జమీన్‌రైతు పేరిట ఎందుకీ బాగోతాలు

నెల్లూరు, అక్టోబర్ 18 (న్యూస్‌టైమ్): మీడియాపై రాజకీయ నాయకులు అక్కసు వెళ్లగక్కడం ఈరోజు కొత్తేమీ కాదు. స్థానికంగానే కాదు, జాతీయం, అంతర్జాతీయంగా కూడా మీడియాను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడం అనాదిగా చూస్తూనే ఉన్నాము. తాజాగా నెల్లూరు జిల్లాలో ‘జమీన్‌రైతు’ పత్రిక, దాని నిర్వాహకులపై సీరియరల్‌గా సాగుతున్న సోషల్ మీడియా ప్రచారం చూస్తే ఇదేదో కావాలని జరుగుతున్న కుట్రపూరిత వ్యవహారంలా అనిపిస్తోంది. ‘‘డోలి గాడు’ తన టాయిలెట్ పేపర్లో నెల్లూరు శ్రీరామ్మూర్తిని మహానుభావుడని కూశాడు.’’ అంటూ ‘డోలేంద్ర బాగోతాలు’ పేరిట ఆదివారం సోషల్ మీడియాకెక్కిన 9వ – భాగంలోని వివరాలు యధాతధంగా.. ‘‘నెల్లూరు శ్రీరామ్మూర్తి మహానుభావుడా??? ఎవడికి మహానుభావుడు?? డోలేంద్ర లాంటి త్రాష్టుడుకి చిన్నాయన అయినందుకు శ్రీరామ్మూర్తి మహానుభావుడా! డోలేంద్ర లాంటి పుండాకోరు నాయాల్ని కన్నాయనకి తమ్ముడు అయినందుకు శ్రీరామ్మూర్తి మహానుభావుడా….! నీటి పారుదలశాఖ లోని పనుల్ని నామినేషన్ పద్దతిలో నూకి వాటిని చేయకుండానే నిధులు మింగినందుకు మహానుభావుడా!’’ అంటూ పబ్లిష్ చేశారు.

‘‘జమీన్ రైతు పత్రికని అసలు హక్కుదార్లు నుండి కుట్రపూరితంగా లాక్కున్నందుకు మహానుభావుడా!! దండువారి వీధిలో ఉన్న జమీన్ రైతు బిల్డింగ్ ని అర్హత లేకపోయినా అమ్మకనూకి నందుకు మహానుభావుడా!! మళ్ళీ అదే పేపర్ని అడ్డంపెట్టుకుని సావిత్రి నగర్ (చంద్రమౌళి నగర్ ప్రక్కన) లో ప్రభుత్వం నుండి మూడెకరాల పొలాన్ని అప్పనంగా నూకేసినందుకు మహానుభావుడా! నూకేసినదాన్ని జనాలకి చూపించి దాన్లో బిల్డింగ్ కడతా అని జనాల సొమ్ము రెండు కోట్లు దండుకున్నందుకు మహానుభావుడా!! దండుకున్న సొమ్ముని దిగమింగినందుకు మహానుభావుడా!! చివరికి ఆ మూడెకరాల భూమిని దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు మీ అందరికి పంచినందుకు మహానుభావుడా!!’’ అంటూ ప్రచురించారు.

‘‘వాడు చేసిన లోఫర్ పనులకు కొన్ని శాఖల్లో ఉజ్జోగాలు పోనూక్కుని కొంత మంది రోడ్డున పడ్డందుకు వీడు మహానుభావుడా!! అసలు వీడు ఏ లెక్కన మహానుబావుడ్రా ఉడాల్ నాయాల??? వాడు ఏదన్నా మహానుభావుడు అయితే గీతే నీకు అవ్వతాడు.. ఎందుకంటే జనాల్ని ఎలా ముంచాలి, జనాల సొమ్ము ఎలా నూకాలి, మోసాలు ఎలా చెయ్యాలి, తార్పడు పనులు ఎలా చేయాలి, జనాల చేతిలో తన్నులెలా తినాలి, లాంటి లంగా పనులు మొత్తం ఓ గురువు మాదిరి నేర్పి పరన్నాజీవిలా జనాల మీద పడి బతకరా అని టక్కుటమారా విద్యలు మొత్తం నీకు నేర్పినందుకు నీకు మహానుభావుడు అయితే అయ్యుండొచ్చుగాని.. మిగతా ఏ ఒక్కడికి శ్రీరామమూర్తి మహానుభావుడు అయ్యేదానికి అవకాశం లేదు డోలేంద్ర.. ఈరోజు జమీన్ రైతు అనే పత్రిక ఈ విధంగా బ్రష్టు పట్టిపోవడానికి మొదట శంకుస్థాపన చేసిన మహానుభావుడు మాత్రం శ్రీరామ్మూర్తినే.. అలాంటి విషయాలలో అయితే అయ్యుండొచ్చు గాని మిగతా ఏ విషయాల్లో ఆయన మహానుభావుడు కాదు…’’ అని ఆ పోస్టులో అభిప్రాయపడ్డారు.

ఈ పోస్టుకు ముందు 8 భాగాలు అదే పత్రికపై వచ్చాయి. కానీ, ఇదంతా సీరియల్‌గా ఎందుకు వస్తున్నాయన్నది ఎవరూ గ్రహించే ప్రయత్నం చేయలేదు. ఒకవేళ చేసినా అందులోని అంతరాలలోకి ఎవరూ వెళ్లలేదు.