క్రాస్ ఓటింగ్ కలకలం!

249

గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి ఓటేసి పార్లమెంట్ ఎన్నికల్లో మరొకరికి ఓటేశారని దీని వల్ల ఫలితాలన్నీ తారుమారు అవుతాయని ఆందోళన చెందుతున్నారట. ఎక్కడైనా బెట్టింగ్ అనేది కామన్. అది రాజకీయం అయినా క్రికెట్ అయినా ఇంకేదైనా. ఏపీ ఎన్నికలపై కూడా బెట్టింగ్ కోట్లలో జరుగుతోందట. అసలు బెట్టింగ్ రాయుళ్లకు హద్దూ అదుపే లేదట. అయితే బెట్టింగ్ అంటేనే ఎక్కువగా జరిగే గోదావరి జిల్లాలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్‌కు ముందొచ్చిన వాళ్లు ఎందుకో కొంచెం అటూ ఇటూగా ఉన్నారట.

ముందుగా వైసీపీపై 100 శాతం నమ్మకంతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు ఏపీలో భారీ క్రాస్ ఓటింగ్ జరిగిందని అనుమానిస్తున్నారట. దీంతో లెక్కలు తప్పేలా ఉన్నాయని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు జనసేన వైపు మళ్లింది. గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఎంపీ స్థానాల్లో జనసేన గట్టి పోటీనే ఇస్తుందట. దీంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా జనసేన వైపుకు మొగ్గు చూపుతున్నారు. జనసేనపై బెట్టింగ్ వేయడానికి సిద్ధపడుతున్నారు. జనసేనపై కూడా ఇప్పుడిప్పుడు ఆసక్తి కనబరుస్తున్నారు.

మరోవైపు, ఈసారి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమని సర్వే వెల్లడించింది. ఈ సంస్థ ఏపీలో సర్వే నిర్వహించింది. ఈసందర్భంగా సర్వేలో జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందని సర్వే నిర్వాహకులు వెల్లడించారు. ఇదివరకు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సర్వే ఫలితాలను విడుదల చేసిన సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) సంస్థ తాజాగా ఏపీకి సంబంధించిన సర్వే ఫలితాలను విడుదల చేసింది. ఆ ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

ఆయన సారధ్యంలో సీపీస్ ఏపీలో రెండు సార్లు సర్వే నిర్వహించింది. ఫస్ట్ సర్వే ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు నిర్వహించగా, అందులో 4,37,642 శాంపిల్స్ తీసుకున్నారు. రెండో సర్వేను మార్చి 27 నుంచి 31 వరకు నిర్వహించగా అందులో 3,04,323 శాంపిల్స్ తీసుకున్నారు. రెండు సర్వేల ప్రకారం వైఎస్సాఆర్సీపీకి 48.1 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీకి 40.1 శాతం, జనసేనకు 8 శాతం ఓట్లు వచ్చాయి. వైఎస్సార్సీపీ 121 నుంచి 130 స్థానాల వరకు గెలుస్తుందని సర్వే వెల్లడించింది. టీడీపీ 45 నుంచి 54 స్థానాలు, జనసేకు ఒకటి రెండు స్థానాలు వస్తాయని సర్వే స్పష్టం చేసింది.

కాగా, ఏపీ ప్రజలు జగన్‌నే నమ్ముతున్నారని సర్వే వెల్లడించింది. చంద్రబాబు నాయకత్వంపై 39 శాతం ప్రజలు విశ్వాసం ఉంచగా జగన్‌పై మాత్రం ఏకంగా 46 శాతం మంది ప్రజలు నమ్మకంగా ఉన్నారని సర్వే వెల్లడించింది. మరోవైపు, మధ్యలో వచ్చిన పవన్ కల్యాణ్ ప్రభావం ఏమాత్రం ఉండబోదని ఈ సర్వే స్పష్టం చేసింది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ సరళిపై తెలుగుదేశం పార్టీ శనివారం నుంచి సమీక్షలు జరపనుంది. రోజుకు రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలపై సమీక్ష జరపాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ నేతలను సమీక్షకు ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఏరియా కోఆర్డినేటర్లు, ఇతర ముఖ్య నేతలు ఈ జాబితాలో ఉన్నారు.

