విశాఖపట్నం, ఫిబ్రవరి 4 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డితో దళిత సంఘాల నాయకులు సమావేశమయ్యారు. ముదుగా ఏయూకు వీసీగా నియమితులు కావడం పట్ల హర్షం వ్యక్తం చేసి వీసీ ప్రసాద రెడ్డిని సత్కరించారు. విశ్వవిద్యాలయంలో దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగే దిశగా కృషిచేయాలని కోరారు. విశ్వవిద్యాలయం ప్రగతికి తమవంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో మాల మహానాడు వ్యవస్థాపకులు కె.బి.ఆర్. అంబేద్కర్, ఫూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గంజి చింతయ్య, దళిత లిబరేషన్ ఆర్గనైజేషన్ (డీఎల్‌ఓ) ఉత్తరాంధ్ర జిల్లా కార్యదర్శి బుంగ రాజు, రమాబాయి అంబేద్కర్ సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణ, ఎస్సీ సంక్షేమ సంఘం విశాఖ అర్బన్ అధ్యక్షుడు అద్దల జనార్ధన రావు, ఆచార్య ఎన్.ఏ.డి పాల్ తదితరులు పాల్గొన్నారు.