దళిత యువకుడి మృతిపై వెల్లువెత్తిన నిరసన

నర్సీపట్నం (విశాఖ జిల్లా), ఆగస్టు 11 (న్యూస్‌టైమ్): న‌ర్సీప‌ట్నంలో క‌ల‌క‌లం రేగింది. స్థానిక పెద్ద చెరువులో దుప్ప‌టితో క‌ట్టిన మృతదేహాన్ని స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో వెంట‌నే పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌డంతో పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఇక్కడి ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, మృత‌దేహం చెరువులో ప‌డేసి నాలుగు రోజులు అయి ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. మృతుడిని న‌ర్సీప‌ట్నానికి చెందిన గారా కిషోర్‌గా గుర్తించారు.

హతుడు కిశోర్

ఘ‌ట‌న‌ను ప‌రువుహ‌త్య‌గా పోలీసులు, హతుడి కుటుంబ సభ్యుల ప్రాధమికంగా భావిస్తున్నారు. కిషోర్ గత కొంతకాలంగా ఓ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని, ఇది ఇష్టం లేకే ప‌రువుహ‌త్య చేశార‌ని కిషోర్ త‌ల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా ఇద్ద‌రూ ప్రేమించుకుంటున్నార‌ని, అబ్బాయి అడ్డు తొలిగించేందుకే ఈ ఘాతుకానికి పాల్ప‌డి ఉంటార‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఘ‌ట‌న‌పై పట్టణ సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ కిషోర్ తల్లిదండ్రులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. కాగా, హతుడు కిషోర్ నర్సీపట్నం పోలీసు స్టేషన్లో పని చేస్తున్న లేడీ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అందువల్లే కిషోర్‌ను అమ్మాయి తల్లిదండ్రులే చంపేసి ఉంటారని ఆరోపించారు. రెండేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని, దీని నుంచి వదిలించుకునేందుకే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, కిషోర్ చావుకు కారణమైన కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేసి, ఆ కుటుంబాన్ని అరెస్టు చేయాలని నర్పీట్నం పోలీసుస్టేషన్ బయట రోడ్డుపై మృతుడి తల్లిదండ్రులు ఆందోళన బాధిత కుటుంబానికి మద్దతుగా కాలనీ వాసులంతా కలసిరోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.