న్యూఢిల్లీ, జులై 27 (న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా సుమారు 2,700 మంది రైల్వే ఉద్యోగులు కరోనా బారినపడ్డారని కేంద్ర రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. కరోనా మహమ్మారి ఆపత్కాల పరిస్థితుల్లో రైల్వేశాఖ కీలకపాత్ర పోషిస్తోందని, ఔషధాలు, ఇతర అత్యవసర వస్తువులను దేశంలో వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సిబ్బందికి వైరస్‌ సోకిందన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, కంపెనీ కార్యదర్శులతో తాజాగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌లో ఢిల్లీ నుంచి మంత్రి గోయల్‌, హైదరాబాద్‌ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కృషి కారణంగానే దేశంలో ప్రస్తుతం మిగులు విద్యుత్తు ఉందన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రెడ్డి, కోశాధికారి శాంతికుమార్‌, కార్యదర్శి పాపారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here