కరోనా నిర్మూలన సహాయార్థం రూ.లక్ష విరాళం

0
5 వీక్షకులు

వరంగల్, ఏప్రిల్ 17 (న్యూస్‌టైమ్): కరోనా బాధితుల సహాయార్థ మై రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్‌లు రూ.1,00,116/-లను విరాళం ప్రకటించాయి. ఈ విరాళం మొత్తానికి చెక్కును ఆ క్రీడల సంస్థల బాధ్యులు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి శుక్రవారం హన్మకొండలో అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నదని అన్నారు. ఈ దశలో విధించిన లాక్‌డౌన్ కారణంగా, మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. ఈ సమయంలో రెక్కాడితే డొక్కాడని నిరుపేదలను ఆదుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. అలాంటి వాళ్ళ కోసం, వాళ్ళని ఆదుకోవడం కోసం ముందుకు వస్తున్న దాతలను మంత్రి ఎర్రబెల్లి అభినందించారు.

లాక్‌డౌన్ మరికొంతకాలం కొనసాగించాల్సిన అవసరం కనిపిస్తున్నది అని అన్నారు. అప్పటి దాకా ప్రజలు ఓపిక పట్టాలని, సహకరించాలని, నిరుపేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వచ్చి, తమ ఔదార్యాన్ని చాటుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ పవన్ కుమార్, కోచ్ విష్ణు వర్ధన్ రెడ్డి, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి టీ శ్యామ్ సుందర్, ఎల్ఐసి నాగేశ్వర్ రావు తదతరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here