క‌లిసి క‌ట్టుగా క‌రోనా క‌ట్ట‌డి

0
7 వీక్షకులు
  • లాక్‌డౌన్‌తో అడ్డుకుందాం

  • అప్ర‌మ‌త్త‌తే ప్ర‌ధాన‌ ఆయుధం

  • ముందు జాగ్ర‌త్త‌లే మొద‌టి మందు

వరంగల్, ఏప్రిల్ 17 (న్యూస్‌టైమ్): క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌనే ప్ర‌థ‌మ‌ క‌ర్త‌వ్యం కావాలని, అప్ర‌మ‌త్త‌తే ప్ర‌జ‌ల‌ ప్ర‌ధాన‌ ఆయుధమని, ముందు జాగ్ర‌త్త‌లే మహమ్మారికి మొద‌టి మందు కావాలని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ ఆవ‌ర‌ణ‌లో రూ.1.73 కోట్ల‌తో ఏర్పాటు చేసిన క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించే ప్ర‌త్యేక ల్యాబ్‌ని మంత్రి ఎర్ర‌బెల్లి, మ‌రో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌తో క‌లిసి శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తూ, క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల మీద‌కు దండెత్తింద‌న్నారు. ‘‘ఇది క‌నిపించ‌ని శ‌త్రువుతో చేస్తున్న‌ యుద్ధం. అందుకే మ‌న‌మంతా ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. అదే మ‌న ఆయుధం కావాలి’’ అని అన్నారు.

‘‘అలాగే దీని విస్తృతి భ‌యంక‌రంగా ఉంది. దీన్ని ఎదుర్కోవ‌డానికి ప్ర‌త్యేకంగా ముందులేవీ లేవు. పైగా ఇంకా టీకాలు రాలేదు. అందుకే స్వీయ నియంత్ర‌ణ‌ని పాటిస్తూ, సామాజిక భౌతిక దూరంతో లాక్‌డౌన్ ద్వారా మాత్ర‌మే దీన్ని ఎదుర్కోగ‌ల‌ం’’ అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ ద‌వాఖానాని క‌రోనా ప్ర‌త్యేక చికిత్స కేంద్రంగా అభివృద్ధి ప‌రిచి, అన్ని ర‌కాల స‌దుపాయాలు, వైద్య చికిత్స, ప‌రిక‌రాల‌తో సంసిద్ధం చేసి ప‌ని చేయిస్తున్నామ‌న్నారు.

అయితే, క‌రోనా విస్త‌ర‌ణ‌ని దృష్టిలో పెట్ట‌కుని రాష్ట్రంలో రెండో రాజ‌ధానిగా ఉన్న వ‌రంగ‌ల్‌లోనూ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించే ల్యాబ్‌ని ప్రారంభించామ‌న్నారు. రూ.1.73 కోట్లు వ్య‌వ‌య‌మ‌వ‌గా, ఇందులో సగం భ‌వ‌న నిర్మాణానికి, మిగ‌తా స‌గం వైద్య ప‌రీక్ష‌ల ప‌రిక‌రాల‌కు ఖ‌ర్చు చేశామ‌న్నారు. అయితే, ప్ర‌స్తుతం ఒక షిఫ్ట్‌లో ఇద్ద‌రు ల్యాబ్ టెక్నీషియ‌న్లు, ఇద్ద‌రు రిసెర్జీ అసిస్టెంట్లు, ఒక సూప‌ర్‌వైజ‌ర్‌తో క‌లిపి ప‌ని చేస్తుండ‌గా షిఫ్ట్‌కి 100 టెస్టులు చేయొచ్చ‌న్నారు.

అవ‌స‌రాన్ని బ‌ట్టి రెండు, మూడు షిఫ్టులుగా ఈ ల్యాబ్ ప‌ని చేస్తుంద‌న్నారు. సిఎం కెసిఆర్ సూచ‌న‌ల మేర‌కు మ‌న‌మంతా క‌లిసి క‌ట్టుగా క‌రోనా వైర‌స్‌ని ఎదుర్కొందామ‌ని, లాక్‌డౌన్‌ని తు.చ‌. త‌ప్ప‌కుండా పాటిద్దామ‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మాట్లాడుతూ ఇక్క‌డ క‌రోనా ప‌రీక్ష‌ల కేంద్రాన్ని ప్రారంభించుకోవాల్సి రావ‌డం విచార‌క‌ర‌మ‌న్నారు. అయితే, క‌రోనాకు భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేద‌ని, ముందు జాగ్ర‌త్తలు పాటించ‌డం మానుకోవ‌ద్ద‌న్నారు. సామాజిక, భౌతిక దూరం, లాక్‌డౌన్‌ని పాటించ‌డం త‌ప్ప‌నిస‌రిగా మంత్రి చెప్పారు. మ‌న‌మంతా క‌ల‌సి క‌ట్టుగా ఉండి క‌రోనా వైర‌స్‌ని లాక్‌డౌన్‌తో క‌ట్ట‌డి చేద్దామ‌ని మంత్రి స‌త్య‌వ‌తి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. సీఎం కెసిఆర్ పిలుపు మేర‌కు అవ‌స‌ర‌మైన‌న్ని రోజులు లాక్‌డౌన్ నిర్వ‌హించాల‌ని, అందుకు ప్ర‌జ‌లు వైద్యులు, అధికారులు, పోలీసుల‌కు స‌హ‌క‌రించాల‌ని మంత్రి తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ ప‌సునూరి ద‌యాక‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా క‌లెక్ట‌ర్ రాజీవ్ గాంధీ హ‌న్మంతు, ఆయా శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here