రెండో రోజూ జర్నలిస్టులకు పరీక్షలు

0
8 వీక్షకులు
విజయవాడలో ఐఎంఎ బృందం జర్నలిస్టుల కోసం నిర్వహించిన కరోనా పరీక్షల శిబిరంలోని ఓ దృశ్యం
  • 135 మందికి ఐఎంఎ కరోనా టెస్టులు

  • కలెక్టర్ చొరవతో అనంతపురంలోనూ…

  • విశాఖ నగరంలోనూ కొనసాగిన పరీక్షలు…

అమరావతి, విజయవాడ, ఏప్రిల్ 29 (న్యూస్‌టైమ్): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)తో కలిసి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) ఇక్కడి ఐఎంఎ హాలులో నిర్వహిస్తున్న కరోనా నిర్ధరణకు సంబంధించిన (యాంటీ బాడీ) పరీక్షల్లో రెండోరోజు బుధవారం 135 మంది జర్నలిస్టులు రక్త నమూనాలను అందజేశారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) అధ్యక్షుడు డాక్టర్‌ మధుసూదన శర్మ స్వయంగా ఈ పరీక్షల శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. నిన్న, ఇవాళ కలిపి మొత్తం 301 మందికి పరీక్షలు పూర్తయ్యాయని డాక్టర్ శర్మ తెలిపారు. జిల్లా మొత్తంగా శాంపిల్స్ కోవిడ్ ఆస్పత్రికి రావడంతో పరీక్ష ఫలితాలు తెలిపేందుకు ఆలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా ఐఎంఎ హాలులో రక్త పరీక్ష ఫలితాలు ఆలస్యం అవుతున్న కారణంగా ప్రభుత్వ సూచనల మేరకు ఐఎంఎ హాలులో జరిగే టెస్టులు గురువారం నుంచి నిలిపి వేస్తున్నామన్నారు. తిరిగి ప్రకటించే వరకూ ఎవరూ రావొద్దని ఆయన తెలిపారు. ప్రజావైద్యశాల డాక్టర్ రాం ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు పర్యవేక్షించారు.

  • అనంతపురం జర్నలిస్టులకూ కరోనా పరీక్షలు…

ఏపీయూడబ్ల్యూజే జిల్లా సమితి విజ్ఞప్తి పట్ల స్పందించిన అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ గంధం చంద్రుడు జిల్లాలోని జర్నలిస్టులకు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేయడంతో అనంతపురంలోని పాత్రికేయులకు బుధవారం కేఎస్సార్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో పరీక్షలు జరిపారు.

  • విశాఖ నగరంలోనూ కొనసాగిన పరీక్షలు…

మరోవైపు, రెండు రోజుల క్రితం విశాఖలో జర్నలిస్టులకు ప్రారంభమైన కరోనా పరీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో జర్నలిస్టులకు కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సంస్థల వారీగా తేదీలు, సమయాలను నిర్ణయించి డీపీఆర్వో ముందస్తు సమాచారాన్ని అందించి ఆయా సంస్థల్లో పనిచేసే పాత్రికేయులు పరీక్షలకు హాజరయ్యేలా చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here