ఫుడ్ డెలివరీ బాయ్‌కి కరోనా

0
9 వీక్షకులు

హైదరాబాద్, ఏప్రిల్ 19 (న్యూస్‌టైమ్): ఫుడ్ డెలివరీ బోయ్ ఒకరు కరోనావైరస్ బారినపడ్డాడు. ఇరవయ్యేళ్ల యువకుడుకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షలో ఫలితం పాజిటివ్‌గా తేలింది. ఆ యువకుడు తండ్రి మార్కజ్ నుండి తిరిగి వచ్చిన బాధితుల్లో ఒకరు. తండ్రి నుండి యువకుడికి కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు అధికారులు బాలుడి తండ్రికి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌ కేసుగా ధ్రువీకరించారు.

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరినీ సరోజినిదేవి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఫుడ్ డెలివరీ బాలుడి తండ్రి మార్చి 18న మార్కజ్ నుండి తిరిగి వచ్చారు. బాలుడు మార్చి 19, మార్చి 20న సుమారు 25 మందికి ఆహారాన్ని పంపిణీ చేసినట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా వ్యక్తులను కూడా దిగ్బంధం (క్వారంటైన్) కేంద్రానికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here