అర్హులందరికీ కరోనా ప్యాకేజీ

0
11 వీక్షకులు
  • అధికారులతో సమీక్షలో కలెక్టర్

ఏలూరు, మే 21 (న్యూస్‌టైమ్): జిల్లాలో ఎంఎస్ఎంఇలకు రీస్టార్ట్ ప్యాకేజీ కింద వివిధ రకాల ఇన్సెంటివ్‌లు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదుగా మంజూరు చేయడం జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు తెలిపారు. గురువారం ఆయన తన ఛాంబరులో పరిశ్రమలశాఖ అధికారులతో ఎంఎస్ఎంఇలపై సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న పరిశ్రమల వారు వారి కాళ్లపై వారు నిలబడేందుకు రీస్టార్ట్ ప్యాకేజీని అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ సందర్బంగా ఏప్రిల్, మే, జూన్, 2020 మూడు మాసాలకు విద్యుత్ డిమాండు రద్దు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భారీ పరిశ్రమలకు లాక్‌డౌన్ ఉన్నందున డిఫర్‌మెంటు వాయిదా వేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సూక్ష్మ,చిన్న తరహా పరిశ్రమలకు రెండు లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకూ వర్కింగ్ కేపిటల్ కింద 6 నుండి 8 శాతం వడ్డీకే రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యాలయలకు డీపీసీ ద్వారా కొనుగోలు చేసే వస్తువులలో 25 శాతం ఎంఎస్ఎంఇల నుండి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.

జిల్లాలో మంజూరైన 938 రైతు భరోసా కేంద్రాలు ఈనెల 30వ తేదీన ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లుచేయలని జిల్లా కలెక్టరు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 863 భవనాలు పూర్తిస్దాయిలో సిద్దంగా ఉన్నాయని, మిగిలినవి కూడా సిద్దం చేసి ఇంటర్నెట్ కనెక్షన్, టీవీ కియోస్కి మిషన్, విద్యుత్, మంచినీరు సదుపాయం కల్పించడంతోపాటు కుర్చీలు, టేబుల్స్, ర్యాక్స్ ఉండేడట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సక్రమంగా పంపిణీ చేసేందుకు సమగ్రమైన ప్రణాళిక రూపొందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఏ పంటకు ఎప్పుడు అవసరమవుతాయో ఆ సమయానికి సిద్దంగా ఉండేడట్లు చూడాలని ఆయన ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక సమాచారం కూడా అందించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

అర్చకులు, ఫాస్టర్లు, ఇమామ్స్, మౌజమ్‌లకు ఒకే సారి 5 వేల రూపాయలు ఆర్ది క సహాయం అందించేందుకు తగిన డేటాను సిద్దం చేయాలని ఆయన సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకూ జిల్లాలో గుర్తించిన అర్చకులు వివరాలను సంబంధిత గ్రామ సచినాలయాలకు పంపించి గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా వెరిఫై చేయించాలని ఆయన ఆదేశించారు. పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజమ్‌లను ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా గుర్తించి పంపించడం జరిగిందని ఆయన తెలిపారు.

స్వంత ఆటో, స్వంత క్యాబ్ ఉన్న వారికి జూన్ 4వ తేదీన 10 వేల రూపాయలు ఆర్దిక సహాయం అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. గత సంవత్సరం మంజూరు చేసిన 17101 మంది లబ్దిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలలలో సోషల్ అడిట్ నిమిత్తం ఈనెల 26వ తేదీ వరకూ ఉంచడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ జాబితాలో పేరు లేనివారు ఎవరైనా ఉన్నట్లయితే ఈనెల 21వతేదీ నుండి 28 తేదీ వరకూ వార్డు, విలేజీ సెక్రటేరియట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈనెల 30వ తేదీలోపు ఎంపిడిఒలు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలను కలెక్టరుకు పంపించాలని ఆయన సూచించారు.

అర్హులైన వారికి జూన్ 2, 3 తేదీలలో శాంక్షన్ ప్రొసిడింగ్స్ సంబంధిత కార్పొరేషన్ ఎండీల ద్వారా ఇవ్వడం జరుగుతుందని, జూన్ 4వ తేదీన లబ్దిదారులకు 10 వేల రూపాయల ఆర్దిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 1236 మంది నూతనంగా నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఎవరైనా అర్హులైన వారు ఉంటే నమోదు చేసుకోవాలన్నారు. అలాగే, జిల్లాలో ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు షాపు ఉన్న ప్రతీ ఒక్కరికి 10 వేల రూపాయలు ఆర్దిక సహాయం అందించే కార్యక్రమం, చేనేత కుటుంబానికి వైయఎస్ఆర్ నేస్తం, తదితర పధకాలపై సమీక్షించారు. ఈ సమావేశాలలో జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) కె. వెంకట రమణారెడ్డి, జాయింట్ కలెక్టరు (సంక్షేమం) నంబూరి తేజ్ భరత్, పరిశ్రమల శాఖ జీఎం మురళీ మోహన్, ఎస్ఎఫ్‌సీ మేనేజరు శివరావు, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టరు గౌస్యా బేగం, డిప్యూటీ ట్రన్స్‌పోర్టు కమిషనరు సురేందర్, వివిధ కార్పొరేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here