రోజుకు 14 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. ఈసారి సమీక్షలను విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై మంగళగిరి వద్ద ఉన్న హ్యాపీ రిసార్ట్స్‌లో జరపనున్నారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద సమావేశాల నిర్వహణకు ఎన్నికల కోడ్‌ ఆంక్షలు ఉండటంతో స్ధలాన్ని మార్చారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసేందుకు ఈ సమావేశాలను వినియోగించుకోబోతున్నారు. సమావేశాల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను తెదేపా జాతీయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దన్‌, కార్యాలయ కార్యదర్శి రమణ, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దారపనేని నరేంద్ర తదితరులు పరిశీలించారు. మరోవైపు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

సీఎం పోలవరం పర్యటన ఖరారైతే ఆ రోజు ఉదయం జరగాల్సిన కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష తేదీలో మార్పు ఉండే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. సమీక్షలు జరిగే రోజుల్లో రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ఆ రోజుల్లో సమీక్ష సమావేశాలు ఉండవని పార్టీ వర్గాలు తెలిపాయి. సార్వత్రిక సమరంలో పోలింగ్‌ సరళి ఎలా ఉంది? విజయావకాశాల పరిస్థితి ఏంటి? తదితర అంచనాలతో తెదేపా లోక్‌సభ, శాసనసభ స్థానాల అభ్యర్థులు సిద్ధమయ్యారు. తాజా ఎన్నికల్లో తెదేపా నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులంతా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రేణులతో సమావేశమై, క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేసి సమగ్ర నివేదికలు సిద్ధం చేసుకున్నారు. రోజుకు రెండు లోక్‌సభ స్థానాల పరిధిలో సమావేశాలు జరపాలని అధినేత నిర్ణయించడంతో రోజువారీ 14 నియోజకవర్గాల నాయకులతో మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నెల 4న రాజమహేంద్రవరం, 6న కాకినాడ, అమలాపురం లోక్‌సభ స్థానాలకు సమీక్షలు చేపట్టనున్నట్లు సమాచారం అందింది. దీంతో తొలిరోజు సమీక్షకు ఆయా పరిధిలోని అభ్యర్థులు పయనమయ్యారు. జిల్లాలో మూడు పార్లమెంటు స్థానాలతో పాటు 19 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్‌ 11న సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితం వచ్చేలోగా అన్ని పార్టీలూ క్షేత్రస్థాయి పరిస్థితిపై అంచనాకు వచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఏప్రిల్‌ 22న అన్ని జిల్లాల పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు బూత్‌స్థాయి అంచనాలతో పాటు పోలింగ్‌ సరళిపైనా అంతా ఒకే ఫార్మెట్‌లో స్పష్టతకు రావాలని సూచించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో సిద్ధమైన నివేదికలపై సమీక్షించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ సరళిపై తెలుగుదేశం పార్టీ సమీక్షా సమావేశాలకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 50 మంది పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నారు. అందులో ఆ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఇతర నాయకులు ఉంటారు. బూత్‌స్థాయిలో ఓటరు నాడి ఏపార్టీకి అనుకూలంగా ఉందన్న అంచనాతో పాటు తెదేపా విజయానికి ఉన్న అవకాశాలపైనా సమీక్షించనున్నారు. ఇప్పటికే పార్టీ పరంగా తెప్పించుకున్న అంచనాలతో పాటు అభ్యర్థులకు ఇచ్చిన 39 పేజీల నివేదికకు సమాధానాల సారాంశాన్నీ బేరీజు వేసుకుని నియోజకవర్గాల వారీగా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో ఓట్ల లెక్కింపు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా అధినేత శ్రేణులను అప్రమత్తం చేయనున్నట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపునకు పంపే తెదేపా ఏజెంట్లలో పార్టీపై విధేయత ఉన్నవారు సాంకేతిక అంశాలపై అవగాహన ఉన్నవారు ఉండాలని ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. తొలిరోజు సమీక్ష రాజమహంద్రవరం లోక్‌సభ స్థానంతో పాటు ఆ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో జరగాల్సి ఉంది. రాజమహేంద్రవరం పార్లమెంటు అభ్యర్థితోపాటు రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, అనపర్తి, రాజానగరం అసెంబ్లీ అభ్యర్థులు నివేదికలతో సమీక్షకు సిద్ధమయ్యారు. అరకు పార్లమెంటు సమీక్ష కూడా శనివారమే జరగాల్సి ఉన్నా ఈనెల 22కి వాయిదా వేశారు. జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అరకు లోక్‌సభ పరిధిలో ఉండడంతో ఆ స్థానం నుంచి పోటీచేసిన తెదేపా అభ్యర్థి ఆ రోజు జరగనున్న సమీక్షకు హాజరవుతారు.

ఈ నెల 6న కాకినాడ లోక్‌సభతో పాటు ఆ పరిధిలోని తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటన ఖరారైతే, ఆ రోజు ఉదయం జరగాల్సిన కాకినాడ లోక్‌సభ నియోజకవర్గ సమీక్ష తేదీలో మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది.