పాలకుర్తికి కరోనా సాయం!

0
7 వీక్షకులు

మహబూబాబాద్, ఏప్రిల్ 16 (న్యూస్‌టైమ్): తొర్రూరు ప‌ట్ట‌ణానికి చెందిన వ్యాపారి చిదిరాల గీతా న‌వీన్ పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా నిర్మూల‌న కోసం వినియోగించ‌డానికి వీలుగా రూ. ల‌క్ష విరాళం ప్ర‌క‌టించారు. ఆ విరాళాన్ని మంత్రి సొంతూరు వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలో స్వ‌యంగా రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకి అంద‌చేశారు. అలాగే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆశీస్సుల‌తో తాను నిరుపేద‌ల‌కు పంపిణీ చేస్తున్న నిత్యావ‌స‌ర స‌రుకుల లోగోని ఆవిష్క‌రింప చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, కరోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు విజృంభిస్తున్న‌ద‌ని, ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. క‌రోనా క‌ష్ట కాలంలో అనేక మంది దాత‌లు ముందుకు వ‌స్తున్నార‌ని, ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నార‌ని చెప్పారు. ప్ర‌జ‌లు కంప్లీట్ లాక్‌డౌన్‌లో ఉన్నందున‌, దిన‌స‌రి కూలీలు, నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అందించాల్సిన అస‌వ‌రం ఉంద‌న్నారు.

న‌వీన్ లాంటి వాళ్ళు విరాళం ఇవ్వ‌డ‌మే గాకుండా, నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవ్వ‌డానికి ముందు రావ‌డాన్ని మంత్రి అభినందించారు. న‌లుగురికి సాయం అందించ‌గ‌లిగిన ఆర్థిక స్థోమ‌త ఉన్న‌వాళ్ళు ముందుకు వ‌చ్చి నిరుపేద‌ల‌ను ఆదుకోవాల‌ని మంత్రి పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here