపాయ‌లు. కేంద్ర‌ప్ర‌భుత్వంనుంచి జిఎస్‌టి ప‌రిహారం, ఆర్ధిక స‌హాయం స‌త్వ‌రం అంద‌న‌ట్ట‌యితే రాగ‌ల రోజుల‌లో రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలోకి వెళుతుంద‌ని ఈ అంచ‌నా తెలిపింది. ఇదిలా ఉండ‌గా, స్ప్రింక్ల‌ర్ ఒప్పందానికి సంబంధించి ద‌ర్యాప్తు చేసేందుకు నియ‌మించిన ఇద్ద‌రు స‌భ్యుల క‌మిటీ ఇందులో లోపాలు ఉ న్న‌ట్టు కనుగొనింది. ముఖ్య‌మంత్రి మాజీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎం.శివ‌శంక‌ర్ ఈ ఒప్పందాన్ని ఖ‌రారుచేయ‌డంలో అన‌వ‌స‌ర తొంద‌ర‌ను ప్ర‌ద‌ర్శించార‌ని అభిప్రాయ‌ప‌డింది. కోవిడ్ -19 పేషెంట్ల స‌మాచారాన్ని స్ప్రింక్ల‌ర్ ఐఎన్‌సికి బ‌ద‌లాయించారు.

కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుదుచ్చేరిలో కోవిడ్ మ‌ర‌ణాల రేటు 2 శాతాన్ని మించింది. ఇది జాతీయ స‌గ‌టు కంటే ఎక్కువ‌. జాతీయ స‌గ‌టు 1.6 శాతం. చెన్నైలోని మెట్రో స్టేష‌న్లు, రైళ్ల‌ను ఆక్వియ‌స్ స్టెబిలైజ్‌డ్ ఓజోన్ ద్వారా శుభ్ర‌ప‌రుస్తున్నారు. గాఢ‌మైన ర‌సాయ‌నాల‌నుంచి సిబ్బందిని ర‌క్షించేందుకు దీనిని వాడుతున్నారు. పండ‌గ సీజ‌న్‌లో సుల‌భ‌త‌ర ప్ర‌యాణానికివీలుగా సూప‌ర్‌ఫాస్ట్ రైళ్ల‌ను గాంధీదామ్‌, తిరున‌ల్వేలి మ‌ధ్య మ‌డ్‌గాన్‌, ఎర్నాకుళం జంక్ష‌న్‌, తిరువ‌నంత‌పురం సెంట్ర‌ల్, నాగ‌ర్‌కోయిల్‌టౌన్‌, ల‌మీదుగా న‌డ‌ప‌నున్న‌ట్టు రైల్వే శాఖ‌ప్ర‌క‌టించింది. ఇవాళ వ‌రుస‌గా నాలుగ‌వ రోజు కూడా త‌మిళ‌నాడులో 4000 కంటే త‌క్కువ కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 3,086 మందికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. రాష్ట్రంలో 39 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. క‌ర్ణాట‌క నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గ‌ల 155 ప‌రీక్షా కేంద్రాల‌లో 1.08,241 కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఇప్ప‌టివ‌ర‌కు 69,52,835 ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. పాజిటివ్ కేసుల రేటు 5.42శాతంగా ఉంది.

ల‌క్షా 440 యాక్టివ్ కేసుల‌లో 947 మంది పేషెంట్లు అంటే 0.94 కేసులు ఐసియుల‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మ‌ర‌ణాల కేస్ రేటు 1.49 శాతంగా ఉంద‌ని రాష్ట్ర ఆరోగ్య‌కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్ట‌ర్ సుధాక‌ర్ ట్వీట్ ద్వారాతెలిపారు. ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు సంబంధించి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయాల్సిందిగా ప్రాధ‌మిక‌, మాధ్య‌మిక విద్యా శాఖ మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌లో అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటూ న‌వంబ‌ర్ 2 నుంచి పాఠ‌శాల‌లు తిరిగి తెర‌వ‌నున్న‌ట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ పున‌రుద్ఘాటించారు. 1,3,5,7,9 త‌ర‌గ‌తుల‌కు ఒక‌రోజు, 2,4,6,8,10 త‌ర‌గ‌తులకు మ‌రో రోజు స‌రి, బేసి ప్రాతిప‌దిక‌న త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. పాఠ‌శాల‌ల్లో అమ‌లు చేయాల్సిన కోవిడ్ ప్రొటోకాల్సుకు సంబంధించి డిఎంహెచ్ఒ ల‌ద్వారా టీచ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇప్పించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ప్ర‌తి పాఠ‌శాల‌కు మెడిక‌ల్ సిబ్బంది అందుబాటులో ఉంటార‌ని, ఒక డాక్ట‌ర్ పిహెచ్‌సిలో అందుబాటులో ఉంటార‌ని తెలిపారు. కాగా కోవిడ్ అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లా పాల‌నా యంత్రాంగం క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు అవ‌గాహ‌నా ర్యాలీలు నిర్వ‌హిస్తున్న‌ది. మాస్కులు ధ‌రించ‌డం, సామాజిక దూరం పాటించ‌డం, త‌ర‌చూ వీలైన‌న్ని ఎక్కువ సార్లు చేతులు శుభ్ర‌ప‌ర‌చుకోవాల్సిన అవ‌స‌రంపై ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

గ‌త 24 గంట‌ల‌లో తెలంగాణాలో 1456 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. 1717 మంది కోలుకున్నారు. 5గురు మ‌ర‌ణించారు. ఈ 1456 కేసుల‌లో 254 కేసులు జిహెచ్ఎంసి నుంచి న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,27,580. యాక్టివ్‌కేసులు 20,183, మ‌ర‌ణాలు 1292,
కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన‌వారు 2,06,105. అస్సాంలో కోవిడ్ 19 వైర‌స్‌కు మ‌రో 701 మంది గుర‌య్యారు, నిన్న 1664 మంది పేషెంట్లు ఆస్ప‌త్రినుంచి డిశ్చార్జి అయ్యారు. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 202774కు పెరిగింది, యాక్టివ్‌క ఏసులు 25,807. కోలుకుని ఆస్ప‌త్రుల‌నుంచి డిశ్చార్జి అయిన వారు 176075, మ‌ర‌ణించిన‌వారు 889.

మేఘాల‌యలో ఈరోజు కోవిడ్ -19నుంచి 177 మంది పేషెంట్లు కోలుకున్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 1870. మొత్తం కోలుకున్న వారు 6674. నాగాలాండ్లో 8139 కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. 3613 మంది సైనిక ద‌ళాల‌కు చెందిన‌వారు. ఇందులో 2512 గుర్తించిన కాంటాక్టుల‌, 1617 తిరిగి వ‌చ్చిన‌వారు, 397మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు ఉ న్నారు. సిక్కింలో మ‌రో 49 మంది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. యాక్టివ్ కేసులు 252. మొత్తం డిశ్చార్జి అయిన‌వారు 3328 మంది.