అతి తక్కువ కొత్త కేసులతో రికార్డు నమోదు…

న్యూఢిల్లీ, జనవరి 27 (న్యూస్‌టైమ్): కోవిడ్ మీద పోరులో భారత్ మరో కీలకమైన మైలురాయి దాటింది. రోజువారీ కొత్త కేసులు కనిష్ఠ స్థాయికి చేరాయి. గత 24 గంటలలో 9,102 కొత్త కేసులు వచ్చాయి. ఇది 237 రోజుల తరువాత అతి తక్కువ. గత జూన్ 4న 9,304 కేసులు నమోదయ్యాయి. స్థిరంగా, సానుకూల వ్యూహం అనుసరించటం వలన రోజువారీ కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. దీనివలన మరణాలు కూడా బాగా తగ్గాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటలలో 117 మరణాలు నమోదయ్యాయి.

ఇది 8 నెలల 9 రోజుల తరువాత జరిగింది. భారత దేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య కూడా 1,77,266కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారి వాటా 1.66%కి తగ్గింది. మరోవైపు, గత 24 గంటలలో చికిత్సలో ఉన్న కేసులు నికరంగా 6,916 తగ్గాయి. ప్రతి 10 లక్షల మందిలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 128 మాత్రమే. జర్మనీ, రష్యా, బ్రెజిల్, ఇటలీ, యుకె, యుఎస్ఎ లాంటి దేశాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

ప్రతి పది లక్షల జనాభాలో కేసుల సంఖ్య ప్రపంచంలోనే అతి తక్కువగా 7,736గా నమోదైంది. జాతీయ టీకాల కార్యక్రమం కింద 2021 జనవరి 26 ఉదయం 8 గంటలవరకు కోవిడ్ టీకా లబ్ధిదారుల సంఖ్య 20,23,809కి చేరింది. గత 24 గంటలలో 4,08,305 మందికి 7,764 శిబిరాలలో టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు 36,378 శిబిరాలు నిర్వహించారు.

మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఈ రోజుకు 1,03,45,985కు చేరింది. ఇది కోలుకున్న శాతాన్ని 96.90%కు చేర్చింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య బాగా పెరుగుతూ ప్రస్తుతం 1,01,68,719 అయింది. గడిచిన 24 గంటలలో 15,901 మంది కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారిలో 83.68% మంది 9 రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యారు. కేరళలో ఒకరోజులో అత్యధికంగా 5,606 మంది కోలుకోగా మహారాష్ట్రలో 3,080 మంది, కర్నాటకలో 1,036 మంది కోలుకున్నారు.

కొత్తగా నమోదైన కేసులలో 81.76% మంది 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. కేరళలో అత్యధికంగా 3361 కేసులు రాగా, మహారాష్ట్రలో 1842 కేసులు, తమిళనాడులో 540 కేసులు వచ్చాయి. గత 24 గంటలలో 117 మంది మరణించగా వారిలో 63.25% మంది పరిమిత రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో 30 మంది, కేరళలో 17 మంది, చత్తీస్‌గఢ్‌లో 13 మంది చనిపోయారు. భారత్‌లో ప్రతి పది లక్షల జనాభాలో మరణాలు 11. ఇది ప్రపంచంలో అతి తక్కువ సంఖ్య.